Nizamabad

News April 25, 2024

ఎల్లారెడ్డి: ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన ఆదర్శ, గురుకుల విద్యార్థులు

image

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో, ఎల్లారెడ్డి ఆదర్శ జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్స్ పి. సాయిబాబా తెలిపారు. ఆదర్శ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థినీలు ఎస్. హర్షిత 945 (ఎంపీసీ), హాబీ మదిహ 922 (బైపీసీ), అశ్మిత 816 (సీఈసీ)లో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.

News April 25, 2024

పెద్దకొడప్గల్: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన అన్నా చెల్లెలు

image

పెద్దకొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామానికి చెందిన అన్న చెల్లెలు జ్ఞానేశ్వర్, హారిక నేడు వెలువడిన ఇంటర్ ఫలితాలలో సత్తా చాటారు. జ్ఞానేశ్వర్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో 952/1000, హారిక ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 465/470 మార్కులు సాధించారు. అన్నా చెల్లెలు ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించడంతో గ్రామస్థులు వారిని అభినందించారు.

News April 25, 2024

NZB: ఎన్నికల కోడ్.. భారీగా నగదు పట్టివేత!

image

ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో అక్రమ నగదు సరఫరాను అధికారులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో అధిక మొత్తంలో తరలిస్తున్న డబ్బును, మద్యం, ఇతర విలువైన వస్తువులను పట్టుకుంటున్నారు. తాజాగా జిల్లాలోని నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 53,42,830 నగదును పోలీసులు పట్టుకున్నారు.

News April 25, 2024

NZB: మహిళ మెడలోంచి చైన్ లాక్కెల్లిన దొంగలు

image

ఓ మహిళ మెడలోంచి చైన్ దొంగలించిన ఘటన నిజామాబాద్‌లోని వినాయక్ నగర్‌లో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన నాగమణి బుధవారం సాయంత్రం స్థానిక హనుమాన్ మందిరం వద్దకు వెళ్లింది. అక్కడికి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాకెళ్లారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

నేడు నిజామాబాద్‌కు ఉత్తరాఖండ్ సీఎం రాక

image

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి గురువారం జిల్లాకు రాన్నున్నారు. ఆయనతో కలిసి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బహిరంగ సభ కోసం పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News April 25, 2024

పిట్లంలో బైక్‌ను ఢీకొన్న డీసీఎం.. వ్యక్తి మృతి

image

పిట్లం మండలం గద్ద గుండు తండా సమీపంలో జాతీయ రహదారి (161)పై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై రాంగ్ రూట్‌లో వెళ్తున్న వ్యక్తిని డీసీఎం ఢీకొంది. దీంతో బైక్ మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News April 25, 2024

NZB: BJPలో చేరిన కోటపాటి నరసింహం

image

పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు, BRS పార్టీ రాష్ట్ర నాయకుడు కోటపాటి నరసింహం నాయుడు ఈరోజు BJP లో చేరారు. NZB MP ధర్మపురి అర్వింద్ ఆహ్వానం మేరకు BRS పార్టీకి రాజీనామా చేసి BJPలో చేరినట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేయడానికి సముఖత చూపడమే కాకుండా కేంద్ర మంత్రివర్గంతో చర్చించి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో BJPలో చేరినట్లు తెలిపారు.

News April 25, 2024

నామినేషన్ దాఖలు చేసిన సురేశ్ షేట్కార్

image

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేశ్ షేట్కార్ 4వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి క్రాంతి వల్లూరుకి అందజేశారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

News April 25, 2024

నామినేషన్ వేసిన NZB కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

image

నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయనతో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వాటర్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ ఉన్నారు.

News April 25, 2024

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన భీంగల్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు

image

భీంగల్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారని ప్రిన్సిపాల్ డాక్టర్ చిరంజీవి తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థిని తుమ్మ సుప్రీక 955, కావ్య 938 మార్కులు సాధించారని చెప్పారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో బైపీసీ విభాగంలో శ్రీపాద వైష్ణవి 935, సారా మహీన్ 926, జుహానాజ్ 911 మార్కులు సాధించారని చెప్పారు.