India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లైంగిక వేధింపుల ఆరోపణలపై కామారెడ్డి DMHOను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యాధికారిణులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ అనంతరం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. లక్ష్మణ్ సింగ్ తమను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లుగా ఇటీవల వైద్యాధికారిణులు ఆరోపించారు.
నిజామాబాద్‌కు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నిలో నిఖత్ (52 కేజీలు) అద్భుత విజయంతో ఫైనల్‌కు చేరుకుంది. కజకిస్థాన్‌కి చెందిన టొమిరిస్ మిర్జాకుల్ పై 5-0 తో విజయం సాధించింది. బౌట్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డ నిఖత్ అలవోకగా విజయం సాధించింది.
2024 – 25 విద్యా సంవత్సరంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం క్రింద 1వ తరగతిలో డే స్కాలర్ ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి రజిత తెలిపారు. చిన్నారులు 1 జూన్ 2018 నుంచి 31 మే 2019 మధ్య జన్మించి ఉండాలన్నారు. అర్హులైన బాలబాలికల తల్లిదండ్రులు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
టీయూ పరిధిలోని డిగ్రీకి సంబంధించి జూన్ 6న జరగాల్సిన పరీక్ష జూన్ 15వ తేదీకి వాయిదా వేసినట్లు యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 6న జరగాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ 2, 4, 6వ సెమిస్టర్లు, బ్యాక్‌లాగ్ పరీక్షలు ఐసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కారణంగా వాయిదా పడ్డాయని వెల్లడించారు. సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.
ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీతో పాటు జిల్లా యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేసింది. అయినా ఎంపీ ఎన్నికల్లో చాలా మంది ఓటు వేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. NZB పరిధిలో 17,04,867 మంది ఓటర్లు ఉంటే 12,26,133 మంది వేయగా, 4,78,734 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. NZB అర్బన్‌లో ఓటింగ్ శాతం చూస్తే అత్యల్పంగా ఉంటుంది. ఈఎన్నికల్లో అర్బన్‌లో 3,04,317 మంది ఓటర్లుంటే 1,88,159 మందే ఓటేశారు.
జహీరాబాద్‌లో విజయం ఎవరిదనేది హాట్ టాపిక్‌గా మారింది. 2019లోనూ రసవత్తర పోరు సాగింది. మదన్ మోహన్(కాంగ్రెస్)పై బీబీ పాటీల్ (BRS) 6,229 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బాణాల లక్ష్మారెడ్డి (BJP) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో సురేశ్ షెట్కార్ (కాంగ్రెస్), బీబీపాటీల్ (BJP), గాలి అనిల్ కుమార్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు మాదే మెజార్టీ అంటున్నారు. మీ కామెంట్?
కామారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డి.లక్ష్మణ్ సింగ్ పై వైద్యాధికారిణులు వేర్వేరుగా ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో 7 కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ నాగేశ్వర్‌రావు తెలిపారు. వివిధ సెక్షన్ల కింద మంగళవారం 5, బుధవారం మరో 2 కేసులు నమోదయ్యాయి. తమను ఏడాదిన్నర కాలంగా లక్ష్మణ్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నట్లు వైద్యాధికారిణులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
సినిమా థియేటర్ల నిర్వాహకుల నిర్ణయం మేరకు ఉమ్మడి NZB జిల్లాలో ఈ నెల 17 నుంచి 15 రోజుల పాటు సినిమా థియేటర్లు బంద్ పాటిస్తున్నారు. NZB, KMR జిల్లాల్లో 35కి పైగా ఉన్న సింగిల్ థియేటర్లు మూసివేయనున్నారు. మల్టీఫ్లెక్స్‌లు మాత్రం కొన్నిరోజులు కొనసాగుతాయని పేర్కొంటున్నారు. మారుతున్న సాంకేతిక ప్రభావంతో ఓటీటీల్లో కోరుకున్న సినిమా అనుకూలమైన సమయంలో ఇంట్లోనే తిలకించే అవకాశం రావడమే ముఖ్యకారణంగా చెబుతున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 4.93 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 69.01 శాతం నమోదు కాగా 2024లో 74.63 శాతం నమోదైంది. మొత్తం 16.41 లక్షలకు 12.25లక్షల మంది ఓటేశారు. ఇక్కడ 2019లో బీబీపాటిల్(BRS) 6,229 మెజార్టీతో మదన్ మోహన్ రావు(INC)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో సురేశ్ షెట్కార్(INC), గాలి అనిల్ కుమార్(BRS), బీబీ పాటిల్,(BJP) బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.
ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం ధాన్యం కొనుగోళ్లపై జిల్లా పౌరసరఫరాల, సహకార శాఖ అధికారులు, రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలు లేకుండా ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలన్నారు.
Sorry, no posts matched your criteria.