Nizamabad

News June 4, 2024

NZB: కౌంటింగ్ కేంద్రాల్లో స్పృహ తప్పి పడిపోయిన ఉద్యోగి

image

నిజామాబాద్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో మంగళవారం ఉదయం ఎన్నికల సిబ్బంది ఒకరు స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయనను వెంటనే సిబ్బంది 108లో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు. కాగా ఆ ఉద్యోగిని జిల్లాలోని బడా భీంగల్ కు చెందిన జె.నవీన్ గా ఆయన ఐడెంటిటీ కార్డు ద్వారా గుర్తించారు.

News June 4, 2024

NZB: BRS మాజీ మంత్రి, MLA ఇలాకాలో BJP అభ్యర్థి హవా

image

NZB పార్లమెంట్ కౌంటింగ్ లో బాల్కొండ నియోజకవర్గంలో BRS మాజీ మంత్రి, MLA ఇలాకాలో BJP అభ్యర్థి అర్వింద్ ధర్మపురి హవా కొనసాగుతోంది. 8వ రౌండు కౌంటింగ్ వరకు మొత్తం 97,909 ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు అరవింద్ ధర్మపురి 49,865 ఓట్లు సాధించి 16,891 మెజారిటీతో ఉన్నారు. ఇక 32,974 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 2వ స్థానంలో, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ 9,452 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

News June 4, 2024

మూడో రౌండ్‌లో ధర్మపురి అర్వింద్ ముందంజ

image

నిజామాబాద్ ఎంపీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి పై 29,683 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

జహీరాబాద్‌లో కాంగ్రెస్ హవా

image

జహిరాబాద్‌లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షట్కార్ 13,074 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

NZB: కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయిన BRS కౌంటింగ్ ఏజెంట్లు

image

నిజామాబాద్ పార్లమెంట్ కౌంటింగ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో వెనుకబడిపోయిన పోలింగ్ ఓట్లను చూసి నిరాశ పడిన పలువురు BRS కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ హాల్ నుంచి నిరాశతో బయటకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్తున్నారని మీడియా పాయింట్ వద్ద నిలబడిన పలువురు జర్నలిస్టులు వారిని ప్రశ్నిస్తే ఇంకేముంది అంటూ పెదవి విరుస్తూ మెల్లగా జారుకున్నారు.

News June 4, 2024

నిజామాబాద్: ధర్మపురి అర్వింద్ ముందంజ

image

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల లెక్కింపులో మెుదటి రౌండులో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ముందంజంలో ఉన్నారు. మెుదటి రౌండులో అర్వింద్ కు 6,506, రెండవ రౌండులో 6114 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మెుదటి రౌండులో 628 ఓట్లు, 519 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి 4,776, రెండవ రౌండులో4731 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ధర్మపురి అర్వింద్‌కు 3113 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

నిజామాబాద్‌లో బీజేపీ లీడ్

image

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా మొదట పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు చేపట్టారు. నిజామాబాద్ లో మొత్తం 7414 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. పోస్టల్ ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో బీజేపీలో లీడ్‌లో ఉంది.

News June 4, 2024

రాష్ట్రంలో మెుదటి ఫలితం నిజామాబాద్‌దే..!

image

రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. తొలి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట వరకే వెలువడే అవకాశం ఉంది. తుది ఫలితం సాయంత్రం 6 గంటల వరకు వచ్చే అవకాశం ఉంది. కాగా తొలి ఫలితం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో వెలువడనుంది. ఈ నియోజకవర్గంలో కేవలం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. కాగా ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.

News June 3, 2024

RTV Survey: NZB, ZHBలో BJP గెలుపు!

image

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల సందర్భంగా RTV Survey‌‌ తాజాగా వివరాలు వెల్లడించింది‌. రాష్ట్రంలో BJP-10, INC-6, BRS-0, MIM- ఒక స్థానంలో‌ గెలిచే అవకాశం ఉన్నట్లు‌ తెలిపింది. నిజామాబాద్, జహీరాబాద్‌లో‌ BJP‌ గెలవబోతున్నట్లు‌ RTV Survey‌‌ పేర్కొంది. నిజామాబాద్, జహీరాబాద్‌లో కాంగ్రెస్, BRS ఖాతా తెరవదని‌ అంచనా వేసింది. దీనిపై మీ కామెంట్?

News June 3, 2024

KMR: అన్న భూమిపట్టా మార్పిడి చేయలేదని తమ్ముడి ఆత్మహత్య

image

నాగిరెడ్డిపేట మండలం బెజ్గం చెరువు తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రగుంట తండాకు చెందిన మలావత్ కేవుల (36) కల్లులో విషం కలుపుకొని మృతి చెందినట్లు ఎస్సై రాజు తెలిపారు. మృతుడి కేవులకు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. పెద్దవాడైన సక్రు పైన భూమి పట్టా ఉన్నందున తన పేరు పై పట్టా మార్పిడి చేయాలని పలుమార్లు కోరాడు. అన్న సక్రు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది కేవుల సూసైడ్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.