Nizamabad

News July 6, 2024

జుక్కల్ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్

image

జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపాలనలో భాగస్వామ్యం కావడానికి భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం ఓ ప్రకటనలో తెలిపారు

News July 6, 2024

బోధన్: ఒంటిపై వేడి నీళ్లు పడి వృద్ధురాలి మృతి

image

ఒంటిపై వేడి నీళ్లు పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన బోధన్‌లో జరిగింది. సాలూరకు చెందిన లక్ష్మీ బాయ్(71) జూన్ నెల 28న హున్సాలోని కూతురు ఇంటికి వెళ్లింది. బాత్‌రూమ్‌కు వెళ్తుండగా నీళ్ల బకెట్‌ తగలడంతో నీళ్లు ఒంటిపై పడి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం NZB ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI నాగనాథ్ తెలిపారు.

News July 6, 2024

నిజామాబాద్‌లో నేటి నుంచి ధ్రువపత్రాల పరిశీలన

image

ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు సంబంధించి శనివారం తొలివిడత ధ్రువపత్రాల పరిశీలన నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించనున్నట్లు కౌన్సెలింగ్ సమన్వయకర్త శ్రీరాంకుమార్ తెలిపారు. ఈ నెల 13వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థులు ఈనెల 12 వరకు స్లాట్ బుక్ చేసుకోవాలని, ఈ నెల 8 నుంచి 10 వరకు వెబ్ఆప్షన్స్ పెట్టుకోవచ్చన్నారు. విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

News July 6, 2024

నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం

image

జిల్లాలోని నవీపేట మండలం కమలాపూర్, మోకన్ పల్లి శివారులో శుక్రవారం చిరుత కనిపించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన గాంధీ తన మేకలను తీసుకొని గుట్టకు వెళ్లాడు. సాయంత్రం చిరుత తన మందపై దాడి చేసినట్లు రైతు పేర్కొన్నారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలపడంతో NZB బీట్ ఆఫీసర్ సుధీర్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ జహుర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి చిరత సంచారం నిజమేనని వెల్లడించారు.

News July 6, 2024

బాసరలో ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం

image

ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన బాసరలో చోటుచేసుకుంది. నిజామాబాద్‌కి చెందిన ఓ మహిళ తన భర్తతో గొడవ పడి మనస్తాపంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. పిల్లలను గోదావరిలో తోసేందుకు ప్రయత్నించగా స్థానికులు చూసి అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా బాసర ఎస్ఐ గణేశ్ వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు.

News July 6, 2024

సదాశివనగర్: రైతుపై కత్తులతో దాడి చేసిన దుండగులు

image

రైతుపై కత్తులతో దాడి చేసిన ఘటన సదాశివనగర్ మండలం ఉత్తనూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పర్వతరావు (62) గురువారం పంటచేనులో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేశారు. దీంతో అతడు పరుగెత్తి సమీపంలోని ఓ ఇంట్లో దాక్కున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. దాడికి గల వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

పారిస్ ఒలంపిక్స్‌కి అర్హత సాధించిన నిఖత్ జరీన్

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ ఈ నెల 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనుంది. బాక్సింగ్‌లో 50 కేజీల విభాగంలో ఆమె చోటు దక్కించుకొంది. కాగా జిల్లా నుంచి ఒలింపిక్స్‌లో చోటుసాధించిన మొదటి క్రీడాకారిణిగా నిఖత్ చరిత్ర సృష్టించారు. నిఖత్ 2023 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది.

News July 6, 2024

NZB:7న జిల్లా స్థాయి రెజ్లింగ్ క్రీడాకారుల ఎంపికలు

image

నిజామాబాద్ జిల్లా మ్యాట్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7న జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సెక్రెటరీ దేవేందర్ తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో గల రెజ్లింగ్ హాల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. పురుషులకు ఫ్రీ స్టైల్ విభాగంలో, గ్రీకో రోమన్ విభాగంలో, అదేవిధంగా మహిళలకు ఫ్రీ స్టైల్ లో కేటాయించిన కేటగిరీలలో ఎంపికలు ఉంటాయన్నారు.

News July 5, 2024

పిట్లం: UPDATE.. చిన్న గొడవ.. చెరువులో దూకి ఆత్మహత్య

image

పిట్లంలోని మారేడ్ చెరువులో పడి మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. SI నీరేష్ వివరాలిలా.. పిట్లం వాసి చిలుక అంజవ్వకు (41) ఇవాళ తన అత్త మానేవ్వతో గొడవ జరిగింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైనా అంజవ్వ క్షణికావేశంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి బాలవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News July 5, 2024

నిజామాబాద్ జిల్లాలో వానల్లేవ్

image

వర్షకాలం ప్రారంభమై నెల రోజులవుతున్నా ఉమ్మడి జిల్లాలో వర్షాలు సరిగ్గా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్లలో నీళ్లు పెద్దగా రావట్లేదని ఈసీజన్లో 5.20లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. వరి 3,13,965 ఎకరాలు, సోయా 85,444ఎకరాలు, మక్క 57,315ఎకరాలు, పత్తి 28,730ఎకరాలు, కంది 13,961ఎకరాలు, పెసర 4,997ఎకరాలు, మినుము 5,263ఎకరాల్లో పండిస్తున్నారు. ఇప్పటికి 40శాతం పంటలు సాగయ్యాయి.