India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం షేర్ ఖాన్ పల్లి గ్రామ శివారులో బుధవారం వెలుగు చూసిన ఓ మానవ అస్థిపంజరం కలకలం రేపింది. సమాచారం అందుకున్న బాన్సువాడ పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో దర్యాప్తు చేపట్టి, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇది ఎవరిది? ఈ అస్థిపంజరం ఇక్కడ ఎన్ని రోజుల నుంచి పడి ఉంది? తదితరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్ సాయి నగర్‌లో నివాసముంటున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ బుధవారం నూతనంగా నిర్మిస్తున్న భవనం 3వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఇంటికి వాటర్ కొడుతుండగా ప్రమాదవశాత్తు జారి పడినట్లు వెల్లడించారు.
లవ్ ఫెయిల్ అయి ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన ZHBలో జరిగింది. ఆనెగుంటకు చెందిన వెంకట్(30) HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో NZB జిల్లా బాల్కొండకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కాగా వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. కొద్దిరోజులకు ఆమె కూడా పెళ్లికి నో చెప్పడంతో మనస్తాపం చెంది పట్టణ శివారులో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం రోజు ఆర్మూర్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఆర్మూర్ పట్టణానికి చెందిన రాజశేఖర్ ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్‌ను కలవడం ఆనందంగా ఉందన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పలు అంశాలపై చర్చించామన్నారు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లి గ్రామ చెరువులో పడి గేదెల కాపరి మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన దుర్గయ్య (65) గేదెలను చెరువులోకి తీసుకెళ్లాడు. కాగా అక్కడ దుర్గయ్య కాలుజారి చెరువులో పడగా ఊపిరాడక మృతి చెందాడు. మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి, పంచనామ నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఆర్మూర్ పట్టణం మామిడిపల్లికి చెందిన దొండి హర్షిని మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన డోండి ప్రకాష్, సునీత కుమార్తె హర్షిని మోడల్ స్కూల్ ఆరవ తరగతిలో చేరడానికి ప్రవేశ పరీక్ష రాసింది. ఈ ప్రవేశ పరీక్షలో 100కు గాను 90 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించగా జిల్లాస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది.
రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. నిజామాబాద్ జిల్లా సాలూర అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. చెక్ పోస్టు వద్ద ఆర్టీఏ అధికారులు వాహనదారుల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నారనే సమాచారంతో నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సీఎం రేవంత్ రెడ్డి త్వరలో కేబినేట్‌ను విస్తరించనున్న నేపథ్యంలో ఉమ్మడి NZB జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కనుందోనని ఉత్కంఠ నెలకొంది. సీనియర్ నేత, బోధన్ MLA సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ రావు పోటీలో ఉన్నారని శ్రేణులు చెబుతున్నాయి. కాగా ఇప్పటి వరకు జుక్కల్ నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో ఈసారి MLA లక్ష్మీకాంతరావుకి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. మీ కామెంట్?
ఉపాధి పని చేస్తూ కూలి మృతి చెందిన ఘటన బిక్కనూర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలానికి చెందిన అంబల్ల పెద్ద మల్లయ్య(60) మంగళవారం ఉపాధి పనికి వెళ్లాడు. పని చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలాడు. దీంతో తోటి కూలీలు ఆసుపత్రికి తరలించారు. కాగా అతడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వేసవిలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 151 వైన్స్, 29 బార్లు ఉన్నాయి. ఇక్కడ రోజుకు రూ.5కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా అందులో రూ.1.50కోట్ల బీర్ల విక్రయాలు జరుగుతున్నాయి. వేసవి మొదలైనప్పటి నుంచి బీర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈ ఏడాది మార్చి నుంచి మే 27 నాటికి జిల్లా వాసులు రూ.129 కోట్ల విలువైన బీర్లు తాగారు.
Sorry, no posts matched your criteria.