Nizamabad

News April 18, 2024

NZB ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాపేల్లి సత్యనారాయణ

image

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి అభ్యర్థుల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమయ్యింది. ఈ మేరకు స్వతంత్ర అభ్యర్థిగా రాపెల్లి సత్యనారాయణ తన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా రిటర్నింగ్ అధికారి ఛాంబర్ వద్దకు చేరుకున్న వారి నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తామన్నారు.

News April 18, 2024

లింగంపేట్: మురికి కాలువలో పసికందు మృతదేహం

image

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామంలో మురికి కాలువలో పసికందు మృతదేహం కలకలం రేపింది. ఇవాళ ఉదయం గ్రామస్థులు పసికందు మృతదేహన్ని మురికి కాలువలో గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 18, 2024

NZB: రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

నిజామాబాద్ నగర శివారులోని బోర్గాం (పి) గ్రామంలో లారీ ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు నాలుగవ టౌన్ ఎస్సై సంజీవ్ తెలిపారు. ఈనెల 16వ తేదీన బోర్గాంకు చెందిన ప్రదీప్ తన ద్విచక్ర వాహనంపై, మోపాల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా, గ్రామంలో లారీ ఢీకొట్టింది. ఘటనలో ప్రదీప్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

News April 18, 2024

NZB: నేటి నుంచి కలెక్టరేట్‌లో నామినేషన్ల స్వీకారం

image

నేటి నుంచి 25 వరకు ప్రతి రోజు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తామని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ జరుగుతుందన్నారు.

News April 18, 2024

1807 కేంద్రాలు.. 17,01573 మంది ఓటర్లు

image

పార్లమెంట్‌ ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 17,01573 ఓటర్లున్నారు. 936 ప్రదేశాల్లో 1807 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వారు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకొనేందుకు 12- డీ ఫారాలు ఇప్పటికే ఇచ్చారు. వీటిని 22వ తేదీ నాటికి తిరిగి బీఎల్‌వోలకు అందించాలి.

News April 18, 2024

రెంజల్: నీటిలో మునిగి పదోతరగతి విద్యార్థి మృతి

image

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. కందకుర్తి గోదావరి నదిలో బుధవారం స్నానానికి వెళ్లిన నవాజ్ (16) అనే పదో తరగతి విద్యార్థి నీట మునిగి మృతి చెందినట్లు SI సాయన్న తెలిపారు. నవాజ్.. స్నేహితులతో కలిసి మొగులపురా శివారు వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లాడు. నదిలో గుంతల లోతు తెలియక, ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని వెలికితీసి కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

News April 18, 2024

బీర్కూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

కోటగిరి మండలం లింగాపూర్‌కి చెందిన నీరడి సాయిలు (45) అనే వ్యక్తి బీర్కూర్ అంగడిలో కూరగాయలు తీసుకుని బైక్ పై స్వగ్రామానికి వెళ్తున్నారు. బైరాపూర్ గేట్ వద్ద సాయిలు తన బైక్‌తో ముందున్న మరో బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో కిందపడ్డ సాయిలుకు తలకు తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం 108లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో సాయిలు మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.

News April 18, 2024

కామారెడ్డి: పొద్దంతా ఎండ.. రాత్రికి వాన

image

కామారెడ్డి జిల్లాలో బుధవారం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనం రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంతంలో 11 మిల్లీమీటర్లు, బీబీపేటలో 3.5, సదాశివనగర్ లో 3.3, పాతరాజంపేట 3, మాచారెడ్డిలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని మిగితా ప్రాంతాల్లో 41 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.

News April 18, 2024

NZB: ఈ నెల 19న BRS ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి నామినేషన్

image

నిజామాబాద్ పార్లమెంట్ BRS ఎంపీ అభ్యర్థిగా ఈ నెల 19న మధ్యాహ్నం 12.05 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరు కానున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల BRS శ్రేణులు హాజరుకావాలని పిలుపునిచ్చారు.

News April 17, 2024

మాచారెడ్డిలో షార్ట్‌సర్క్యూట్‌‌తో గుడిసె దగ్ధం 

image

మాచారెడ్డి మండలంలోని హెల్పుగొండ గ్రామంలో బుధవారం షార్ట్‌సర్క్యూట్‌‌తో మొగుళ్ల లక్ష్మీకి చెందిన గుడిసె దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో రూ.50వేల వరకు ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

error: Content is protected !!