India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్‌లలో ఐదేళ్లు విధులు నిర్వహించిన 69 మంది కానిస్టేబుల్స్‌ని బదిలీ చేసినట్లు ఎస్పీ సింధూ శర్మ తెలిపారు. సిబ్బంది ఆరోగ్య, కుటుంబ సమస్యలు, సీనియార్టీని పరిగణలోకి తీసుకొని సిబ్బంది కోరిక మేరకు బదిలీలు చేసినట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన కానిస్టేబుల్స్ వారికి స్టేషన్‌లలో రిపోర్ట్ చేసి విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు.
వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన డిచ్పల్లిలో చోటుచేసుకుంది. ఇందల్వాయి మండలం మేఘ్యానాయక్ తండాకు చెందిన లకావత్ వెంగల్‌ను డిచ్పల్లి మండలంలోని CMC హాస్పిటల్ సమీపంలో దుండగులు హత్య చేశారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా మిగిలిన నిందితులను పట్టుకోవాలని మృతుడి బంధువులు ఆందోళనకు దిగి ప్రధాన నిందితుడు బిక్య ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు.
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి(M) ధర్మారానికి చెందిన ప్రేమ్ కుమార్(32) మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి అనుమానాస్పదంగా డిచ్‌పల్లి పరిధిలో ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారు. ఎస్ఎస్ఆర్, నరేంద్ర కళాశాల కేంద్రాల్లో విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడ్డారు. ఉదయం జరిగిన ఆరో సెమిస్టెర్ రెగ్యులర్ పరీక్షలకు 6,086 మందికి 5,670 మంది, మధ్యాహ్నం ఒకటో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలకు 3,050కి 2,840 మంది హాజరైనట్లు పేర్కోన్నారు.
బోధన్ పట్టణంలో నెలన్నర కాలంలో దొంగల హల్‌చల్ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు, వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇంటి ఎదుట గాని, ఏదైనా దుకాణం, బ్యాంకుల వద్ద ద్విచక్రవాహనం నిలపాలంటే వాహనదారులు భయపడుతున్నారు. పని ముగించుకుని బయటకు రాగానే వాహనం కనిపించకుండా పోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దొంగలు పక్కాగా పగలు రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లు, దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు.
నిజాంసాగర్ మండలంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గోర్గల్ గ్రామానికి చెందిన కూర్మ కృష్ణమూర్తి(24) రోజు మాదిరిగ ఇంటి నుంచి గొర్రెలను వడ్డేపల్లి శివారులో నల్లగుట్ట అటవీ ప్రాంతంలో మేపడానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో పిడుగు పడి చేతిలో పట్టుకున్న గొర్రె పిల్లతో పాటు ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 10నుంచి యథావిధిగా కొనసాగుతుందని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజావాణి తిరిగి కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఆలూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కూలర్ షాక్ కొట్టి సింధూర(5) మృతి చెందింది. నిజామాబాద్‌కి చెందిన సౌందర్య, మనీశ్ దంపతుల కూతురు సింధూర ఆలూరులోని అమ్మమ్మ ఇంట్లో శుక్రవారం సాయంత్రం ఆడుకుంటూ కూలర్‌ను తాకింది. కూలర్ అన్ చేసి ఉండటంతో షాక్ కొట్టి చిన్నారి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కోటగిరిలోని ఎత్తొండ గ్రామంలో రైతులకు రావాల్సిన రూ.1.80 కోట్ల ధాన్యం డబ్బులు తమకు వెంటనే చెల్లించాలని రైతులు సహకార సంఘానికి తాళం వేశారు. సహకార సంఘం పరిధిలోని 114 మంది రైతులు యాసంగిలో పండించిన పంటను ఇచ్చి 2 నెలలు అవుతున్నా వారికి డబ్బులు చెల్లించలేదని తహశీల్దార్‌కి ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ సునీత, AO శ్రీనివాస్ వారికి రావాల్సిన డబ్బులు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 10 నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.