Nizamabad

News June 5, 2024

NZB: అసెంబ్లీకి ఓడించిన.. పార్లమెంట్‌కు పంపించారు

image

ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేశారు. భారాస అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ చేతిలో 10,300 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న అర్వింద్ లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి వ్యూహం మార్చారు. మోదీ చరిష్మాకు తోడు.. తన వ్యూహానికి పదును పెట్టారు. 1.13 లక్షలకు పైగా మెజార్టీతో అర్వింద్ విజయం సాధించారు.

News June 4, 2024

ప్రశాంతంగా ముగిసిన నిజామాబాద్ పార్లమెంట్ కౌంటింగ్

image

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గంలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పోలైన ఓట్లను డిచ్పల్లి మండలం నడిపల్లిలోని సీఎంసీ కళాశాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ లెక్కించామన్నారు.

News June 4, 2024

ఎన్నికలను సాఫీగా నిర్వహించడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు: కలెక్టర్

image

ఎలాంటి ఆటంకాలు లేకుండా జిల్లాలో ఎన్నికలను సాఫీగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అంకితభావంతో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.

News June 4, 2024

ఇది మోదీ కుటుంబ సభ్యుల విజయం: ఎంపీ అరవింద్

image

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క నిజామాబాద్ మోదీ కుటుంబ సభ్యుల విజయమని ఎంపీ అరవింద్ అన్నారు. మంగళవారం ఆయన ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారన్నారు. తనపై నమ్మకంతో రెండోసారి గెలిపించిన ప్రజల ఆశలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

News June 4, 2024

NZB: ప్రజా తీర్పును గౌరవిస్తా: జీవన్ రెడ్డి

image

ప్రజా తీర్పును గౌరవిస్తానని NZB పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో MPగా గెలిచిన BJP అభ్యర్థి ధర్మపురి అరవింద్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన అరవింద్ NZB పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, ఇప్పుడైనా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అరవింద్ కు సూచించారు.

News June 4, 2024

NZB: ఎమ్మెల్యేగా ఓడి.. ఎంపీగా గెలిచి..!

image

నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ సిట్టింగ్ బీజేపీ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. కాగా ప్రస్తుతం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ప్రత్యర్థి అభ్యర్థి జీవన్ రెడ్డి పై భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు.

News June 4, 2024

నిజామాబాద్: బీజేపీ తగ్గేదేలే..!

image

నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం భారీ మెజార్టీ దిశగా ధర్మపురి అర్వింద్ దూసుకెళ్తున్నారు.1,22,890 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి

image

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం వెళ్లిపోయారు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ లక్షకు పైగా మెజారిటీతో ఆధిక్యంలో ఉండడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల తీర్పును శిరసా వహిస్తానని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు అర్వింద్ హామీలను అమలు చేయాలని కోరారు.

News June 4, 2024

1,00,760 ఓట్ల ఆధిక్యంలో ధర్మపురి అర్వింద్

image

నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ధర్మపురి అర్వింద్ 1,00,760 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

నిజామాబాద్: కొనసాగుతున్న బీజేపీ హవా

image

నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ధర్మపురి అర్వింద్ 58,306 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.