India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సరిగ్గా మరో 15 రోజుల్లో మన ఎంపీ ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. నిజామాబాద్, జహీరాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు. – మరి మీ MP ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?
బాన్సువాడ న్యూవీక్లీ మార్కెట్లో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనంలో రెండు కుళ్లిన మృతదేహలు కలకలం రేపాయి. ఓ షట్టర్‌లో బాలుడు, మహిళ శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 3 రోజుల క్రితం ఈ ఇద్దరు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి వివరాలు తెలిస్తే బాన్సువాడ CI కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అమెరికాకు చెందిన తన స్నేహితులతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఆమెరికాకు చెందిన శాస్త్రవేత్త స్టీవ్ బిల్డెడ్ కు నిజాంసాగర్‌లోని గోల్ బంగ్లా, దాని కింద గల గ్రామాలను చూపించారు. ప్రాజెక్టు సామర్థ్యం, ఇతర విషయాలు వివరించారు. ఎమ్మెల్యేతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్, రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
నగరానికి చెందిన గంగస్థాన్‌లో నివాసం ఉంటున్న వినీత్, దీపికలకు చెందిన కూతురు స్నీటిక కరెంట్ షాక్‌తో మృతి చెందిన ఘటన కుటుంబంలో విషాదం మిగిల్చింది. వివరాల్లోకి వెళితే.. స్నీటిక వేసవి సెలవుల నిమిత్తం తన బంధువుల ఇంటికి వెళ్ళింది. అయితే అక్కడ తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కూలర్‌ను తాకడంతో కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే చిన్నారి మృతి చెందింది.
ఆత్మహత్యలకు నిజామాబాద్ మెడికల్ కళాశాల అడ్డాగా నిలుస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన జూనియర్ డాక్టర్లు తనువులు చాలిస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. అయితే మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇతర పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగానే తరచుగా ఇలాంటి ఘటనలు కళాశాలలో పునరావృతం అవుతున్నాయనే విమర్శలు తలెత్తుతున్నాయి.
SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజాంబాద్ గ్రామీణ ప్రాంత యువకులకు హౌజ్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. శిక్షణ పొందేందుకు 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలని, ఈనెల 20 నుంచి 30 రోజులపాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. శిక్షణ పొందే వారికి ఉచిత భోజన వసతి కల్పిస్తామని వెల్లడించారు.
రోడ్డు పై ఉంచిన వడ్ల కుప్ప ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటన పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలోశనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకెళితే.. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలానికి చెందిన సురేందర్ గొండ బైక్ పై మాసాన్ పల్లి వెళ్లాడు. తిరిగి తన స్వగ్రామానికి వస్తున్న ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పను గమనించకుండా కుప్ప పైకి బైకు ఎక్కించడంతో అదుపు తప్పి కిందపడి అక్కడిక్కడే మృతి చెందాడు.
నిజామాబాద్‌కు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఫైనల్‌లో సత్తా చాటింది. ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నిలో నిఖత్ (52 కేజీలు) అద్భుత విజయంతో బంగారు పతకం కైవసం చేసుకుంది. నిఖత్ తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన ఝహిరా ఒరక్‌బయవా పై 5-0తో నెగ్గింది. బౌట్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డ నిఖత్.. అలవోకగా విజయం సాధించింది.
కామారెడ్డి మండలం గౌరారం తండాకి చెందిన కేతావత్ మంజుల (38) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. మంజుల తన ఇంటి ముందు బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టెట్ అభ్యర్థులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. దరఖాస్తుల సమయంలో రుసుము రూ.400 నుంచి 1000 పెంచగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాల కేటాయింపులో సైతం సొంత జిల్లాలో కాకుండా దూరపు ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుకు రూ.1000 తీసుకొని దూరపు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.