Nizamabad

News April 3, 2024

కామారెడ్డి: జిల్లాలో 1013 బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాల అమలు: కలెక్టర్

image

జిల్లాలోని 1013 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మహిళా సంఘాలలోని సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆకమిటీ ఆద్వర్యంలో స్కూల్లో తాగునీరు, తరగతిగదుల్లో చిన్నచిన్న మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు సమస్యలను గుర్తించాలన్నారు. ఆ కమిటీల ఆధ్వర్యంలో అన్ని మరమ్మతు పనులు చేయించాలని ఆదేశించారు.

News April 2, 2024

NZB:పసుపు బోర్డు ఎక్కడ.. అరవింద్?: జీవన్‌రెడ్డి

image

ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటన చేసి ఆరునెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేస్తారా? లేక అహ్మదాబాద్లో పెడతారా? అని ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ ‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

News April 2, 2024

అరవింద్, జీవన్‌రెడ్డి.. దొందూ దొందే : బాజిరెడ్డి

image

మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి SRS గార్డెన్లో BRS కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. MP అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… అరవింద్, జీవన్ రెడ్డి దొందూ దొందే అని విమర్శించారు. వారిద్దరు నిజామాబాద్ జిల్లాకు చేసింది శూన్యమన్నారు. కాంగ్రెస్ నుంచి MLCగా ఉన్న జీవన్‌రెడ్డి ఒక్కరోజైనా మోపాల్ మండల ప్రజల మంచి, చెడు అడిగారా అని ప్రశ్నించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉంటానన్నారు.

News April 2, 2024

NZB: విషాదం.. కుప్పకూలి మహిళ మృతి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట బస్టాండ్ వద్ద ఓ మహిళ మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. టీ తాగిన అనంతరం చెట్టుకింద కూర్చున్న మహిళ ఛాతి నొప్పి వస్తుందంటూ అక్కడే కుప్పకూలి చనిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలు కామారెడ్డి మండలం తిమ్మానగర్‌కు చెందిన గుర్రాల కళవ్వగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News April 2, 2024

NZB: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన సులోచన అనే మహిళ రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీరంతా ఒక కారులో మంగళవారం మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు కారంపొడి కోసం వెళ్లి తిరిగి వస్తుండగా నవీపేట్ మండలం జగ్గారావు ఫారం వద్ద వీరి కారు ప్రమాదవశాత్తు చెట్టును బలంగా ఢీ కొంది. సులోచన స్పాట్ లోనే మృతిచెందగా అనిత, సునీత, కవితకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

News April 2, 2024

నిజామాబాద్‌లో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్‌లో జరిగింది. గౌతమ్ నగర్‌కు చెందిన శ్రీనివాస్(56) సోమవారం రాత్రి ఇంట్లో గొడవ పడి అర్ధరాత్రి తర్వాత మిర్చి కాంపౌండ్ రైల్వే గేట్ వద్ద జైపూర్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే SI సాయి రెడ్డి తెలిపారు. అతడు నగరంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

News April 2, 2024

NZB: వాహన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం

image

నిజామాబాద్‌లో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు 1టౌన్ SHO విజయ్ బాబు తెలిపారు. కుమార్ గల్లీలో తనిఖీలు నిర్వహిస్తుండగా గంగ ప్రసాద్ అనే వ్యక్తి ఎలాంటి అక్రమంగా రూ.6,89,500 నగదు, రూ.34,89,500 విలువైన 400 గ్రామాల బంగారు బిస్కెట్లు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నగదు, బంగారాన్ని సీజ్ చేసి అతడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News April 2, 2024

NZB: అద్దె అడిగినందుకు ఇంటి యజమానిపై దాడి

image

అద్దె అడిగినందుకు యజమానిపై దాడి చేసిన ఘటన NZBలో చోటుచేసుకుంది. బోధన్‌లో నివాసం ఉంటున్న ఇర్ఫాన్‌కు నగరంలోని బర్కత్‌పురాలో ఇళ్లు ఉంది. అందులో కొన్ని రోజుల నుంచి సమీన్ కుటుంబం అద్దెకు ఉంటోంది. సోమవారం ఇర్ఫాన్ అద్దె చెల్లించాలని సమీన్‌ను ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో సమీన్ అతడి స్నేహితులతో కలిసి ఇర్ఫాన్‌పై దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO రామ్ తెలిపారు.

News April 2, 2024

కామారెడ్డి: అక్కడ మహిళలే నిర్ణేతలు..!

image

జహీరాబాద్ లోక్‌సభ స్థానంలోని 7 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లే అధికంగా ఉన్నాయి. మొత్తం 16,31,996 ఓట్లు ఉండగా.. ఇందులో పురుషులు 7,98,220, మహిళలు 8,33,718, ట్రాన్స్‌జెండర్లు 58 మంది ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వారి పోలింగ్ శాతమే అధికం. కాగా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది మహిళల ఓటర్లపైనే ఆధారపడి ఉంది.

News April 2, 2024

ఆర్మూర్ డివిజన్ పరిధిలోని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు

image

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఆర్మూర్ డివిజన్లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్ పల్లి – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, దూద్గాం – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, తల్వేదా – అంతర్ జిల్లా చెక్ పోస్ట్, భీంగల్ – SST చెక్ పోస్ట్ పరిధిలో SST& పోలీస్ సిబ్బంది విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలలో సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!