Nizamabad

News March 21, 2024

కామారెడ్డి జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

image

అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. బిక్కనూర్ మండలం అంతంపల్లి, జంగంపల్లి గ్రామాలలో ఆయన పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులు ఎలాంటి ఆందోళన పడవద్దని చెప్పారు. త్వరలోనే నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఉన్నారు.

News March 21, 2024

రెండు రోజుల్లో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

రెండు రోజుల్లో నిజామాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఈ స్థానానికి ప్రముఖ నాయకులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, BJP నుంచి ధర్మపురి అర్వింద్‌ను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పెండింగ్‌లో ఉంచింది. ఆపార్టీ అభ్యర్థి ఎవరని శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

News March 21, 2024

కామారెడ్డి: ఎన్నికల కోడ్.. రూ.1.20 లక్షలు పట్టివేత..

image

నిజాంసాగర్ మండలం బ్రాహ్మణ పల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు రూ.లక్ష 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో HYD నుంచి జాల్నాకు వెళ్తున్న ఓ కారులో ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నట్లు SI సుధాకర్ పేర్కొన్నారు.

News March 21, 2024

DCCB ఛైర్మన్ పదవీకి పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామా!

image

నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. లేఖను సహకారశాఖ కమిషనర్‌కు పంపుతున్నట్లు ప్రకటించారు. కాగా తనపై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే ఇవ్వలేదు. రాజీనామా లేఖ తమకు అందలేదని జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌రావు వెల్లడించారు. కాగా రేపు అవిశ్వాసం పై ఓటింగ్ జరగనుంది.

News March 21, 2024

NZB: ‘ఆ ఆయుధాలు పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి’

image

లోక్‌సభ ఎన్నికల ప్రణాళిక వెలువడిన నేపథ్యంలో NZB సీపీ కల్మేశ్వర్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ARMS లైసెన్స్ పొంది ఉన్న వారు ఆయుధాలను సంభందిత పోలీస్ స్టేషన్‌లలో ఈ నెల 23 లోపు జమ చేయాలన్నారు. మినాహాయింపు పొందాలనుకుంటే ARMS జిల్లా కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 20, 2024

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన ముగ్గురికి 2 రోజుల జైలు

image

మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ జడ్జి ఖదీర్ బుధవారం తీర్పునిచ్చారని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. పట్టణంలో మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 9 మంది పట్టుబడగా అందులో పఠాన్ షేర్ ఖాన్, సిర్నాపల్లి భూమేశ్, పెందోట రవి కుమార్‌లకు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

News March 20, 2024

కామారెడ్డి: మహిళ టీచర్‌కు షోకాజ్ నోటీస్ 

image

ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన బిచ్కుంద మండల ప్రజా పరిషత్ పాఠశాల సెకండరి గ్రేడ్ ఉపాధ్యాయురాలు కృష్ణవేణికి ఫైనల్ షోకాజ్ నోటిస్ జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 2, 2022 నుంచి ముందస్తు అనుమతులు లేకుండా విధులకు రావడం లేదని, 10 రోజుల్లోగా సమాధానం రాకపోతే సర్వీస్ నుంచి తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు.

News March 20, 2024

NZB: ‘హై కోర్టులో పోచారం భాస్కర్ రెడ్డికి చుక్కెదురు’

image

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. బుధవారం హైకోర్టులో ఆయన వేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 5న నిజామాబాద్ డీసీసీబీకి చెందిన 15 మంది డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం నోటీసును డీసీవోకు అందజేశారు. ఈ నెల 21న అవిశ్వాసంపై ఓటింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు.

News March 20, 2024

కామారెడ్డి: నూతన గవర్నర్‌ని కలిసిన షబ్బీర్ అలీ

image

తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. బుధవారం రాజ్ భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అరాధే ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

News March 20, 2024

బాల్కొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

బాల్కొండ మండల పరిధిలోగల 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి నాగపూర్‌కు వెళ్తున్న రోహిత్ కుమార్ బైక్ అదుపు తప్పడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని పోలీసులు చెప్పారు.

error: Content is protected !!