India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KCR RSS ఏజెంట్ అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. KMRలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిడ్డ బెయిల్ కోసం KCR BRS పార్టీని MPఎన్నికల్లో BJPకి తాకట్టు పెట్టారని విమర్శించారు. పార్టీని, కేడర్‌ను, తెలంగాణ ప్రజల నమ్మకాన్ని BJPకి అమ్మేశారని ఆరోపించారు. BJPతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్న KCRకు సెక్యులరిజంపై మాట్లాడే హక్కు లేదన్నారు. KMRలో కాంగ్రెస్‌కు బంపర్ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఒలింపిక్స్‌కు ముందు నిజామాబాద్‌కు చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణి నిఖత్ (52 కేజీలు) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో నిఖత్ 5-0తో రఖింబెర్ది జాన్సాయా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. బౌట్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డ నిఖత్.. అలవోక విజయంతో రెండో రౌండుకు దూసుకెళ్లింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వంశీ ఇంటర్నేషనల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడారు. బీజేపీ ఉత్తర భారత దేశంలో ఉనికి కోల్పోతుందని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. నిజామాబాద్‌లో లక్ష 30 వేల మెజార్టీతో గెలుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
లోక్‌సభ పోరు ముగిసింది. ఓటరు తీర్పు EVMలలో నిక్షిప్తమైంది. రాజకీయపార్టీలు నెల రోజులుగా హోరాహోరీగా ప్రచారం చేశాయి. తుది తీర్పు కోసం ఓటర్ల నిర్ణయంపై ఆధారపడ్డాయి. ZHB స్థానంలోని 16,41,410 మంది ఓటర్లు 19 మంది అభ్యర్థులు, NZB పరిధిలోని 17,04,867 ఓటర్లు 29 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించారు. అధికారులు EVMలను స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. విజేత ఎవరో తేలాలంటే వచ్చే నెల 4వ వరకు నిరీక్షించాల్సిందే..
నిజామాబాద్, జహీరాబాద్ ఓటరు తీర్పు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నిజామాబాద్ లోక్‌సభకు 29 మంది, జహీరాబాద్‌కు 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పొలిస్తే ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అభ్యర్థుల్లో టెన్షన్ పెంచింది. దీనికి తెరపడాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.
నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సీబీఎస్ఈ విడుదల చేసిన ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. సమీక్షారెడ్డి 600 మార్కులకు గాను 559 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలవగా, మదన్ శ్రీవల్లభ్ 557 మార్కులు సాధించాడు. నిజాంసాగర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు శతశాతం ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్ల పని పూర్తైనప్పటికీ నాయకులు, అనుచరులకు మాత్రం ఫలితాలు రావాలంటే 22 రోజుల నిరీక్షణ తప్పదు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఒక ఎత్తయితే.. ఫలితాల కోసం నిరీక్షించడం మరో ఎత్తు కానుంది. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత 40 రోజులకు ఫలితాలు వెలువడగా.. ఇప్పుడు 22 రోజుల పాటు వేచి చూడాల్సిందే.
ఓటేసి వచ్చి వ్యక్తి మృతిచెందిన ఘటన సోమవారం రామారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రెడ్డిపేట గ్రామానికి చెందిన మొల్ల షఫీ (48) లైన్లో 30 నిమిషాలు నిలబడి ఓటు వేశారు. ఇంటికెళ్లిన తర్వాత గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి రెండు గంటలకే సగటున 10.91 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అనంతరం కూడా అంతకంతకూ ఊపందుకుంది. ఉదయం 11 గంటల సమయానికి 28.26 శాతం జరిగిన ఓటింగ్, మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 45.67 శాతానికి, మధ్యాహ్నం 3గంటల సమయానికి 58.70 శాతానికి, సాయంత్రం 5 గంటల సమయానికి 67.96 శాతానికి చేరుకుంది.
ఓటు వేయడానికి వచ్చిన వృద్ధురాలు మృతి చెందిన ఘటన నిజామాబాద్‌జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. న్యూ పోతంగల్‌కు చెందిన గిరిగమ అనే వృద్ధురాలు ఓటు వేయడానికి సోమవారం పోలింగ్ కేంద్రానికి వచ్చింది. గేటు దాటి లోపలికి వెళుతూ నీరసంగా ఉందని కొద్ది సేపు కూర్చోని అక్కడే స్పృహకోల్పోయింది. దవాఖానాకు తీసుకెళ్లగా ఆరోగ్య సిబ్బంది పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.