India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డిచ్పల్లి సీఐ, జక్రాన్ పల్లి ఎస్ఐకి మానవ హక్కుల ట్రిబ్యునల్ నోటిసులు జారీ చేసింది. జక్రాన్ పల్లికి చెందిన జగడం మోహన్, భూషణ్, భాస్కర్ తమ సొంత భూమి విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ వేధింపులపై జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే గ్రామాభివృద్ధి కమిటీ తరఫున డిచ్పల్లి సీఐ, జక్రాన్ పల్లి ఎస్సైలు బాధితులను వేధింపులకు గురి చేశారు. దీంతో బాధితులు మానవ హక్కుల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో 1967లో మాత్రమే స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. 11 సార్లు కాంగ్రెస్, 3 సార్లు TDP, TRS, BJP ఒకసారి విజయం సాధించాయి. 2014లో TRS అభ్యర్థిగా కవిత ఎన్నికయ్యారు. 2004లో పునర్విభజన అనంతరం జగిత్యాల, కోరుట్లు నియోజకవర్గాలు నిజామాబాద్‌లో వచ్చి చేరాయి.
నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహావీర్ తండాకు చెందిన జాదవ్ సుధాకర్(35), అతని భార్యతో కలిసి గురువారం ద్విచక్రవాహనంపై డిచ్పల్లికి వెళ్తున్నారు. జక్రాన్పల్లి జాతీయ రహదారిపై బ్రేక్ డౌన్ కారణంగా నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టగా.. సుధాకర్ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన అతని భార్యను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుపతి తెలిపారు.
NZB ఎంపీ ఎన్నికల్లో ఇద్దరు వ్యక్తులు వరుసగా 3 సార్లు గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1952లో హరీశ్ చంద్ర హెడా కాంగ్రెస్ తరపున మెుదటి సారి ఎంపీగా అడుగు పెట్టారు. 1957, 1964లో వరుస విజయాలతో 3 సార్లు ఎంపీ అయ్యారు. మళ్లీ కాంగ్రెస్ తరపున 1971, 1977,1980 MP ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ నుంచి గడ్డం గంగారెడ్డి కూడా మూడు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ ఆయనకు హ్యాట్రిక్‌కు మధ్యలో బ్రేక్ పడింది.
తాడ్వాయి మండలం నందివాడ గ్రామం జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ బయో సైన్స్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దశరథ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈవో ఎస్.రాజు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. ఫైనాన్స్, చిట్టీల పేరిట ప్రజల నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేయడం, కస్టమర్లను బెదిరించిన ఘటనలో అతడిపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.
నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ BJP కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు సీఐలను సస్పెండ్ చేస్తూ ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణానికి చెందిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ మద్యం తాగి సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు ఆయన్ను సస్పెండ్ చేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ తప్పించుకునేందుకు సహకరించిన సీఐ ప్రేమ్ కుమార్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.
పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి మొదటి రోజు 2 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి సత్యనారాయణ, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థిగా భుక్యానంద్ నామినేషన్ వేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ ఇవ్వనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారిణి అరుణ తెలిపారు. 2011-2016, 2016-2019 సంవత్సరాల్లో డిగ్రీ ఫేయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ పరీక్షలు జూన్/జులైలో జరుగుతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలను తెలంగాణ వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించారు.
నిజామాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం తెలంగాణ భవన్‌లో KCR చేతుల మీదుగా B-ఫారమ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్లు విఠల్ రావు, దావ వసంత, అలీం, ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.