Nizamabad

News June 29, 2024

BRSలో చేరి మళ్లీ కాంగ్రెస్‌లోకి..

image

డి శ్రీనివాస్ ఈ తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు ఉమ్మడి రాష్ట్రంలో ఒక దశలో ముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే అందరు భావించారు. రాజకీయ పరిస్థితుల వల్ల అది కుదరలేదు. కాగా రాష్ట్ర విభజన తర్వాత 2015లో బిఆర్ఎస్‌లో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్ఎస్‌లో ఆయనకు తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో స్తబ్దుగా ఉండిపోయారు. అనంతరం ఇటీవల కాలంలో మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

News June 29, 2024

డీఎస్ మరణం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన ఎంపీ అర్వింద్

image

తన తండ్రి D.శ్రీనివాస్ మృతి పట్ల ఎంపీ అర్వింద్ FB ఎమోషనల్ పోస్టు చేశారు. ‘అన్నా అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY! నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే..! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు. వారి కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్న..! నువ్వు ఎప్పటికీ మాతోనే ఉంటావు, ఎప్పటికీ మాలోనే ఉంటావు’ అని పోస్ట్ చేశారు.

News June 29, 2024

NZB: పదవుల రేసులో ఆ ఇద్దరు నేతలు

image

ఢిల్లీలో కాంగ్రెస్ PCC అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపై కసరత్తు సాగుతోంది. జిల్లా నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. MLC మహేశ్‌కుమార్ గౌడ్, అధ్యక్షపీఠాన్ని ఆశిస్తున్నారు. NZBఎంపీగా 2సార్లు గెలిచిన మధుయాష్కీ కూడా ఈ పదవీ కోసం ప్రయత్నిస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణలో జిల్లాకు ప్రాతినిధ్యం లభించలేదు. కాగా జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News June 28, 2024

NZB: జీజీహెచ్‌లో బోధనా వైద్యుల నిరసన

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట శుక్రవారం బోధనా వైద్యులు ఆందోళన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోధనా వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్. కిరణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. నల్గొండలోని జనరల్ ఆస్పత్రిలో వైద్యుల హాజరును పర్యవేక్షించేందుకు రోజుకో ఆఫీసర్‌ను నియమిస్తూ అక్కడి కలెక్టర్ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

News June 28, 2024

నిజామాబాద్ : BRS నేతలతో సమావేశమైన కేసీఆర్

image

కామారెడ్డి జిల్లాలోని BRS మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, BRS అధినేత KCRను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ BRS జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు.

News June 28, 2024

NZB: రైలు ఢీకొని వృద్ధుడు మృతి

image

పట్టాలు దాటుతున్న ఓ వృద్ధుడు రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. సికింద్రాబాద్ జీర్పీ పోలీసుల ప్రకారం NZB జిల్లా కోటగిరికి చెందిన పెద్దరాజు(69) తిరుపతి వెళ్లి వస్తానంటూ బుధవారం ఇంటి నుంచి వెళ్లాడు. కాగా రైలులో చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. గురువారం పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 28, 2024

నిజామాబాద్: వ్యభిచార గృహంపై దాడులు

image

నిజామాబాద్ నగరంలోని మూడవ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్‌లో రాంమందిరం వెనుక వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం సాయంత్రం కొందరు వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు మూడవ టౌన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మెరుపు దాడి చేశారు. దాడిలో ఒక నిర్వాహకురాలితో పాటుగా, బిఎల్‌ఎఫ్ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఓ బాధిత మహిళను సఖి కేంద్రానికి తరలించారు.

News June 28, 2024

పిట్లం: మంజీర నదిలో దూకి మహిళ ఆత్మహత్య

image

పిట్లం మండలం కారేగాం గ్రామానికి చెందిన సుగుణ(36) బొల్లక్‌పల్లి గ్రామ సమీపంలోని మంజీరానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆటువైపు వెళ్తున్న వారు గమనించి 100 డయల్‌కు సమాచారం అందించారు. దీంతో పిట్లం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. సుగుణ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. సుగున భర్త మృతిచెందగా ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.

News June 28, 2024

నిజాంసాగర్‌కు గోదావరి జలాలు

image

నిజాంసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గుతున్నాయి. అయితే ఇటీవలే ఆయకట్టు రైతుల విజ్ఞప్తి మేరకు నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేసేందుకు కార్యాచరణ రూపొందించి రెండు విడతల్లో 2.5 టీఎంసీల మేర విడుదల ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకపోవటంతో అధికారులు కొండపొచమ్మ సాగర్ నుంచి రెండు టీంసీల నీరు విడుదల చేయాలని కోరగా ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

News June 28, 2024

జుక్కల్: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన

image

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యూత్ నాయకులు నల్లబట్టలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ అసెంబ్లీ యూత్ అధ్యక్షుడు ఇమ్రోజ్ మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావ్ ఆదేశాల మేరకు నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి విజయ్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.