Nizamabad

News March 24, 2024

NZB: పట్టపగలే పోలీస్ ఇంట్లో చోరీ

image

నిజామాబాద్‌లో దొంగలు ఏకంగా ఓ పోలీసు ఇంటికే కన్నం వేశారు. ఎనిమిది తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. కమిషనరేట్‌లోని ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న సాయన్న గూపన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయన ఉదయం విధులకు వెళ్లగా.. కుటుంబీకులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి ఎనిమిది తులాల బంగారు గొలుసు లను అపహరించుకు వెళ్లారు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 24, 2024

నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు మృతి

image

జిల్లా వ్యాప్తంగా నిన్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. డొంకేశ్వర్‌కు చెందిన పెద్ద గంగారం (44) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. నందిపేటలోని తల్వేద వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి బండారి రవి(20) అనే వ్యక్తి నీట మునిగి మృత్యవాతపడ్డాడు. నవీపేటకి చెందిన మోసిన్ (13) అలీసాగర్ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. గాలింపు చర్యలు చేపట్టగా మోసిన్ మృతదేహం లభ్యమైంది.

News March 24, 2024

కామారెడ్డి: ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుమారు వందమంది బీజేపీ మండలాధ్యక్షుడు తుకారం ఆధ్వర్యంలో బీజేపీ చేరారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మాధవరావు, పండిత్ రావ్ పటేల్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

News March 23, 2024

NZB: BREAKING.. నీట మునిగి ఆరో తరగతి విద్యార్థి మృతి

image

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. పట్టణంలోని అలీసాగర్‌లో శనివారం ఈతకు వెళ్లిన ఆరో తరగతి విద్యార్థి మోసిన్(13) ప్రమాదవ శాత్తు నీట మునిగి మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2024

NZB: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్‌ దుర్మరణం

image

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. HYDలో ఉంటున్న శంకర్‌, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న సిటీలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రియురాలు గమనించి బస్‌ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.

News March 23, 2024

సెన్సార్ బోర్డ్ మెంబర్ రామకృష్ణ గుప్తా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా

image

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, సెన్సార్ బోర్డ్ మెంబర్ కామారెడ్డికి చెందిన రామకృష్ణ గుప్తా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన‌ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించానని తెలిపారు. నాయకుల అంతర్గత రాజకీయాల వల్ల ఇబ్బందులకు గురై బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తునట్లు వెల్లడించారు.

News March 23, 2024

NZB: నిద్రలోనే గుండెపోటుతో భక్తుడు మృతి

image

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామానికి చెందిన రటపు నరహరి (55) అనే వ్యక్తి దైవ దర్శనానికి వచ్చి శుక్రవారం రాత్రి స్థానిక మంగళ ఘాట్ వద్ద నిద్రిస్తుండగా, గుండెపోటుతో నిద్రలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ధర్మపురి ఎస్సై తెలిపారు.

News March 23, 2024

KMR: మత్తు పదార్థాలు అమ్మిన ముఠా అరెస్ట్

image

మత్తుపదార్థాలు అమ్మిన ముఠాను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి DSP శ్రీనివాసులు వెల్లడించారు. గురువారం పద్మాజీవాడి X రోడ్‌లో నిషేధిత అల్ఫాజోలం అమ్ముతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5 లక్షల విలువ చేసే అల్ఫాజోలం, 2 కార్లు, 2 బైక్‌లు, 5 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కాగా రాజస్థాన్‌కు చెందిన మరో 2 పరారీలో ఉన్నారు.

News March 23, 2024

కామారెడ్డిలో బాలికతో వ్యభిచారం..!

image

తల్లిదండ్రులు లేని ఓ మైనర్ బాలికతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భీంగల్‌కు చెందిన సంపంగి లక్ష్మి, ఆమెతో సహజీవనం చేస్తున్న సుంకరి శంకర్‌ ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సహకరిస్తున్న లాడ్జి ఓనర్ నరసింహరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వివరణ ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 23, 2024

NZB: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండలంలోని బండ రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన పండరి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడిపోయినట్లు తెలిపారు. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాదుకు కుటుంబ సభ్యులు తరలించినట్లు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడన్నారు.

error: Content is protected !!