India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నగరంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో అజంతా ఎక్స్ప్రెస్ రైలు వెళ్లేక్రమంలో ఓ యువకుడు హఠాత్తుగా రైలుకు అడ్డంగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. యువకుడు వైలెట్ కలర్ షర్ట్, బ్లూ జీన్ పాయింట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా గుర్తుపట్టి ఉంటే రైల్వే పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.
కామారెడ్డి జిల్లా గాంధారిలో గల వంతెన సమీపంలో పాడుబడ్డ బాయిలో గుర్తుతెలియని మహిళ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు గాంధారి పోలీసులు తెలిపారు. మహిళ శవం కుళ్ళిన స్థితిలో ఉండి గులాబీ రంగు చీర ఉందని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాంపై వారు విచారణ చేపట్టారు.
నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీ స్థానాలకు ఎందరు అభ్యర్థులు పోటీలో ఉంటారనేది నేడు తేలనుంది. NZB ఎంపీ స్థానానికి 42 మంది నామినేషన్లు వేశారు. 10 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 32 మంది బరిలో ఉన్నారు. ZHB ఎంపీ స్థానానికి 40 మంది నానినేషన్లు వేశారు. 18 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామపత్రాల ఉపంహరణకు మధ్యాహ్నం 3 వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత ఎందరు పోటీలో ఉన్నారో అధికారులు ప్రకటిస్తారు.
కామారెడ్డి మండలంలోని కొట్టాలపల్లి గ్రామానికి చెందిన ఆకుల రమేశ్ శనివారం రాత్రి మలేషియాలో హార్ట్ స్టోక్ వచ్చి చనిపోయినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. రమేశ్ గత వారం మలేషియా వెళ్లినట్లు పేర్కొన్నారు. అక్కడి స్నేహితుల ద్వారా సమాచారం అందిందన్నారు. ప్రభుత్వం స్పందించి రమేశ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉమ్మడి NZB జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఈ వేసవిలో నేతలు మాటల తూటాలతో మరింత వేడిపుట్టిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని నిజామాబాద్ BRS అభ్యర్థి గోవర్ధన్ అన్నారు. ఆదివారం రాత్రి మోర్తాడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మోదీ నిరుపేదలకు పంచుతానన్న నల్లధనం ఎటుపోయిందని ప్రశ్నించారు. దొంగ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని, రేవంత్ రెడ్డి ఝూటాకోర్ అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఆశీర్వదించి మెజారిటీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు.
కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి, బషీరాబాద్, హాసకొత్తూరు గ్రామాల ప్రజలతో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ పాల్గొన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో BRS పార్టీకి షాక్ తగిలింది. BRS పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి ఆదివారం కాంగ్రెస్ MP అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారు ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాగా బోర్గం గ్రామానికి చెందిన గంగారెడ్డి 2002 నుంచి BRS పార్టీ (అప్పటి TRS)లో కొనసాగుతూ నేడు కాంగ్రెస్‌లో చేరారు.
రైలు కిందపడి వృద్ధురాలు <<13140109>>ఆత్మహత్యకు<<>> పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన శామర్తి బాలమణి (61) అనారోగ్య కారణాల వల్ల ఆదివారం ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై తావు నాయక్ వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో BJPని KCR కంట్రోల్ చేశారని నిజామాబాద్ MP అర్వింద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు BJP, BRS ఒక్కటే అంటూ ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. BRS హయాంలో రాష్ట్రంలో BJPని కంట్రోల్ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం BJPని ఆపలేదని.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు. త్వరలో రేవంత్ రెడ్డి కూడా BJPలో చేరుతాడని అర్వింద్ అన్నారు.
Sorry, no posts matched your criteria.