Nizamabad

News April 26, 2024

కామారెడ్డి: రోడ్ షోలు..భారీ సభలు

image

పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో రోడ్‌షోలు, బహిరంగసభలు, కార్నర్‌ సమావేశాలు నిర్వహించేందుకు BRS, కాంగ్రెస్‌, BJP అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 30న అందోల్‌లో ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభకు భాజపా ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ వచ్చే నెల 7న కామారెడ్డిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొనున్నారు.

News April 26, 2024

NZB: జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య

image

మద్యానికి బానిసై ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్పల్లి ఎస్సై విక్రమ్ తెలిపారు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన గాడిదల గంగాధర్ (25) కూలీ పని చేసేవాడు. పని చేయగా వచ్చిన డబ్బులతో ప్రతిరోజూ మద్యం సేవించేవాడు. దీంతో మద్యానికి బానిసైన గంగాధర్ జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు
ధర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 26, 2024

ఎంపీ ఎన్నికలు.. నిజామాబాద్‌కు 42 జహీరాబాద్‌కు 40

image

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. నిజామాబాద్ లోక్‌సభకు 42 మంది అభ్యర్థులు 90 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ అభ్యర్థులు ధర్మపురి అర్వింద్‌, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు ఇతర పార్టీల వారు నామినేషన్‌ వేశారు. జహీరాబాద్‌ లోక్‌సభకు 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు సమర్పించారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు చివరి తేదీ.

News April 26, 2024

జేఈఈ ఫలితాల్లో సత్తా చాటిన నిజామాబాదీలు

image

రెండు దశల్లో ఆన్ లైన్‌లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. నిజామాబాద్‌కు చెందిన ఎం. శ్రీవల్లి 99.42, కె. శ్రేయస్ కుమార్ 98.75 పర్సంటైల్ సాధించగా వారికి అభినందనలు వెల్లువెత్తాయి. మేథన 98.49, అబ్దల్ మాలిక్ 98.30 పర్సంటైల్ సాధించారు. నందిని అనే విద్యార్థిని ఆల్ ఇండియా 12 వ ర్యాంక్, రాఠోడ్ ప్రవీణ్ 1514వ ర్యాంక్ సాధించారు.

News April 26, 2024

NZB: ప్రశాంతంగా ప్రారంభమైన ఓపెన్ పరీక్షలు

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. పదో తరగతి పరీక్షకు 1017 మందికిగాను 910 మంది హాజరుకాగా, 107 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్లో 1490 మందికిగాను 1340 మంది హాజరుకాగా, 150 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షల్లో ఇంటర్ అరబిక్ పరీక్షకు గాను 23 మంది పరీక్షకు హాజరయ్యారు. పలు పరీక్షాకేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు

News April 26, 2024

బడాపహాడ్ దర్గాకు వెళ్తుండగా DCM బోల్తా.. ఇద్దరు మృతి

image

NZB జిల్లా కొత్తపేట్ శివారులో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బడాపహాడ్‌ను దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో ఉన్న DCM బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరు కమ్మర్ పల్లికి చెందినట్లు సమాచారం. గాయపడ్డవారిని వైద్యం కోసం NZB ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ వాహనంలో 36 మంది ఉన్నట్లు తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

News April 26, 2024

KMR: సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి: DSP

image

సైబర్ నేరాల పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని KMR DSP నాగేశ్వర రావు తెలిపారు. బస్వాపూర్‌లో సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని సూచించారు. గ్రామ రక్షక దళాలు అద్భుతంగా పనిచేయడం వల్ల నేరాలు నియంత్రణలో ఉన్నాయన్నారు. అందుకు సహకరిస్తున్న యువతను ఆయన అభినందించారు. బిక్కనూరు CI సంపత్ కుమార్, SI సాయికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

News April 25, 2024

ధర్పల్లిలో మహిళపై గొడ్డలితో దాడి

image

మహిళపై గొడ్డలితో ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన ధర్పల్లి మండలం గోవిందపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొడ్డెనుక గోపి అదే గ్రామానికి చెందిన సుగుణపై గురువారం గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఎస్ఐ విక్రం తెలిపారు. ఇరు కుటుంబాల మధ్య గత కొద్ది రోజులుగా భూతగాదాలు ఉన్నాయని, గతంలో కూడా గొడవ పడినట్లు పేర్కొన్నారు. బాధితురాలి కూతురు లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News April 25, 2024

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆస్తులు, అప్పులు ఇవే

image

నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జీవన్ రెడ్డి అఫిడవిట్‌లో ఆయన ఆస్తి వివరాలను తెలిపారు. కుటుంబ ఆస్తుల వివుల రూ.3.55 కోట్లు ఉన్నాయి. ఓ ఇన్నోవా క్రిస్టా కారు ఉంది. ఆయనకు 12.5 తులాల బంగారు ఆభరణాలు, ఆయన భార్యకు 50 తులాల బంగారు ఆభరణాలున్నాయి. కాగా, ఆయనకు రూ.68.38లక్షల చరాస్తులు, 35.24 ఎకరాల భూమి, జగిత్యాలలో ఇల్లు ఉంది. బ్యాంకులో రూ.58.14 లక్షల రుణాలు, 4 క్రిమినల్ కేసులున్నాయి.

News April 25, 2024

బీబీపాటిల్‌కు మద్దతుగా ప్రధాని మోదీ ప్రచారం..!

image

నామినేషన్ల పర్వం పూర్తవుతున్న నేపథ్యంలో అగ్రనేతల ప్రచారానికి బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30న రాష్ట్రానికి రానున్నారు. జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి బీబీపాటిల్‌కు మద్దతుగా ఆందోలు అసెంబ్లీ సెగ్మెంట్‌లోని సుల్తాన్ పూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.