India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏ సీజన్ అయినా ముందుగా బోధన్ డివిజన్ లోనే వరినాట్లు, కోతలు ప్రారంభమవుతుంటాయి. నెల రోజుల కిందటే నారు మళ్లను సిద్ధం చేసుకున్న రైతులు ప్రస్తుతం నాట్లు వేయడం షురూ చేశారు. బోధన్ డివిజన్ లో వానాకాలం సీజన్ కు సంబంధించి వరి నాట్లు మొదలు కాగా రైతన్నలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో పక్షం రోజుల్లో వరి నాట్లు జోరందుకొనున్నాయి.
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న షేక్ ఇస్మాయిల్(32)ను గురువారం అరెస్ట్ చేసినట్లు మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలాలలో 25 వాహనాలను దొంగిలించాడు. వాటిని కమ్మర్ పల్లి, ఆర్మూర్, NZB, మోర్తాడ్, పెర్కిట్ లలో స్ర్కాప్ వ్యాపారం చేసే 15 మందికి ఒక్కొ వాహనాన్ని రూ. 5 వేల చొప్పున విక్రయించారు. కాగా అతని నుంచి రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
బోధన్ రాకాసిపేట్‌కు చెందిన అవైస్‌యాబా (25) అనే యువకుడు షార్జా బీచ్‌లో మృతి చెందారు. యువకుడు ఉపాధి కోసం నాలుగు నెలల కిందట దుబాయి వెళ్లాడు. నాలుగు రోజుల క్రితం యాబా అదృశ్యమయ్యాడు. తెలిసిన వారు అక్కడ అన్వేషించగా షార్జాలోని అల్- మంజర్ బీచ్‌లో ఓ యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. బంధువులు అది అవైస్‌యాబాదేగా ధ్రువీకరించినట్లు వివరించారు.
రెంజల్ మండలం కల్యాపూర్ శివారులో గురువారం పిడుగుపడి దండిగుట్ట తండాకు చెందిన పశువుల కాపరి బానోత్ పీర్యానాయక్ (80) మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. కల్యాపూర్ శివారులో పశువులు మేపడానికి వెళ్లిన ఆయన తిరిగి వస్తున్న సమయంలో సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో అక్కడే ఉన్న ఓ మామిడి చెట్టు కింద తల దాచుకోగా చెట్టుపై పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందారు.
కామారెడ్డిలో సైబర్ మోసం జరిగింది. సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం పట్టణానికి చెందిన శ్రీకాంత్‌కి వాట్సాప్‌కి పార్ట్‌టైం ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి ఉందా అని మెసేజ్ వచ్చింది. దీంతో అతను ఉద్యోగం చేయడానికి అంగీకరించాడు. మెుదటగా రూ. 9 వేలు కడితే రూ.12 వేలు వస్తాయని ఆశ చూపారు. దీంతో అత్యాశకు పోయి విడతల వారిగా రూ.9.79 లక్షలు చెల్లించాడు. అనుమానం వచ్చిన యువకుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులను సంప్రదించాడు.
NZB నాలుగో ఠాణా పరిధిలో ఒకే రోజు 3 చోరీలు జరిగాయి. పోలీసుల వివరాల ప్రకారం.. వినాయక్‌నగర్ బస్వాగార్డెన్ వెనకాల రాఘవేంద్ర ఆపార్ట్‌మెంటు మూడో అంతస్తులో ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి ఊరేళ్లగా బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. మూడు తులాల బంగారం చోరి జరిగింది. కాగా రుత్విక్ అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో చోరీ జరిగింది. అలాగే ఆర్యనగర్‌లో తాళం వేసిన ఓ ఇంట్లో దుండగులు చొరబడ్డారు.
ZHB లోక్ సభ స్థానంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎంపీగా సురేశ్ షెట్కార్ భారీ మెజార్టీతో జయ కేతనం ఎగురవేశారు. 2009లో సురేశ్ షెట్కార్ విజయం సాధించారు. ఆ తర్వాత బీబీ పాటిల్ వరుసగా రెండు సార్లు ఎంపీ అయ్యారు. పదేళ్ల తర్వాత అదే స్థానం నుంచి షెట్కార్ MLA టికెట్‌ను త్యాగం చేసి కాంగ్రెస్ MP అభ్యర్థిగా రంగంలో దిగి విజయం సాధించారు.
బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన పాల్కి భూమబోయి మూడు రోజుల క్రితం కనిపించకపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఇండ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో బుధవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఇవాళ ఉదయం ఇబ్రహీంపేట్ సబ్ స్టేషన్ ముందర నీటి కుంటలో భూమబోయి మృతదేహం స్థానికులకు కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించారు.
కేంద్రంలో మూడోసారి కొలువు దీరనున్న NDA ప్రభుత్వంలో ఈ సారి తెలంగాణకు రెండు కేబినెట్ బెర్త్‌లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజికవర్గం నుంచి కిషన్ రెడ్డి లేదా డికే అరుణకు, బీసీ సామాజికవర్గం నుంచి బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్‌లో ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ రెండోసారి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో 19 మంది పోటీచేశారు. ఇందులో 10 మంది స్వతంత్రులే. వీరిలో ఎవరికీ 6వేల ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం. ఏడు నియోజకవర్గాల్లో 12,25,049 ఓట్లు పోలయ్యాయి. ఇందులో స్వతంత్రులకు 31,079 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నోటాకు 2,933 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన 10 మందిలో ఆరుగురికి నోటా కంటే తక్కువ వచ్చాయి.
Sorry, no posts matched your criteria.