India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిజామాబాద్ గాంధీనగర్‌కు చెందిన సుధాకర్(25), బోధన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16)ను వారం కిందట తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. నవీన్ అనే యువకుడు సహకరించాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సుధాకర్‌పై పోక్సో, అతని స్నేహితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగనాథ్ తెలిపారు. గురువారం వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామ శివారులోని గంజి వాగు దగ్గర ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పోసానిపేటకు చెందిన బలగం రాజయ్యకు తీవ్ర గాయాలయ్యాయ. ఆయనను కామారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు.
జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ వెలువడిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. గత 3 రోజుల్లో రూ.7.6 లక్షలు, నేడు రూ.4.50 లక్షల నగదుతో పాటు 986 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు వెల్లడించారు. అధికారులు సమిష్టిగా కృషిచేస్తూ అక్రమ డబ్బు, మద్యం రవాణాను అరికట్టాలని ఆమె సూచించారు.
నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలులో ఎండ తీవ్రతకు స్వల్పంగా నిప్పురాజుకొని పొగలు వచ్చాయి. బొగ్గును తరలిస్తున్న వ్యాగన్‌లో పొగలు రాగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిజామాబాద్ స్టేషన్‌లో ఆపివేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గురువారం పాలకవర్గం పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశంలో భాస్కర్ రెడ్డికీ వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొనడంతో ఆయన పదవి కోల్పోయారు. 21 మంది పాలకవర్గ సభ్యులకుగాను 17 మంది హాజరయ్యారు. అందులో 16 మంది భాస్కర్ రెడ్డి పై వ్యతిరేకంగా చేతులెత్తి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు.
అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. బిక్కనూర్ మండలం అంతంపల్లి, జంగంపల్లి గ్రామాలలో ఆయన పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులు ఎలాంటి ఆందోళన పడవద్దని చెప్పారు. త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఉన్నారు.
రెండు రోజుల్లో నిజామాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, BJP నుంచి ధర్మపురి అర్వింద్‌ను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పెండింగ్‌లో ఉంచింది. ఆపార్టీ అభ్యర్థి ఎవరని శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
నిజాంసాగర్ మండలం బ్రాహ్మణ పల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రూ.లక్ష 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో HYD నుంచి జాల్నాకు వెళ్తున్న ఓ కారులో ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు SI సుధాకర్ పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. లేఖను సహకారశాఖ కమిషనర్‌కు పంపుతున్నట్లు ప్రకటించారు. కాగా తనపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇవ్వలేదు. రాజీనామా లేఖ తమకు అందలేదని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రావు వెల్లడించారు. కాగా రేపు అవిశ్వాసం పై ఓటింగ్ జరగనుంది.
లోక్‌సభ ఎన్నికల ప్రణాళిక వెలువడిన నేపథ్యంలో NZB సీపీ కల్మేశ్వర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ARMS లైసెన్స్ పొంది ఉన్న వారు ఆయుధాలను సంభందిత పోలీస్ స్టేషన్‌లలో ఈ నెల 23 లోపు జమ చేయాలన్నారు. మినాహాయింపు పొందాలనుకుంటే ARMS జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.