Nizamabad

News July 4, 2024

కామారెడ్డి: ప్రేమ పేరుతో మోసం.. పోక్సో కేసు నమోదు

image

యువకుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన లింగంపేట్‌లో చోటు చేసుకుంది. పరిమళ గ్రామానికి చెందిన ఓ బాలికకు మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన భాస్కర్‌(24)తో ఇన్‌స్టాలో పరిచయమైంది. దీంతో అమ్మాయికి మాయ మాటలు చెప్పి ప్రేమపేరుతో దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసులు తెలిపారు.

News July 3, 2024

టీయూలో పీజీ చేస్తూ.. ఎస్బీఐలో ఉద్యోగం

image

టీయూలో ఎంఏ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ధర్మపురి సాయికుమార్ ఎస్బీఐలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగం సంపాదించడం అభినందనీయమని ఎకనామిక్స్ విభాగాధిపతి డా.పున్నయ్య పేర్కొన్నారు. అధ్యాపకుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా సాయికుమార్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. డా.సంపత్, డా.నాగరాజు, డా.స్వప్న, డా.శ్రీనివాస్, డా.దత్తహరి విద్యార్థులు పాల్గొన్నారు.

News July 3, 2024

కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

image

కామారెడ్డి జిల్లాలో మంగళవారం కురిసిన వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో ఇలా ఉన్నాయి. పిట్లంలో12.5, సదాశివనగర్‌లో 10.8, లింగంపేటలో 10.3, బిక్కనూరులో 10, నిజాంసాగర్‌లో 9.5, కామారెడ్డిలో 9.3, మద్నూర్లో 8.5, రాజంపేటలో 7.3, గాంధారి, బాన్సువాడలో 5.5, నిజాంసాగర్‌లో 5.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసిందని జిల్లా ముఖ్యప్రణాళిక అధికారి రాజారాం తెలిపారు.

News July 3, 2024

NZB: ‘పదెకరాల్లోపు ఉన్నవారికే రైతుభరోసా ఇవ్వండి’

image

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం చేపట్టనున్న రైతుభరోసా పథకంపై రైతుల సూచనలు కోరుతోంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 89 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. ఇప్పటివరకు 60 సంఘాల్లో మీటింగ్స్ నిర్వహించారు. 29 సంఘాల్లో సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు తీసుకున్న అభిప్రాయాల్లో 60 శాతం మంది 10ఎకరాల లోపు ఉన్నవారికే రైతుభరోసా ఇవ్వాలని చెబుతున్నారు. గుట్టలు, బీడు భూములకు ఇవ్వొదని కోరుతన్నారు.

News July 3, 2024

ఆ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: MP అరవింద్

image

ఉత్తరప్రదేశ్ హాథ్రస్ తొక్కిసలాట దుర్ఘటన పట్ల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు రాసుకొచ్చారు.

News July 3, 2024

పోచారం శ్రీనివాస్ రెడ్డి హాట్ కామెంట్స్

image

‘ఎప్పుడైనా లోకల్ లోకలే. బయట నుండి వచ్చిన వాళ్లు అద్దెకు ఉండేవారు మాత్రమే’ అంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాసుల బాలరాజు మంగళవారం పోచారంను తన అనుచరులతో కలువగా పోచారం మాట్లాడుతూ.. బాలరాజుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తే వాళ్లకు కడుపు నొప్పి ఎందుకు ? అంటూ కాంగ్రెస్‌లోని ఒక వర్గాన్ని ఉద్దేశించి అన్నారు.

News July 2, 2024

ముఖ్యమంత్రి ఫోన్ చేసి అభిప్రాయం అడిగారు: బాలరాజు

image

పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి అభిప్రాయం అడిగారని కాంగ్రెస్ నాయకుడు కాసుల బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నదని, పోచారం వస్తే అత్యంత బలంగా మారుతుందని, గతంలో కూడా తాను శీనన్నతో కలిసి పనిచేశాను, ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తానని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు.

News July 2, 2024

NZB: జులై 4న విద్యాసంస్థల బంద్: PDSU

image

ఈ నెల 4న కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని NSUI, SFI, AISF, PDSU, AIPSU నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్‌లో PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, SFI జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేశ్ మాట్లాడుతూ.. జులై 4 న జరిగే దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు ప్రైవేట్ యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News July 2, 2024

టీయూ: బ్యాక్ లాగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల పరిధిలోని వన్ టైం ఛాన్స్ (సీబీఎస్ఈ) బీఏ, బీ.కాం, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సులకు సంబంధించి ఐదవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య అరుణ మంగళవారం తెలిపారు. ఆగస్టు 4వరకు కొనసాగనున్న ఈ పరీక్షలు ఉదయం 10గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం.ల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు గమనించాలన్నారు.

News July 2, 2024

ముఖ్యమంత్రి ఫోన్ చేసి అభిప్రాయం అడిగారు: బాలరాజు

image

పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఫోన్ చేసి అభిప్రాయం అడిగారని కాంగ్రెస్ నాయకుడు కాసుల బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నదని, పోచారం వస్తే అత్యంత బలంగా మారుతుందని, గతంలో కూడా తాను శీనన్నతో కలిసి పనిచేశాను, ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తానని ముఖ్యమంత్రికి చెప్పానన్నారు.