India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ జిల్లాలో ఈ వానాకాలం మొదటిసారి ముసురు ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం మొదలైన వర్షం కొనసాగుతూనే ఉంది. జిల్లా అంతటా రుతు పవనాలు విస్తరించడంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కూడా వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తోంది. నెల రోజులుగా వానలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. కానీ, ఇప్పుడు ముసురుకోవడంతో రైతులు మురిసిపోతున్నారు.
నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పరిధిలో గుర్తు తెలియని యువకుడు మురుగు కాలువలో పడి మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రెండో పోలీస్ స్టేషన్ ఎస్సై రామ్ అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో కలత చెంది ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతి చెందారు. ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపిన వివరాలు.. సిద్ధాపూర్ గ్రామానికి చెందిన సుద్ధపల్లి చంద్రన్న(47) వ్యక్తి కొంతకాలంగా నవీపేట మండలం జన్నేపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కేసు, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్‌లో టమాట రైతు పంట పడింది. గ్రామానికి చెందిన స్వరూప భూంరెడ్డి దంపతులు ఎకరం భూమిలో రెండు నెలల మల్చింగ్పద్ధతిలో టమాట సాగు చేశారు. ప్రతి రోజు టమాటలను తెంపి 30కి పైగా బాక్సుల్లో కామారెడ్డి, HYDకు తరలిస్తున్నామని, ప్రస్తుతం కిలో టమాటా రూ.70 నుంచి రూ. 100 వరకు పలకడంతో.. రూ. 10 లక్షల లాభం ఉందని సదరు రైతు తెలిపారు.
నేరాల సంఖ్య తగ్గించి బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు కొత్త నేర చట్టాలను జిల్లాలో నేటి నుంచి పోలీస్‌శాఖ అమలు చేయనుంది. అందుకోసం పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న 1040 మందికి కొత్త చట్టాలపై శిక్షణ ఇచ్చారు. మారిన కొత్త చట్టాల గురించి బాధితులకు వివరించడానికి జిల్లా లీగల్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయనుంది.
రైతులు న్యాయ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి సివిల్ జడ్జ్ సుధాకర్ చెప్పారు. మండల కేంద్రంలో న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయినప్పుడు న్యాయపరంగా పొందే హక్కుల గురించి ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు.
ఎల్లారెడ్డి మండలం జంగమైపల్లికి చెందిన పూజారి హనుమయ్య (62) అనే రైతు ఆదివారం వ్యవసాయ పొలంలో కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వరి నాట్లు వేస్తుండగా బోరు మోటారు బంద్ చేసేందుకు స్టార్టర్ వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి ఎస్సై మహేశ్ చేరుకొని పరిశీలించారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో ఒకరు అనుమానస్పదంగా మృతి చెందారు. మృతుడు జిరాయత్ నగర్ కాలనీకి చెందిన రవిగా స్థానికులు గుర్తించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ధర్మపురి శ్రీనివాస్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. ఆయన మృతిపై ప్రధాని మోదీ ‘X’లో సంతాపం వ్యక్తం చేశారు. ‘పేదల సాధికారత కోసం శ్రీనివాస్ పని చేశారు. ఆయన మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. DS మృతికి ఇదే నా ప్రగాఢ సానుభూతి’ అని తెలిపారు. DSకు మాజీ ఉప రాష్ట్రపతి , కేంద్రమంత్రులు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి కేటీఆర్ నివాళులర్పించిన విషయం తెలిసిందే.
మద్యం మత్తులో తండ్రి కొడుకుని కడతేర్చిన ఘటన కామారెడ్డి(D) ఎల్లారెడ్డి(M)లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గండి మాసానిపేట్‌కు చెందిన వెంకటేశంకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు సాయిలు(40) మద్యానికి బానిసై ఆస్తి కోసం తండ్రితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో విసుగు చెందిన వెంకటేశం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిలును కర్రతో బాది చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి సమీపంలోని కాలువలో పడేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.