Nizamabad

News May 18, 2024

నిజామాబాద్‌లో టఫ్ ఫైట్: జీవన్ రెడ్డి

image

నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో టఫ్ ఫైట్ ఉందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎవరైనా గెలిచే అవకాశం ఉందన్నారు. జగిత్యాల ప్రజల తీర్పును గౌరవిస్తానని చెప్పారు. కాగా ఇక్కడ బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి బరిలో ఉన్నారు. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై మీ కామెంట్?

News May 18, 2024

నిజామాబాద్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు

image

నిజామాబాద్ జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు కొదువ లేదు. ఏటా వేసవిలో ఇతర జిల్లాల నుంచి వందలాది మంది వస్తుంటారు. జిల్లాలో ప్రధానంగా డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, శ్రీ రఘునాథాలయం కోట, అలీసాగర్, అశోక్ సాగర్, నిజాంసాగర్, నీలకంఠేశ్వర ఆలయం, మల్లారం అడవి, మ్యూజియం, దోమకొండ కోట, ఆర్మూర్ రాక్ ఫార్మేషన్స్, పోచారం అభయారణ్యం వంటి అద్భుతమైన ప్రాంతాలున్నాయి.
– ఇంకా మీకు తెలిసిన.. మీకు నచ్చిన ప్లేస్ ఏంటో కామెంట్ చేయండి.

News May 18, 2024

NZB: మెడికల్ కాలేజ్‌లో కలకలం రేపుతున్న ఆత్మహత్యలు

image

నిజామాబాద్‌లోని మెడికల్ కాలేజ్‌లో ఆత్మహత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం కాళశాలలో ఓ మహిళా జూనియర్ డాక్టర్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పిడింది. గమనించిన స్నేహితులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా ఇదివరకు అక్కడ జరిగిన ఆత్మహత్య ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

News May 18, 2024

NZB: మంత్రి తుమ్మల ను కలిసిన డీసీసీబీ ఛైర్మన్

image

రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కుంట రమేశ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించారు. రుణమాఫీ ప్రక్రియను త్వరగా చేపట్టాలని కోరారు. రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించుకుకోవాలని ఆయన్ను కోరారు.

News May 17, 2024

బడులు ప్రారంభం అయ్యే నాటికి పనులన్నీ పూర్తి కావాలి: CS

image

బడులు పునః ప్రారంభం అయ్యే నాటికి పనులన్ని పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లకు సూచించారు. శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ల‌తో మాట్లాడారు. కొత్త విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకునేందుకు మరో 20 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్నందున యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి గడువులోపు పూర్తయ్యేలా పనులు పూర్తిచేయాలన్నారు.

News May 17, 2024

డిగ్రీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: టీయూ రిజిస్ట్రార్

image

డిగ్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని టీయూ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి డిగ్రీ రెగ్యులర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌లతో అకడమిక్ అడిట్ సెల్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 21 నుంచి జూన్15 వరకు ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా మొత్తం 38 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

News May 17, 2024

BREAKING: కామారెడ్డి: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసానిపల్లి వద్ద 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్-అకోలా 161వ జాతీయ రహదారిపై బైక్‌పై ముగ్గురు వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్(35), సునీత(30), కుమారుడు నగేశ్(7) మృతిచెందారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద తడ్కుర్ గ్రామానికి చెందిన వ్యక్తులుగా స్థానికులు గుర్తించారు.

News May 17, 2024

దేవునిపల్లి: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న మల్లారెడ్డి గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని మగ మృతదేహం లభించిందని ఎస్ఐ రాజు తెలిపారు. వయస్సు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంది. మృతదేహం పూర్తిగా కూలిపోయిందని చెప్పారు. వారం రోజుల క్రితం చనిపోయినట్లుగా భావిస్తున్నామన్నారు. మెడలో చిన్న తాయత్తు నల్లటి దారం ఉంది. కుడిచేతి ఉంగరపు వేలుకు రాగి ఉంగరం ఉందని చెప్పారు.

News May 17, 2024

నిజామాబాద్‌కి ఇంజినీరింగ్ కాలేజ్?

image

ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. గతంలో 3 విధాల ప్రతిపాదనలు ఉన్నత స్థాయికి వెళ్లినా ఆచరణలో ముందడుగు పడని విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. మహిళా కళాశాలతో పాటు ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో చెప్పారు. ఈ తరుణంలో ఈ రెండు కళాశాలల ఏర్పాటుపై ఆశలు చిగురించినట్లయింది.

News May 17, 2024

నిజామాబాద్: ఫోన్ కోసం రైలు నుంచి దూకేశాడు

image

ఫోన్ కోసం ఓ యువకుడు రైలు నుంచి దూకేశాడు. వివరాలిలా.. అబ్దుల్‌ రైలులో ప్రయాణిస్తున్నాడు. డిచ్‌పల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే అతని ఫోన్‌ కిందపడింది. దాని తీసుకునేందుకు వెంటనే రైలు నుంచి దూకాడు. ఈ ప్రమాదంలో అతని ఎడమ కాలి పాదం నుజ్జునుజ్జయింది. స్థానికులు 108కు సమాచారం ఇచ్చి చికిత్స కోసం NZMకు తరలించారు. ఫోన్ తెచ్చి ఇచ్చేవరకు చికిత్సకు వెళ్లనని మారాం చేశాడు. ఫోన్‌ మాత్రం దొరకలేదు.