India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జహీరాబాద్ ఎంపీ ఎన్నికల ఫలితంపై ప్రధాన పార్టీల్లో ఆందోళన మొదలైంది. సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులకు ఓటర్ నాడి అంతు చిక్కక తలలు పట్టుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ క్లారిటీ ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం ఎటువైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. నమ్ముకున్న కార్యకర్తలే ఎటు ఓటు వేస్తారన్న ఆలోచనలో కొంత మంది ఉన్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి జహీరాబాద్ సవాల్‌గా మారిందని టాక్.
సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడటంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టిసారించాయి. NZB, ZHB లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, BRS, BJP మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయి సమావేశాలు, బహిరంగ సభలు, కూడలి సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం మూడు రోజులు ఉండడంతో అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది.
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని రైలు ఢీకొట్టిన ఘటనలో మృతుడి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌కి చెందిన మాలోత్ ప్రకాశ్‌గా గుర్తించారు. తన సొంత పనులపై బైక్‌పై మెదక్ వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ప్రకాశ్ బంధువుల ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. దీంతో 3 ప్రధాన పార్టీలు ముఖ్యనేతలను రప్పించి రోడ్‌షోలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, CM రేవంత్ రెడ్డిల బహిరంగ సభను ఈనెల 11న కామారెడ్డిలో ఏర్పాటు చేశారు. పోల్‌మేనేజ్‌మెంట్‌ను పక్కాగా చేపట్టేందుకు అభ్యర్థులు, నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌లో జరగనుంది. తమ సత్తా చాటేందుకు భారత క్రీడాకారులు తుది సన్నాహాల్లో ఉన్నారు. 2 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బాక్సర్ నిఖత్ జరీన్ ఒలంపిక్స్‌కు అర్హత సాధించారు. నిఖత్‌తో పాటు ప్రీతి పవార్, పర్వీన్ హుడా, లవ్లీనా బోర్గోహైన్ పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. ఇక దేశం మొత్తం నిఖత్ జరీన్ బంగారం లాంటి ప్రదర్శన చేస్తుందని ఎదురు చూస్తోంది.
NZB జిల్లాలో CM రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. NZB లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న జీవన్ రెడ్డికి మద్దతుగా ఆయన బుధవారం ఆర్మూర్, NZBలో ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రేవంత్ తన ప్రసంగాలతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని సూచించారు.
నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఎంపీలుగా కల్వకుంట్ల కవిత, అర్వింద్ ధర్మపురి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం రాత్రి ఆయన నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. వందరోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరుస్తామని మాట తప్పిన కవితను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించారిని విమర్శించారు. ఇక ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తానని ఐదేళ్లుగా అర్వింద్ మోసం చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ గెలిస్తేనే రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి నిజామాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. మోదీ మనసునిండా రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనే ఉందన్నారు. బీఆరెస్, బీజేపీ ఒక్కటేనన్నారు.
NZB లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా CM రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత నెల 22న NZBలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన బుధవారం NZB, ఆర్మూర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. కేవలం పక్షం రోజుల గ్యాప్‌లో జిల్లాకు రెండో సారి వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. మరో పక్క ఈ నెల 11న KMR జిల్లా ఎల్లారెడ్డిలో ప్రియాంక గాంధీ ప్రోగ్రాం ఫిక్స్ అయ్యింది.
తాడ్వాయి మండలంలోని ఎండ్రియల్ గ్రామానికి చెందిన ఓ యువ జంట తమ 10వ వివాహ
వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తమ నిర్ణయంతో ఆడపిల్లకు గౌరవం చేకూరుతుందని దంపతులు రెడ్డిగారి శ్రావణలక్ష్మి,
తిరుపతిరెడ్డిలు చెబుతున్నారు. జనవరి ఒకటి 2024 నుంచి గ్రామంలో జన్మించిన
ప్రతి ఆడపిల్లకి తమ వంతు సహాయంగా తపాలాఖాతా తెరిచి ఒక్కొక్కరికి రూ. 2వేల
నగదును డిపాజిట్ చేయనున్నట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.