Nizamabad

News May 11, 2024

ఎంపీగా ఉండి అభివృద్ధిని పట్టించుకోని అర్వింద్: జీవన్ రెడ్డి

image

ఐదేళ్ళు అధికార పార్టీ ఎంపీగా ఉండి అభివృద్ధిని పట్టించుకోని అర్వింద్ ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బూటకపు హామీలిస్తున్నారని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ సమస్యల పట్ల అర్వింద్ కు అవగాహన చిత్తశుద్ది లేదన్నారు. అర్వింద్ కవితను ఆదర్శంగా తీసుకుని పనిచేశారని, ఆయన ఎవరికీ అందుబాటులో లేరని,
ప్రజా సమస్యలు గాలికొదిలేశారని ఆరోపించారు.

News May 11, 2024

NZB: నేటి సాయంత్రం నుంచి 144 సెక్షన్: CP

image

పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని CP కల్మేశ్వర్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రోజు సాయంత్రం తర్వాత నిజామాబాదు పార్లమెంటులో ఓటు లేని బయటి ప్రాంతాల వ్యక్తులెవరూ ఉండకూడదన్నారు. ఈ మేరకు
లాడ్జీలు, ఫంక్షన్ హాల్స్‌కు నోటీసులిచ్చామన్నారు.

News May 11, 2024

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారు: అర్వింద్

image

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారని, కనుక ప్రజల్లో మార్పు రావాలని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కోరారు. శనివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వ హించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో అరవింద్ మాట్లాడుతూ దేశ భద్రతపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని, ఈ విషయమై ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.

News May 11, 2024

కామారెడ్డిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

కామారెడ్డిలో గుర్తుతెలియని మృతదేహాం లభ్యమైనట్లు రైల్వే ఎస్సై తావు నాయక్ తెలిపారు. అక్కన్నపేట, మిర్జాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న పట్టాల పక్కన మృతదేహం లభ్యమైనట్లు రైల్వే సిబ్బంది సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించిన ఎస్ఐ మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

News May 11, 2024

NZB జిల్లాలో 3 రోజులు మద్యం షాపులు బంద్

image

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 13 వరకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు.

News May 11, 2024

NZB: హోటల్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్

image

హోటల్ ముసుగులో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని HYD పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద 11.34గ్రా కొకైన్, 3.66గ్రా MDMA స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం వెల్లడించారు. NZBకి చెందిన సాయి శరత్, శ్రవణ్ అన్నదమ్ములు. వారిద్దరూ 2019లో బంజారాహిల్స్‌లో ఓ రెస్టారెంట్ ప్రారంభించారు. శరత్ ప్రేమలో విఫలం కావడంతో డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో రిషబ్‌తో పరిచయం కాగా ముగ్గురు కలిసి డ్రగ్స్ అమ్మడం ప్రారంభించారు.

News May 11, 2024

BJP MP ధర్మపురి అర్వింద్‌ పై కేసు

image

నిజామాబాద్ BJP MP ధర్మపురి అర్వింద్‌ పై కేసు నమోదు చేసినట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హిందువులకు ప్రమాదకరంగా మారాడని అన్నారు. జగిత్యాల ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అర్వింద్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. దీంతో ఎలక్షన్ ఇన్‌ఛార్జ్ విజయేందర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అర్వింద్ పై కేసు నమోదు చేశారు.

News May 11, 2024

NZB: నిఘా నీడన లోక్ సభ ఎన్నికలు

image

నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పార్లమెంటు పరిధిలోని 7నియోజకవర్గాల్లో దాదాపు 2507 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1808 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. సీసీ కెమెరాల నిఘా నీడలో భద్రత కల్పిస్తున్నారు. 506 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొనున్నారు.

News May 11, 2024

NZB: ఓటేయ్యడానికి ఈ ఇవి తీసుకెళ్లోచ్చు: కలెక్టర్

image

నిజామాబాద్ ఓటర్‌కార్డు లేని ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద యొక్క గుర్తింపు పత్రాలను తీసుకెళ్లి చూపించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, జాబ్‌కార్డ్, పాసుబుక్, ఇన్సూరెన్స్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, పాస్‌పోర్ట్, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ గుర్తింపుకార్డుల్లో ఏదైనా తీసుకొని వెళ్ళి ఓటు వేయవచ్చని పేర్కొన్నారు.

News May 10, 2024

ఆ పార్టీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేస్తున్నారు: బాజిరెడ్డి గోవర్ధన్

image

కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ తో పనిచేస్తున్నారని నిజామాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌లు ఇద్దరిలో ఎవరైనా గెలవాలి గానీ బీఆర్‌ఎస్ మాత్రం గెలవద్దని మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేస్తున్నాయన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో కర్రు కాల్చివాత పెడతారని పేర్కొన్నారు.