India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అడవి పంది ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కుటుంబీకుల సమాచారం మేరకు మాచారెడ్డి మండలం సోమరంపేటకి చెందిన నునావత్ గంగారం మాచారెడ్డి నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ ను అడవి పంది ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
పదోతరగతి ఫలితాలు నేడు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 22,281 మంది విద్యార్థులు పదోతరగతి విద్యార్థులు ఉన్నారు. ఇందులో 11,158 మంది బాలురు, 10,735 మంది బాలికలు, ప్రైవేటుగా 380 మంది ఉన్నారు . కామారెడ్డి జిల్లాలో 11,962 మంది పదోతరగతి విద్యార్థులుండగా ఇందులో బాలురు 5834, బాలికలు 6128 మంది ఉన్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
పోతంగల్ మండల శివారులోని మంజీరా నది రెండవ బ్రిడ్జి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతి చెందినట్టు సమాచారం అందుకున్న కోటగిరి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు మహారాష్ట్ర లోని దెగ్లూర్ తాలూకా నరేంగల్ గ్రామానికి చెందిన హరి శంకర్ గా గుర్తించారు. కేసు నమోదు చేసి వారు దర్యాప్తు చేస్తున్నారు.
MPఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. నిజామాబాద్ 29 నామినేషన్లు ఆమోదించగా.. 3 మంది విత్‌డ్రా చేసుకొన్నారు. ఎక్కువ మంది బరిలో ఉండటంతో రెండు ఈవీఎంలు తప్పనిసరైంది. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక్కడ కూడా ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు చొప్పున ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు. SHARE IT
జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం విడుదలైన తుది జాబితా ప్రకారం మొత్తం 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు 53వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. 2019 నుంచి 24 మధ్య 1,45,912 మంది పెరిగినట్లు అధికారుల వెల్లడించారు. పెరిగిన ఓటర్లలో మహిళల సంఖ్యే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. మొత్తం 42 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. స్క్రూటినీ సందర్భంగా 10 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మిగతా 32 మంది అభ్యర్థుల్లో ముగ్గురు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా.. ఎన్నికల బరిలో 29 మంది అభ్యర్థులు ఉన్నట్లు వెల్లడించారు.
నిజామాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలిస్తే జగిత్యాల లవ్ జిహాద్‌కు అడ్డగా మారుతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇది వరకే జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డాగా మారిందని ఆరోపించారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెబుతూ పబ్బం గడుపుతున్నరని అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన పలువురు నేతలు.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారు ఎవరెవరో పరిశీలిస్తే.. బాజిరెడ్డి గోవర్ధన్ NZB (రూరల్) నుంచి MLAగా పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి NZB లోక్ సభ నుంచి MPగా బరిలో దిగారు. జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయి MPగా బరిలో ఉన్నారు. అర్వింద్ కోరుట్ల నుంచి ఓడిపోయి MPగా బరిలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసిన ఆయనకు ఆ పార్టీ అధినాయకత్వం MP టికెట్‌ను కట్టబెట్టింది. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అల్లాదుర్గం శివారులోని చిల్వేర్ వద్ద నిర్వహించే సభలో ఆయన పాల్గొనున్నారు. ఈ మేరకు జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ కార్యకర్తలు, శ్రేణులను తరలించనున్నారు. జహీరాబాద్ స్థానానికి 4వ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. తొలిసారి కాంగ్రెస్, తర్వాత వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించింది.
Sorry, no posts matched your criteria.