India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ నగర శివారులోని ఓ వెంచర్ వద్ద రైలు కింద పడి ఆర్యనగర్ కు చెందిన రాజవరపు శ్రీనివాస్(50) ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి వివరాల ప్రకారం.. శ్రీనివాస్ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆయన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. మంగళవారం తీవ్ర- మనస్తాపం చెంది మాధవనగర్ సమీపంలోని ఓ వెంచర్ వద్ద ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
నిజామబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల పట్టణంలోని పశువైద్య కళాశాల సమీపంలో నేడు జరుగనున్న జన జాతర ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డికి మద్దతుగా నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారని ఎమ్మెల్సీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
మే 13 సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తాజాగా రాష్ట్రంలోని 10 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ (అసెంబ్లీ బై ఎలక్షన్) స్థానానికి అధిష్ఠానం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. జహీరాబాద్ పార్లమెంట్‌కు రాజ్ మోహన్ ఉన్నితాన్, నిజామాబాద్ పార్లమెంట్‌కు ఎన్.ఎస్ బోసురాజు, మంతర్ గౌడలకు బాధ్యతలు అప్పగించింది.
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి కలెక్టర్ క్రాంతి అధ్యక్షతన సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ సింధూ శర్మ పాల్గొన్నారు. ఎన్నికల విధుల పట్ల అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై సాయి రెడ్డి కథనం ప్రకారం.. నగరంలోని ఆర్య నగర్‌కు చెందిన రాజవరపు శ్రీనివాస్(50) మంగళవారం సాయంత్రం ఇంటర్ సిటీ ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తండ్రి మీద ఓ కొడుకు దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలం ఎన్టీఆర్ నగర్‌లో చోటుచేసుకుంది. తన తండ్రి బుచ్చన్న తరుచూ మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఈ నెల 22న కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అతడి కొడుకు మరో 8 మందితో కలిసి పథకం ప్రకారం ఇంటికి వచ్చి దాడి చేసినట్లు బాధితుడి అక్క రాజవ్వ సీపీకి ఫిర్యాదు చేసింది.
చేసిన పనికి బిల్లులు చెల్లించడం లేదని నిరసిస్తూ బీర్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి విజయ్ అనే కాంట్రాక్టర్ మంగళవారం తాళం వేశాడు. జీపీ దుకాణ సముదాయం నిర్మించి రెండేళ్లు గడిచినా రూ.20 లక్షలు మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.10 లక్షల బిల్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న డీపీవో శ్రీనివాసరావు తమకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం 19వ డివిజన్‌లో MLC, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ బొమ్మ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిను గెలిపించాలని కోరుతూ.. కూరగాయలు విక్రయించే మహిళ వద్దకు వెళ్లి.. కూరగాయలు అమ్ముతూ.. ఓటును అభ్యర్థించారు. ఆయన వెంట గడుగు గంగాధర్, తదితరులు ఉన్నారు.
కేసీఆర్ మాదిరిగానే సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గపు పాలన చేస్తున్నారని ఎంపీ అరవింద్ ధర్మపురి మండిపడ్డారు. అబద్ధపు హామీలతో రాష్ట్ర రైతులు, మహిళలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మంగళవారం డొంకేశ్వర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. వాటిని అమలు చేయడం చేతగాక దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని విమర్శించారు.
పదో తరగతి ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా 93.72 శాతంతో 14 వ స్థానంలో నిలిచింది. 21,858 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 20,486 మంది పాసయ్యారు. 92.71 శాతంతో కామారెడ్డి జిల్లా 19వ స్థానంలో నిలిచింది. 11926 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 11057 మంది విద్యార్థులు పాసయ్యారు.
Sorry, no posts matched your criteria.