Nizamabad

News May 10, 2024

KMR: రేపే లాస్ట్.. అగ్రనేతల రాకతో వేడెక్కిన పాలిటిక్స్..!

image

లోక్ సభ ఎన్నికల ప్రచార గడువు రేపటితో ముగియనుంది. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ దూకుడును పెంచాయి. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీల అగ్రనేతలను రంగంలోకి దింపుతు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ KMR జిల్లాలో బీజేపీ MLA రాజాసింగ్ బీబీ పాటిల్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. సురేష్ షెట్కార్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి రేపు ప్రియాంక గాంధీ, CM రేవంత్ రెడ్డి కామారెడ్డి కు రానున్నారు.

News May 10, 2024

NZB: డీకంపల్లి పెద్దమ్మ గుడిలో దొంగల బీభత్సం

image

ఆలూర్ మండలం డికంపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెద్దమ్మ గుడి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుడి తాళాన్ని బద్దలు కొట్టి అమ్మవారి ముక్కుపుడక, బంగారు ఆభరణాలు, వెండి కన్నులు అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News May 10, 2024

దోమకొండ: విక్రమ్ మృతదేహం వెలికితీత

image

దోమకొండ గ్రామానికి చెందిన విక్రమ్ అనే యువకుడు గురువారం సాయంత్రం దోమకొండ మండల కేంద్రంలోని కుడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం అతని మృతదేహాన్ని దోమకొండ ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో చెరువులో నుంచి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 10, 2024

మాచారెడ్డి: ఉరేసుకొని ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మాచారెడ్డి మండలం తండాలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. లావుడ్య నవీన్ (21) కొద్దిరోజులుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆటోలు సరిగ్గా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పులు కూడా పుట్టకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

News May 10, 2024

కామారెడ్డి: ఆత్మహత్య చేసుకుంటున్నానని మిత్రుడికి కాల్‌

image

దోమకొండకు చెందిన యువకుడు విక్రమ్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని స్నేహితుడికి కాల్ చేశాడు. తాను గ్రామంలోని కుడి చెరువుకు వచ్చానని వీడియో కాల్‌లో చెబుతూ చెరువులోకి దిగాడు. వద్దు వస్తున్నానంటూ ఆ స్నేహితుడు చెప్పినా వినిపించుకోలేదు. చెరువు వద్దకు ఆయన వచ్చి చూడగా చెరువు నీటిలో చెప్పులు కనబడ్డాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఈతగాళ్లతో చెరువులో వెతికించారు. రాత్రి వరకు ఆయనను గుర్తించలేదు.

News May 10, 2024

KMR: స్వతంత్రులు పోటీ చేస్తున్నా..ప్రభావం చూప్తలే..!

image

అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. ఎక్కువ మంది డిపాజిట్ కోల్పోతున్నారు. ZHB లోక్ సభ నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో ఎన్నిక జరగుతుంది. 19 మంది బరిలో ఉండగా..స్వతంత్రులుగా 10 మంది పోటీ చేస్తున్నారు. వారి వారి లక్ష్యాలతో బరిలో దిగుతున్న కనీస పోటీ ఇవ్వలేక పోతున్నారు. దీనికి పెరిగిన ప్రచార వ్యయమే ప్రధాన కారణమవుతుంది.

News May 9, 2024

NZB: బ్రాండ్ బాటిళ్లలో చీప్ లిక్కర్.. వైన్స్ సీజ్

image

హయ్యర్ బ్రాండ్‌ బాటిళ్లలో చీప్ లిక్కర్ కలుపి అమ్ముతున్న ఓ వైన్స్‌ను గురువారం పోలీసులు సీజ్ చేశారు. నిజామబాద్‌లోని పరమేశ్వరి వైన్స్‌లో స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్ గురువారం సోదాలు నిర్వహించారు. 37 ఫుల్ బాటిళ్ల కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకొని, వైన్స్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ దాడిలో SHO దిలీప్, SIలు మల్లేశ్, సుష్మిత, సింధు, సిబ్బంది ఉన్నారు.

News May 9, 2024

NZB: చేరికలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి

image

లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా NZB, ZHB స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రత్యేక వ్యూహం రూపొందించింది. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని, ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా KMR మాజీ వక్స్ బోర్డు ఛైర్మెన్, పలు గ్రామాలకు చెందిన నాయకలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

News May 9, 2024

KMR: తొలి MLA, MPలు.. తాతామనవళ్లు

image

నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి, ZHB లోక్ సభ స్థానానికి తొలి MLA, MPలుగా ఎన్నికైంది షెట్కార్‌లే కావడం గమనార్హం. 1952లో ప్రస్తుత NKD అసెంబ్లీ సెగ్మెంట్ కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉండేది. అప్పుడు జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అప్పారావు షెట్కార్ MLA అయ్యారు. పునర్విభజన తర్వాత 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో సురేశ్ షెట్కార్ MPగా గెలిచారు. కాగా వీరిద్దరూ తాతామనవళ్లు కావడం గమనార్హం.

News May 9, 2024

NZB: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

image

నిజామాబాద్‌ పట్టణం నాగారంలోని 300 క్వార్టర్స్‌కు చెందిన చెన్నూరు కావేరి(30) అనే వివాహిత బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త సంతోష్ ఆటోడ్రైవర్ కాగా తాగి డబ్బులు వృథా చేస్తున్నాడని వారిద్దరి మధ్య గతకొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే కావేరిని తన భర్తే హత్య చేసి ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.