India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KMRలోని PVNRడైరీ కళాశాలలో సమాచార హక్కు చట్టం 2005 పై ఉచిత శిక్షణ తరగతులను సోమవారం నిర్వహించినట్లు రాష్ట్ర డైరెక్టర్ MA సలీం తెలిపారు. దరఖాస్తు విధానము సెక్షన్ 6(1), మొదటి ఆపిల్ సెక్షన్ 19(1), రెండవ ఆపిల్ సెక్షన్ 19(3), సమాచారాన్ని ఇవ్వని అధికారులపై రాష్ట్ర సమాచార కమిషన్కు ఫిర్యాదు చేసే విధానాన్ని క్లుప్తంగా వివరించినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ సాహిల్ ఖాన్ పాల్గొన్నారు.
ఆటో, ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి చెందింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సోమవారం రాత్రి జరిగింది. రాంపూర్ గడ్డకు చెందిన ముగ్గురు మహిళలు ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. కామారెడ్డి వైపు నుంచి అతివేగంగా ట్రాక్టర్ వచ్చి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్యావల లచ్చవ్వ (40) అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నిర్మల్ జిల్లాలోని బాసరలో IIIT కళాశాలలో 2024-25లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 22 వరకు స్వీకరించనున్నారు. ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. మరిన్ని వివరాల కోసం www.rgukt.ac.in లేదా ఇమెయిల్ ద్వారా admissions @rgukt.ac.inని సందర్శించండి.
చాక్లెట్ ఆశ చూపించి ఆరేళ్ల బాలికపై ఒక కామాంధుడు అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక పినతల్లి చూడడంతో బాలికను వదిలి పరారీ అయ్యాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు స్థానికులు చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాలికపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆర్మూర్‌లోని రాజారాంనగర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన ఓ బాలికి తల్లిదండ్రులు శనివారం బాలిక(12)ను ఇంటి వద్ద వదిలి పనికి వెళ్లారు. ఇదే అదును భావించిన ఆ వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడగా బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
ఏజెంట్ల చేతిలో మోసపోయిన ఘటన బాల్కొండలో జరిగింది. శేఖర్, జశ్విందర్ సింగ్, మహజన్ అనే ముగ్గురు చంఢీగర్, ఢిల్లీలో ఏజెంట్లుగా పని చేస్తున్నామని మండలానికి చెందిన ఏడుగురిని నమ్మించారు. విదేశాల్లో జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద రూ.31.10 లక్షలు వసూలు చేశారు. నకిలీ వీసాలు, టికెట్లు పంపించడంతో వీరు నమ్మి డబ్బులు చెల్లించారు. గడువు సమీపించడంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉపాధి కోసం మస్కట్ వెళ్లిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన దాసరి నర్సింలు(41) గత నెల 24న ఒమన్‌లోని మస్కట్‌కు పని నిమిత్తం వెళ్లాడు. ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని ప్రజాప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నారు.
నిజామాబాద్ టౌన్ 3 పోలీస్ స్టేషన్ సిబ్బంది SC హాస్టల్ నాందేవ్ వాడ విద్యార్థులకు ఆన్ లైన్ మోసాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. OTP & సైబర్ క్రైమ్ మోసాల గురించి అవగాహన కల్పించామన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. సైబర్ క్రైమ్ పోర్టల్ & టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి అవగాహన కల్పించారు.
కామారెడ్డి పరిధిలోని మనోహరాబాద్ – గజ్వేల్ రైల్వే స్టేషన్ల మధ్యలో రామాయపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే SI తావునాయక్ తెలిపారు. మృతుడు 55 – 60 సం.ల మధ్య వయస్సు కలిగి, తెల్ల చొక్కా నల్ల ప్యాంటు ధరించాడన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే తమని సంప్రదించాలని SI తెలిపారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని 44 నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సత్య పీర్ల దర్గా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతను మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.