India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ధర్మపురి శ్రీనివాస్ అంతక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తున్న నేపథ్యంలో అంతక్రియలకు సీఎంతో పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడంతో ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. బిక్నూరులో అర్ధరాత్రి యువకులు ద్విచక్ర వాహనం ర్యాలీ నిర్వహించి స్థానిక సినిమా టాకీస్ చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేత బూని యువకులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిట్లంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద క్రికెట్ అభిమానులు టపాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ పార్థివ దేహాన్ని HYD నుంచి శనివారం సాయంత్రం NZBలోని ప్రగతి నగర్‌లో ఆయన నివాసానికి తీసుకొచ్చారు. అక్కడ నిజామాబాద్ జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు. DS పార్థివ దేహాన్ని చూసి కొందరు కంటతడి పెట్టారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వివిధ కుల సంఘాల నాయకులు DS భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఆర్మూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి పక్కన బోర్గాం (కె) మూల మలుపు వద్ద రెండు పాడైన సిమెంట్ పైపులు (గూణలు) ఉన్నాయి. వాటిని ఇల్లుగా మార్చుకొని ఓ వృద్ధురాలు జీవిస్తోంది. భర్త చనిపోయారని, నా అనే వారు ఎవరు లేరని, ఉండటానికి ఇల్లు సైతం లేదని ఆమె పేర్కొంది. దాతలు ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ జీవిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును ఇంటర్ విద్యాశాఖ పొడిగించినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. వచ్చే నెల 31 వరకు 2వ విడత అడ్మిషన్ కొనసాగుతుందని చెప్పారు. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సంబంధిత కళాశాలలకు వెళ్లి వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన డి. శ్రీనివాస్‌కు ప్రణబ్ ముఖర్జీ, జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మనందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలతో సన్నిహత సంబంధాలు ఉన్నాయి. సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు ఉంది. కాగా ఆయన 2013 నుంచి 2015 వరకు ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసి టీఆర్ఎస్‌లో చేరారు.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో 1948 సెప్టెంబర్ 27న జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ NSUI కార్యకర్తగా చేరి దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. RBIలో ఉద్యోగం చేస్తుండగా దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పిలుపుమేరకు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. దివంగత నేత అర్గుల్ రాజారాం శిష్యుడిగా నిజామాబాద్ రాజకీయాల్లో ధర్మపురి శ్రీనివాస్ చక్రం తిప్పారు.
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. డీఎస్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మంత్రులు పొన్నం, కొమటిరెడ్డి, బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళి అర్పించారు.
నేడు మరణించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (డీఎస్) పార్ధీవదేహానికి రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ఆదేశించారు. ఈ మేరకు రేపు డీఎస్ స్వస్థలం నిజామాబాద్ లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఈ తెల్లవారు జామున కన్నుమూశారు. కాగా ఆయన 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తిచేశారు. 1989లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఆయన NZB అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో MLAగా గెలిచారు. 1998లో ఉమ్మడి ఏపీ PCC అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్ మంత్రిగా సేవలందించారు.
Sorry, no posts matched your criteria.