India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చెరువులో పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన పిట్లంలో శుక్రవారం జరిగింది. పిట్లం గ్రామానికి చెందిన చిలుక అంజవ్వ(38) గ్రామంలోని మారేడ్ చెరువు వైపు వెళ్తుండగా.. ఆమెను చూసిన కొందరు.. కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ లోగా వారు వచ్చి చూసేసరికి ఆమె చెరువులో పడి ఉంది. ఆమెను ఒడ్డుకు చేర్చగా అప్పటికే మృతి చెందింది. ప్రమాదవశాత్తు ఆమె కాలు జారి పడిందా.. ఆత్మహత్య చేసుకుందా తెలియాల్సి వుంది.
UKలో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన చంద్ర కన్నెగంటి ఓటమిపాలయ్యారు. ఈయన కన్జర్వేటివ్ పార్టీ తరఫున స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి పోటీ చేశారు. ఫలితాల్లో చంద్రకు 6221 ఓట్లు మాత్రమే రావటంతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. కోటగిరికి చెందిన చంద్ర చదువు పూర్తి చేసిన తర్వాత లండన్ వెళ్లి స్థిరపడ్డారు. జనరల్ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
అనారోగ్యం కారణంగా ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌లో జరిగింది. జిల్లాలోని మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన ఈరవత్రి శ్రీనివాస్ (36) కండక్టర్‌గా పని చేస్తూ నిజామాబాద్ నాందేవ్ వాడాలో అద్దెకు ఉంటున్నాడు. కిడ్నీ నొప్పి భరించలేక గురువారం రాత్రి రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సదాశివనగర్ మండలంలోని కల్వరాల్ శివారులో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానిక రైతులు గురువారం తెలిపారు. దీంతో ప్రధానంగా రైతులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ పంటలు వేసే సమయంలో ఎలుగుబంటి రావడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకుని ఇతర ప్రాంతానికి తరలించాలని రైతులు కోరుతున్నారు.
విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇందల్‌వాయి మండలం గౌరారంలో గురువారం జరిగింది. పోలీసుల వివరాలు.. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు మరమ్మతులు చేస్తూ జీవించే పరమేశ్వర్ వ్యవసాయ పొలంలో పని చేస్తుండగా 11 కేవీ వైరు తగిలి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ తెలిపారు.
పోలీసులు నిత్యం వాహనాలు తనిఖీ చేస్తూ.. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తున్నా వాహన చోదకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కామారెడ్డి జిల్లాలో ఆరు నెలల వ్యవధిలో 4106 కేసులు నమోదయ్యాయి. వీరిలో 58 మందికి జైలు శిక్షలు విధించారు. కేసులు నమోదైన వారందరికీ జరిమానాలు విధించారు. ఇందుకు ప్రధాన కారణం ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిన అక్రమంగా మద్యం అమ్మకాలు జరగడమే. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌ను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. గురువారం నిజామాబాద్‌లోని ఆయన ఇంటికెళ్లిన వేముల ధర్మపురి సంజయ్‌ను పరామర్శించారు. అనంతరం డీ. శ్రీనివాస్ మృతిపై వారి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వారితో పాటు ఇతర నాయకులు ఉన్నారు.
రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళ సంతరించుకుంది. వానా కాలం ప్రారంభంలో సరైన వర్షాలు లేక నదులు, నీరు లేక చెరువులు వెలవెలబోయాయి. అయితే కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పాటు జులై 1న బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి దిగువకు నీరు వదలడంతో గోదావరికి వరద నీరు వస్తోంది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించడానికి వస్తున్నారు.
ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు జులై 31 వరకు గడువు పొడిగించినట్లు కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జూన్ 30తో ముగిసిన గడువును సప్లిమెంటరీ విద్యార్థుల కోసం జులై 31 వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా ఇప్పటి వరకు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో 1,700 మంది విద్యార్థులు చేరినట్లు పేర్కొన్నారు.
ఓ బాలుడు స్నేహితుడి ఇంట్లో చోరీ చేసి వారితోనే PSలో ఫిర్యాదు చేసిన ఘటన NZBలో జరిగింది. బొబ్బొలి వీధికి చెందిన మాధవి ఇంటి మరమ్మతులు చేసినందుకు ఆమె కుమారుడి ఫ్రెండ్‌కి కొంత డబ్బు ఇచ్చింది. కాగా ఆ బాలుడు వారి ఇంట్లో జూన్ 27న రూ.2.20లక్షలు చోరీ చేశాడు. ఈనెల 2న బీరువాలో డబ్బు కనిపించకపోవడంతో మాధవి వారిద్దరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడిని నింధితుడిగా గుర్తించారు.
Sorry, no posts matched your criteria.