India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జుక్కల్ మండలంలో దారుణం జరిగింది. తండ్రిని కొడుకు హత్య చేశాడు. ఎస్సై వివరాల ప్రకారం.. సోపూర్ కు చెందిన లాలప్పకు(75) ఇద్దరు కొడుకులు. లాలప్ప తనకున్న భూమిలో కొడుకులకు వాటా ఇచ్చి భిక్షాటన చేస్తున్నాడు. అయితే చిన్న కుమారుడు సుభాష్ చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో తరచూ గొడవపడేవాడు. భూమిని సుభాష్ ఎక్కడ అమ్ముతాడోనని లాలప్ప కొంత భూమి కోడలి పేరుపై మార్చారు. దీంతో కోపం పెంచుకున్న సుభాష్ తండ్రిని హత్య చేశాడు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల్లో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు చర్యలు చేపట్టాలని, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు.
2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు (PTI), కేర్ గివింగ్ వాలంటీర్లు (CGV)లను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని సమగ్ర శిక్ష ఎక్స్ అఫిషియో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ డా.మల్లయ్య భట్టు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 88 మంది PTIలు, 19 మంది CGVలు విధుల్లో చేరనున్నారు.
నాగిరెడ్డిపేటలోని మహిళా సమైక్య కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎంపీపీ బాధ్యతలు చేపట్టిన టేకులపల్లి వినీతను మండల సమైక్య అధ్యక్షురాలు సుశీల, ఐకేపీ ఏపీఎం జగదీశ్ శాలువాతో సన్మానించారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే ఎంపీపీని సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఐకేపీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని సిర్నాపల్లి, ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ పైన సోమవారం గుర్తు తెలియని మగ వ్యక్తి (35) మృతదేహం లభ్యమైనట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. రైలులో నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్యం చేశారు. మృతుడి కుడి చేయి పైన కవిత అని పచ్చ బొట్టు ఉన్నట్లు గుర్తించారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.
జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 12న ఉపాధి కార్యలయంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు NZB జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేళాలో పలు ప్రైవేట్ సంస్థలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. SSC, ITI ఎలక్ట్రిషన్, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు వారు అర్హులన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తా సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు తోడ్పడాలన్నారు. తమ వాహనాల టైర్ల గ్రిప్/థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోవాలన్నారు. టైర్ల గ్రిప్ బాగా లేకపోతే వెంటనే మార్చుకోవాలని సూచించారు. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రాంతానికి చెందిన విద్యార్థి జ్యోతి సమన్విత్ JEE అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షలో 833వ జనరల్ ర్యాంక్ సాధించాడని విద్యార్థి తల్లిదండ్రులు తెలిపారు. అలాగే OBC NCL కేటగిరిలో 121 వ ర్యాంకు సాధించాడు. ముప్కాల్ మండలం వేంపల్లికి చెందిన చరణ్ ఓపెన్ క్యాటగిరిలో 51వ ర్యాంకు సాధించాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరిమల్లకు చెందిన హర్షత్ గౌడ్ JEEలో 8879 ర్యాంకు సాధించాడు.
నిజామాబాద్ పులాంగ్ చౌరస్తా బ్రిడ్జి దాటిన తరువాత యాదగిరి బాగ్ కమాన్ ఎదురుగా ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైందని నిజామాబాద్ 4వ టౌన్ SHO తెలిపారు. సుమారు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసుగల ఈ వ్యక్తి రోడ్డు దాటుతుండగా కిందపడి దెబ్బలు తగిలి మరణించాడన్నారు. ఇతని వివరాలు తెలిసినవారుSHO NZB 4 Town 8712659840, NZB 4 town PS 8712659719 నంబర్లను సంప్రదించాలని కోరారు.
కామారెడ్డి మహమ్మద్ నగర్ మండలంలోని సింగీతం వంతెన పై నుంచి లారీ కింద పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొగ్గుగుడిసె నుంచి బాన్సువాడ వైపు అతివేగంగా వెళ్తున్న ఓ లారీ నర్వ గ్రామ సమీపంలో అదుపుతప్పి సింగీతం ప్రాజెక్టు వంతెనపై నుంచి కిందికి పడిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. అంబులెన్స్ ద్వారా అతన్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.