Nizamabad

News June 6, 2024

నిజామాబాద్: అంచనాలకు మించి BJP జోరు

image

నిజామాబాద్ పార్లమెంట్‌లో BJPకి విశ్లేషకుల అంచనాలకు మించి ఓట్లు పోలయ్యాయి. గత ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీకి 4.80 లక్షలు ఓట్లు రాగా.. ఈసారి 5.92 లక్షల ఓట్లు వచ్చాయి. NZB రూరల్, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గాల్లో 15 వేల నుంచి 20 వేల మెజార్టీ వస్తుందని లెక్కలు కట్టారు. కాని రూరల్ 44వేలు, కోరుట్లలో 33వేలు, బాల్కొండలో 32 వేలు మెజార్టీ దక్కటం గమనార్హం. 7 అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు సాధించడంతో BJP జోరు సాగింది.

News June 6, 2024

NZB: కోడలి సజీవదహనం..అత్తకు రెండు జీవిత ఖైదులు

image

కోడలిని సజీవ దహనం చేసిన అత్తకు 2 జీవిత కారాగార శిక్షలు, రూ. 11వేల జరిమానా విధించింది జిల్లా కోర్టు. నవీపేట మండలం శివతండాకు చెందిన బానోత్ రాంసింగ్ ప్రకాశం జిల్లాకు చెందిన రాధను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాంసింగ్, తల్లి కోడలిని కట్నం తేవాలని వేధించారు. ఈ క్రమంలో 2020 ఏప్రిల్ 20న రాత్రి రాధను రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు.

News June 5, 2024

NZB: అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య

image

నగరంలోని గాజుల్ పేట్ రామ మందిర్ ప్రాంతానికి చెందిన నారాయణ(22) ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్రెడిట్ కార్డు తీసుకుని దాని ద్వారా డబ్బులను డ్రా చేసి వాడుకున్నాడు. డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో రెండు రోజుల క్రితం క్రెడిట్ కార్డు రికవరీ టీం ఇంటికి వచ్చి బెదిరించినట్లు 2 టౌన్ ఎస్ఐ రాము తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన నారాయణ తన ఇంట్లో ఉరేసుకొని మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

News June 5, 2024

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై ఫైర్ అయిన ఎంపీ అర్వింద్

image

బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ ఎన్నికలో చిల్లర రాజకీయాలు చేశారని ఎంపీ అర్వింద్ ఫైర్ అయ్యారు. సుదర్శన్ రెడ్డి తన వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలన్నారు. ఆయన ఒక రాజకీయ అవకాశ వాది అని, లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టి వ్యాపారం చేసే సుదర్శన్ రెడ్డికి షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని సోయి లేదా అని ప్రశ్నించారు. సుదర్శన్ రెడ్డితో జిల్లా ప్రజలకు, బోధన్ నియోజకవర్గ ప్రజలకు నయా పైసా ఉపయోగంలేదన్నారు.

News June 5, 2024

NZB: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

image

క్రికెట్ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి యువకుడు మృతిచెందిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. నగరంలోని గౌతంనగర్‌కు చెందిన విజయ్(30) బుధవారం అమ్మ వెంచర్‌లో క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తరలించిగా మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News June 5, 2024

నిజామాబాద్ ప్రజలు గర్వించేలా పనిచేస్తా: ఎంపీ ధర్మపురి 

image

నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ధర్మపురి అరవింద్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో మరోసారి ఎంపీగా ఆశీర్వదించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిజామాబాద్ ప్రజలు గర్వించేలా పనిచేస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడుదామని కాంగ్రెస్ వాళ్లకు ఎంపీ ధర్మపురి అరవింద సవాల్ విసిరారు.

News June 5, 2024

ప్రజాతీర్పును గౌరవిస్తున్నా: బీబీ పాటిల్

image

జహీరాబాద్ పార్లమెంట్ ఓటర్లకు బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై పై ఎంతో నమ్మకంతో రెండు సార్లు ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపించారన్నారు. తాను గెలిచిన నాటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశానన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నానని.. జహీరాబాద్ ప్రజల సంక్షేమానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు.

News June 5, 2024

జహీరాబాద్‌లో డిపాజిట్ కోల్పోయిన BRS

image

MP ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ను జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలు ఆదరించలేదు. ఎన్నికల ముందు ఇక్కడ BRSVsBJP అని‌ ఆ పార్టీ శ్రేణులు‌ భావించాయి. కానీ నిన్నటి ఫలితాల్లో ఆయన డిపాజిట్ కోల్పోయారు. మెజార్టీ రౌండ్లలో BRS చివరి స్థానంలో నిలిచింది. ఫలితంగా 1,72,078(13.92%) ఓట్లకే పరిమితం కావడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన గాలి MPగా పోటీ చేసిన ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్నారు.

News June 5, 2024

NZB: 2 సార్లు MLA..ఎంపీ పోటీలో డిపాజిట్ గల్లంతు..!

image

నిజామాబాద్ లోక్ సభ BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో ఏ మాత్రం సత్తాచాట లేకపోయారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు MLA గా గెలిచిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందారు. తిరిగి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇవాళ వెలువడిన ఫలితాల్లో ఆయనకు 1,02,406 ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 8.3% ఓట్లు రాబట్టగా.. డిపాజిట్ కూడా గల్లంతైంది.

News June 5, 2024

జహీరాబాద్‌: కాంగ్రెస్‌ 2వ సారి విజయకేతనం

image

ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్‌ను కాంగ్రెస్‌, నిజామాబాద్‌ను బీజేపీ కైవసం చేసుకున్నాయి. ZHB కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ 47,896 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009లో గెలిచిన షెట్కార్‌ తాజాగా మరోసారి విజయకేతనం ఎగురవేశారు.BRS ఎంపీగా ఉన్న బీబీపాటిల్‌ BJPలో చేరి పోటీ చేయగా, కాంగ్రెస్‌ నుంచి BRSలో చేరిన గాలి అనిల్‌కుమార్‌ బరిలో నిలిచి ఓటమిచెందారు. దీంతో BRS సిట్టింగ్‌ స్థానాన్ని కొల్పోయింది.