Nizamabad

News May 2, 2024

నాలుగు, ఐదు తేదీల్లో హోమ్ ఓటింగ్: కలెక్టర్

image

ఈ నెల 4, 5తేదీలలో హోమ్ ఓటింగ్ నిర్వహించనున్నామని జిల్లా ఎన్నికల అధికారి జితేశ్ వి పాటిల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 85 సంవత్సరాలు పైబడిన 181 మంది వృద్ధులు, 258 మంది వికలాంగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటివద్దనే ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం 25 ప్రత్యేక హోమ్ ఓటింగ్ బృందాలను ఏర్పాటు చేసి, 12 రూట్ల ద్వారా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు.

News May 2, 2024

నిజామాబాద్: కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య

image

కడుపు నొప్పి భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని పెద్దమ్మ తల్లి రోడ్డుకు చెందిన అరుణ్ రావు(47) కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నొప్పి ఎక్కువ కావడంతో రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

News May 2, 2024

నిజామాబాద్: RTC బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

image

RTC బస్సు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మయాపూర్‌కి చెందిన సాయిలు బుధవారం రోజు వారీ పనికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బాద్గుణ గ్రామం నుంచి నందిపేట వెళ్తున్న RTC బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో సాయిలు తల నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌ను అదుపులో తీసుకుని ఎస్ఐ కేసు నమోదు చేసని దర్యాప్తు చేస్తున్నారు.

News May 2, 2024

NZM: లోక్‌సభ బరిలో నాడు 186.. నేడు 29 మంది

image

నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 186 మంది పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం పార్లమెంటు బరిలో 29 మంది ఉన్నారు. BJP తరఫున MP అర్వింద్‌, కాంగ్రెస్‌ నుంచి జీవన్‌రెడ్డి, BRS తరపున గోవర్ధన్‌ ఉన్నారు. ప్రధానంగా 3 ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంది. మే 13న ఎన్నిక జరగగా.. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

News May 1, 2024

ఎడపల్లిలో ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం తానాకలన్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని చెరువు కట్టపై ధాన్యం బస్తాలతో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌పై ఉన్న రైతు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 1, 2024

NZB: మాజీ గవర్నర్‌ను కలిసిన కోటపాటి

image

ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు, ప్రవాస భారతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ తరఫున హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను కలిసి శాలువాతో సన్మానించారు.

News May 1, 2024

నిజామాబాద్ జిల్లాకు ప్రియాంక లేదా రాహుల్ గాంధీ రాక?

image

లోకసభ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలైన ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీలో ఎవరో ఒకరు నిజామాబాద్ జిల్లాకు రానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మే 7-8 తేదీల్లో జిల్లాలో ఎన్నికల ప్రచారం కోసం వారిలో ఒకరు వస్తారని ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం వచ్చిందంటున్నారు. ఈ మేరకు నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాకు మధ్యలో ఉండే ఆర్మూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో నేతలు ఉన్నారు.

News May 1, 2024

NZB: మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థి ఆత్మహత్యాయత్నం

image

10వ తరగతి ఫలితాల్లో తక్కువ (జీపీఏ) మార్కులు వచ్చాయని నవీపేట్ మండలం మహంతం గ్రామానికి చెందిన విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 8.3 జీపీఏ రావడంతో తక్కువగా వచ్చాయని మనస్తాపంతో పొలాల్లో కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్‌కు తరలించారు.

News May 1, 2024

కామారెడ్డి: వాహనం ఢీకొని యువకుడు మృతి

image

సదాశివనగర్ మండల కేంద్రంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్మల్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డి వైపు నుంచి నిర్మల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

‘నిజామాబాద్ జిల్లాలో ఏడాదిలోగా నవోదయ విద్యాలయం’ 

image

నిజామాబాద్ జిల్లాలో ఏడాదిలోగా నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయిస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అలాగే జక్రాన్పల్లిలో ఎయిర్ పోర్టు, జిల్లాలో డ్రై పోర్టు కూడా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.
మంగళవారం రాత్రి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ హామీలు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు.