Nizamabad

News June 13, 2024

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఇందూరు వాసుల్లో అలజడి

image

కువైట్‌లోని మంగాఫ్ లేబర్ క్యాంపులో జరిగిన ప్రమాద ఘటనపై నిజామాబాద్ వాసుల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా మృతి చెందగా మరో 50 మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో జిల్లా మెుత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 12 వేల మంది అక్కడ లేబర్ క్యాంపుల్లో ఉన్నట్లు సమాచారం. ఎప్పుడు ఎలాంటి విషయం వినాల్సి వస్తుందోనని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

News June 13, 2024

NZB: చిన్నారి దారుణ హత్య

image

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. NZB జిల్లా రెంజల్ మండలానికి చెందిన నవ్యశ్రీకి అదే మండలానికి చెందిన లక్ష్మణ్‌తో ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి అరుణ్య, మహన్వి(22నెలలు) కుమార్తెలున్నారు. 7 నెలల క్రితం అరవిందరెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను వదిలేసి చిన్నారులతో నల్గొండ జిల్లాకు వెళ్లి నివాసం ఉంటోంది. తన వివాహేతర సంబంధానికి మహన్వి అడ్డువస్తోందని అరవిందరెడ్డి హతమార్చాడు.

News June 13, 2024

కామారెడ్డి: వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి

image

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో బిక్కనూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మల్లుపల్లితండాకు చెందిన అబ్దుల్లా(32), సయ్యద్ చాంద్(38) గల్ఫ్ వెళ్లడానికి వీసాకోసం వేములవాడలో ఇంటర్వ్యూ కోసం బైక్ పై వెళ్తున్నారు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వారి వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. జంగంపల్లికి చెందిన పుల్లూరి రాజు(30) తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

News June 13, 2024

వేల్పూర్: పచ్చలనడ్కుడ 144 సెక్షన్

image

వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చలనడ్కుడలో వీడీసీ సభ్యులకు, ప్రజలకు పోలీస్ శాఖ హెచ్చరిక జారిచేసింది. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వేల్పూర్ ఆదేశాల మేరకు గ్రామంలో ఈనెల 13 నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని SI వినయ్ తెలిపారు. పెద్దవాగు ఇసుక విషయంలో పచ్చలనడ్కుడ, జాన్కంపేట గ్రామాల మద్య వివాదం నెలకొన్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. గ్రామంలో నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని సూచించారు.

News June 13, 2024

KMR: మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్‌షిప్‌లో మౌలిక సదుపాయాల కల్పన పై అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సమీక్ష నిర్వహించారు. బిటీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, మురుగు కాలువల నిర్మాణం వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు అధికారులు అంచనాలు రూపొందించాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News June 12, 2024

గగ్గుపల్లిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

ఆర్మూర్ మండలం గగ్గుపల్లి గ్రామానికి చెందిన పోషన్న (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోషన్న బుధవారం ఉదయం వ్యవసాయ క్షేత్రానికి పనికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి చూసింది. అక్కడ భర్త మృతి చెంది కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 12, 2024

NZB జిల్లా నుంచి వరంగల్‌కి డీలక్స్ బస్‌లు

image

నిజమాబాద్ జిల్లా ప్రజలకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కొత్తగా డీలక్స్ బస్‌లను అందుబాటులోకి తెచ్చింది. నిజమాబాద్ నుంచి వరంగల్‌కు ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఆర్టీసీ అధికారులు డీలక్స్ బస్‌లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం నుంచి డీలక్స్ బస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

News June 12, 2024

బాన్సువాడలో వృద్ధురాలిని హత్య చేసిన దుండగులు

image

వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది. మండలంలోని తాడ్కోల్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీలో బుధవారం ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఉప్పెర సాయవ్వను గొంతుకోసి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆమె మెడలోని బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News June 12, 2024

FLASH.. నిజామాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. సిరిసిల్ల జిల్లా గంబీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద డీసీఎంను బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. కాగా, మృతులు కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం మల్లుపల్లె వాసులు షేక్ అబ్దుల్లా, సయ్యద్ పైరాగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 12, 2024

సౌదీలో అనారోగ్యంతో రామారెడ్డి వాసి మృతి

image

సౌదీలో రామారెడ్డి వాసి అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యునుస్(45) బతుకుదెరువు నిమిత్తం 10 రోజుల క్రితం సౌదీకి వెళ్లారు. అక్కడ మూడు రోజులు పని చేశాడని అనారోగ్యంతో మంచం పట్టి మూడు రోజుల క్రితం మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి ప్రభుత్వం తెప్పించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.