India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా హోళీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాత్రి శాస్త్రోక్తంగా కామదహనం కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఉదయం నుండి పిల్లలు, పెద్దలు రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ వేడుకలు జరుపుతున్నారు. అలాగే వివిధ సంఘాలు, యూనియన్ల ఆధ్వర్యంలో హోళీ సంబురాలు నిర్వహిస్తున్నారు.
ఒకప్పుడు నిజామాబాద్ కలెక్టర్‌గా పనిచేసిన దేవ వరప్రసాద్ ఈసారి ఏపీలో MLA అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేవ వరప్రసాద్‌కు టికెట్ ఖరారు చేశారు. 2021లో జనసేన జనవాణి విభాగం కన్వీనర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. గతంలో పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరక్టర్, అబ్కారీ శాఖ డైరక్టర్‌గా ఆయన సేవలందించారు.
ఓ అమ్మాయి విషయమై ఓ యువకుడిపై మరో యువకుడు దాడి చేసిన ఘటన HYDఅమీర్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ వాసులు నితిన్, ఓ యువతి ప్రేమించుకోగా రెండేళ్ల తర్వాత పెళ్లి చేస్తామని కుటుంబీకులు చెప్పారు. దీంతో యువతి HYD వెళ్లింది. అక్కడ పంజాగుట్ట వాసి బాబీ ఆమెకు పరిచయమవగా అతడిని ప్రేమించింది. ఆమె ఫోన్‌లో వాట్సాప్ చాట్ చూసిన బాబీ నితిన్‌ను పిలిపించి దాడి చేశాడు.
నిజామాబాద్ పెద్ద బజారులోని లక్ష్మీనరసింహ కిరాణ దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి తాను ICICI బ్యాంక్ ఉద్యోగినంటూ యాజమానిని నమ్మించాడు. కరెంట్ అకౌంట్‌తో పాటు క్యూఆర్ కోడ్ అప్డేట్ చేయాలని చెప్పి, ఆధార్, పాన్ కార్డ్ వివరాలు అడిగాడు. యాప్ డౌన్లోడ్ చేస్తానని నమ్మించి ఫోన్ తీసుకొని పరారయ్యాడు. కాసేపటికి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.లక్ష మాయమైనట్టు గుర్తించిన బాధితుడు రాజ్ కుమార్ 2వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
హోలీ అంటేనే రంగుల కేళి..చిన్నా పెద్దా తేడా లేకుండా కలిసి ఆడే పండుగ. నేడు రంగుల వేడుకను జరుపుకొనేందుకు ఉమ్మడి NZB జిల్లా ప్రజలు సిద్ధమైన వేళ వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. సరదా సంబురం మాటున ప్రమాదం పొంచి ఉన్నదని.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రంగులు కళ్లల్లో పడకుండా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సహజ సిద్ధమైన రంగులను వినియోగిస్తే మంచిది అని అంటున్నారు.
హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్క చోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోలీ వేడుక జరుపుకోవాలన్నారు.
నగరంలోని ధర్మపురి కాలనీలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహీర్ బీన్ హందాన్, కేశ వేణు, రత్నాకర్. ఖుద్దుస్, తదితరులున్నారు.
జహీరాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు కామారెడ్డి జిల్లాకు చెందిన అతిమాముల రామకృష్ణా గుప్త.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీలో చేరారు. కేంద్రంలో మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరినట్లు తెలిపారు.
హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, మక్కాకు వెళ్ళిన వారికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లో జిల్లా హజ్ సొసైటీ మౌలానా సయ్యద్ అబీద్ ఖాస్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండవ హజ్ ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా ముహమ్మద్ షబ్బీర్ అలీ హాజరయ్యారు.
నిజామాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మేరకు ఆదివారం ఇంద్రపూర్ సమీపంలోని ప్రైవేటు ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మరమ్మతు కేంద్రానికి చుట్టు పక్కల ఇళ్లు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
Sorry, no posts matched your criteria.