Nizamabad

News June 20, 2024

NZB: ఆర్టీసీలో స్టూడెంట్ పాస్ కోసం దరఖాస్తులు ప్రారంభం

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు పునఃప్రారంభమైన నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు బస్ పాస్ కోసం దరఖాస్తులు ప్రారంభమైనట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి పాఠశాలలు, కళశాలల యాజమాన్యాలు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలను చెల్లించి సంబంధిత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పొందాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News June 19, 2024

బిక్కనూరు: బావమరిదిని చంపిన బావ

image

గడ్డి మందు తాగి ఈనెల 14న రంజిత్ చికిత్స పొందుతూ మృతిచెందిన కేసును  పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన బాబా శేఖర్, బిక్కనూర్‌కి చెందిన రంజిత్ కలిసి కొద్దిరోజుల క్రితం ఓ బైక్‌ను దొంగిలించినట్లు సీఐ సంపత్ కుమార్ తెలిపారు. ఆ బైక్‌ను తానే సొంతం చేసుకోవాలని బాబా శేఖర్ తన బావమరిది రంజిత్‌కు కళ్ళు సీసాలో గడ్డి మందు కలిపి ఇచ్చి హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు సీఐ వెల్లడించారు.

News June 19, 2024

బాన్సువాడ: రూ.2.09లక్షలు పొగొట్టుకున్న యువకుడు

image

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఓ యువకుడు రూ.2.09 లక్షలు పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది. తాడ్కోల్ గ్రామానికి చెందిన మహేందర్ ఫోన్‌కు ఈనెల 8న ఓ మెసేజ్ వచ్చింది. క్లిక్ చేయడంతో రూ.400 బోనస్ అతని అకౌంట్లో జమయ్యాయి. దీన్ని నమ్మిన యువకుడు విడతల వారీగా రూ.2.09 లక్షలు వివిధ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత ఎలాంటి రిఫండ్ రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

News June 19, 2024

NZB: మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ విద్యార్థులతో భారీ ర్యాలీ

image

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డ్‌ను రద్దు చేసి 24 లక్షల నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ NSUI, AISF, SFI, PDSU, PDSU, AIPSU విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్వర్యంలో బుధవారం నిజామాబాద్‌లో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీట్ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.

News June 19, 2024

ఇందల్వాయి: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

image

అప్పుల బాధతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇందల్వాయి మండలంలో జరిగింది. ఎస్ఐ మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని త్రియంబకపేట్ గ్రామానికి చెందిన బైరీ గణేశ్ (22) ఏడాది క్రితం బతుకుదెరువుకు సౌదీ వెళ్ళాడు. అక్కడ 6నెలలు గడిపి సరైన ఉపాధి అవకాశాలు దొరక్క తిరిగి ఇంటికి వచ్చాడు. అప్పులు అధికమవడంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

News June 19, 2024

జక్రాన్ పల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లాలోని బ్రాహ్మణపల్లిలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జక్రాన్ పల్లి మండలం బ్రాహ్మణపల్లి బ్రిడ్జి NH 44 రోడ్డుపై ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాలాజీని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News June 19, 2024

నిజామాబాద్: చెప్పేదొకటి.. చేసేదొకటి!

image

జిల్లాలో చాలా ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఖలీల్‌వాడిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆర్థో పేరిట రిజిస్ట్రేషన్ అయింది. అక్కడ జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, స్త్రీ వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు. ద్వారకానగర్‌లో ఒక జనరల్ ఫిజిషియన్‌గా అనుమతి తీసుకుని సర్జన్లు సైతం నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ 394 ఆసుపత్రులు అనుమతులు పొందగా.. 122 అనుమతులు లేకుండా కొనసాగుతున్నాయి.

News June 19, 2024

నిజామాబాద్: సెంచరీ కొట్టిన టమాట

image

టమాట ధర ఆకాశాన్నంటుతోంది. నిజామాబాద్ జిల్లాలో పదిరోజుల క్రితం రూ.40 ఉన్న ధర ఒక్కసారిగా ఎగబాకింది. నిన్న మొన్నటి వరకు రూ.80 ఉండగా నేడు రూ.100కు చేరింది. కిలో కొనుగోలు చేసే వినియోగదారులు పావుకిలోతో తృప్తి పడుతున్నారు. టమాట కొందామన్నా మార్కెట్‌లో దొరకడం లేదు. 20 కిలోల పెట్టెధర రూ.వేయి పలుకుతోంది. అంతంత మాత్రం సాగు.. అకాలవర్షాలు రేటు పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.

News June 19, 2024

NZB: పేకాట స్థావరంపై పోలీసుల దాడి

image

నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరంపై దాడి జరిపారు. హైమద్ పురా కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య, సిబ్బంది లక్ష్మన్న, రాములు, గజేందర్, అనిల్ కుమార్, సుధాకర్ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు జరిపారు. ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకుని రూ.7,460 నగదు సీజ్ చేశారు. ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు.

News June 18, 2024

కామారెడ్డి: ఇంట్లో గొడవ.. అడ్డొచ్చిన పక్కింటి మహిళ హత్య

image

కామారెడ్డి మండలం తిమ్మక్‌‌పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో శేఖర్ అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. గొడవను అడ్డుకోవడానికి ఇంటి పక్కన గల నారాయణ, లక్ష్మి, రాజు అనే వ్యక్తులు వెళ్లారు. గొడవని అడ్డుకునేందుంకు‌ ప్రయత్నించిన లక్ష్మి అనే మహిళ తలపై శేఖర్ కోపంతో ఇటుకతో దాడి చేశారు. తలకి తీవ్రంగా తలగడంతో లక్ష్మి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.