India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లాడ్జీలో వ్యభిచారం నడుపుతున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ SHO విజయ్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నవదుర్గ లాడ్జీ అసాంఘిక కార్యక్రమాలు (వ్యభిచారం) నడుపుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి చెన్న గంగాదాసు @ రాము, చెన్న దీక్షిత్, గుండేటి బోజన్న, సతీష్ (నవ దుర్గ మేనేజర్ )పై కేసు నమోదు చేసి బాధితురాలిని స్వధార్ హోంకు పంపినట్లు SHOవివరించారు.
నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో వైద్యం కోసం వస్తున్న పేద ప్రజలకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని పలువురు ఆరోపించారు. రోగులకు, వారి కోసం వచ్చిన వారికి అందించే భోజనంలో పురుగులు ఉన్నట్లు, గుడ్లు పాడయిపోయాయని వాపోయారు. ప్రభుత్వాసుపత్రిలో భోజన ఏజెన్సీ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ రోగుల పట్ల శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
కామారెడ్డిలోని గంజి మార్కెట్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్టు గుంతలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ళు ఉంటుందని, మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 23న జానకంపేట శివారు నిజాంసాగర్ ప్రధాన కాలువ గట్టు వద్ద <<13301418>>బాలికపై జరిగిన దాటి<<>> ఘటనను పోలీసులు ఛేదించారు. తమ వివాహేతర బంధానికి అడ్డువస్తుందని భావించి బాలిక తల్లి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కాలువ గట్టు వద్ద బాలికపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాలిక వద్ద వాంగ్మూలం తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
పిట్లం మండలం చిన్న కొడప్గల్ శివారులో సోమవారం జరిగిన కృష్ణయ్య <<13288336>>హత్య కేసును<<>> పోలీసులు
ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చిన్నకొడప్గల్ వాసి కృష్ణయ్య కొన్నేళ్లుగా తాగొచ్చి ఇంట్లో తన భార్య రుక్మిణితో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో ఆమె తన బావ అయిన సాయిలు, మరో వ్యక్తి సున్నం శ్రీకాంత్ సహాయంతో కృష్ణయ్యను హత్య చేయించినట్లు CI సత్య నారాయణ తెలిపారు.
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలానికి చెందిన అనన్యకు ఆమెరికా ప్రభుత్వం యూత్ అచీవ్మెంట్ అవార్డు అందించింది. వాషింగ్టన్‌లో పలు సేవా కార్యాక్రమాలు చేసినందుకు గాను ఈ అవార్డు వరించింది. కాగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో ఈ అవార్డును అనన్య అందుకున్నారు.
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ సింగ్ సస్పెన్షన్‌కు గురయ్యారు. రాష్ట్ర ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ సస్పెన్షన్ ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. ఆయనపై పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదు కావడం, విచారణ నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్ చేశారు.
రేపు జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో హైదరాబాద్ జట్టు గెలవాలని ఇందల్వాయి గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. కోల్‌కతాతో జరిగే ఫైనల్ మ్యాచులో హైదరాబాద్ జట్టు సభ్యులు రాణించాలని కోరారు. ఈ మేరకు రామాలయంలో దీపక్ పంతులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. గోపి, అశోక్, సతీశ్ కుమార్, మను సందీప్ తదితరులు ఉన్నారు.
కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పిట్లం మండలం చిల్లర్గిలో జరిగింది. SI నీరేశ్ వివరాలిలా.. చిల్లర్గి వాసి చాకలి సాయిలు (52) గురువారం సాయంత్రం తన పొలంలో వరి కొయ్య కాళ్ళు కాల్చుతుండగా.. ఒకే సారి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో నీళ్లతో మంటలు ఆర్పడానికి బోరు స్టార్టర్ బాక్స్ వద్దకు వెళ్లి మోటారు ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కామారెడ్డి జిల్లాలో ఎలుగు బంటి కలకలం రేపింది. లింగంపేటలోని మేంగారం-బోనాల్ మధ్య ఉన్న రోడ్డు పై ఎలుగుబంటి సంచరించడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నీరు తాగేందుకు వచ్చిందని ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.