Nizamabad

News March 17, 2024

నిజామాబాద్: లోక్ సభ ఎన్నికలు.. ప్రజావాణి రద్దు

image

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజావాణి ఉండదని, ఎన్నికల తర్వాత యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని, ఈ విషయం గుర్తించి ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు.

News March 17, 2024

KMR: జోరుగా వర్షం.. అత్యధికంగా ఇక్కడే..

image

జిల్లాలో నిన్న జోరుగా వర్షం కురిసింది. అత్యధికంగా కామారెడ్డి మం. పాత రాజంపేట్ లో 34.0 మి.మీ, వర్షపాతం నమోదైంది. ఇక.. బీర్కూర్ 21.0 మి.మీ, నస్రుల్లాబాద్ 18.5 మి.మీ, నస్రుల్లాబాద్ (మం) బొమ్మందేవ్ పల్లి 15.5 మి.మీ, గాంధారి (మం) రామలక్ష్మణ్ పల్లి 11.0 మి.మీ, మచారెడ్డి (మం) లచ్చంపేట 10.8 మి.మీ, పిట్లం 7.3 మి.మీ, మద్నూర్ (మం) మెనూర్ 7.0 మి.మీ,బిచ్కుంద (మం) పుల్కల్ 6.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

News March 17, 2024

లింగంపేట: పెళ్లికి వెళ్లొస్తున్న ఆటో బోల్తా.. ఇద్దరి మృతి

image

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాలు.. నిజాంసాగర్ మండలం సింగితం, గున్కుల్, వడ్డెపల్లి నుంచి పలువురు కొర్పోల్‌లో పెళ్లికి వెళ్లారు. రిటన్‌లో 12 మందితో వస్తున్న ఆటో బాయంపల్లి శివారులో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో సంగయ్య, లావణ్య మృతి చెందారు. క్షతగాత్రులను ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

News March 17, 2024

NZB: వడగళ్ల వాన.. అన్నదాత ఆగమాగం

image

ఉమ్మడి జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన అన్నదాతలను ఆగమాగం చేసింది. ప్రధానంగా ఇంధల్వాయి, డిచ్‌పల్లి, సిరికొండ, ధర్పల్లి, జుక్కల్ నియోజకవర్గంలో పడిన ఈ రాళ్లతో కోతకు వచ్చిన వరి నేలరాలింది. పూతకు వచ్చిన నువ్వుల పంట విరిగిపోగా.. మామిడి పిందెలు రాలిపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అకాల వర్షానికి దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News March 17, 2024

కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వర్షం

image

రామారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో వడగళ్ల వర్షం కురిసింది. రైతులు సాగు చేసినా వరి పంటతో పాటు మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా ఎదురుగా కూడిన వడగళ్ల వర్షం రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండల కేంద్రంతో పాటు రెడ్డి పేట, పోసానిపేట గ్రామాలలో పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలుల వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

News March 16, 2024

ఆర్మూర్: మూడు ఇళ్లలో చోరీ

image

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 21, 22 వార్డులలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నయీముద్దీన్ ఇంట్లో నుంచి దాదాపు రూ.2 లక్షల నగదు, 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు. షబానా బేగం ఇంట్లో నుంచి రూ.80వేలు, తులం బంగారం ఎత్తుకెళ్లారు. గంగుబాయి ఇంటి తాళం పగలగొట్టి చోరీకి యత్నించగా అలికిడి రావడంతో దుండగులు పరారయ్యారని బాధితులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!