India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జహీరాబాద్ BJP అభ్యర్థి బీబీపాటిల్ తన కుటుంబ ఆస్తులు రూ.151.69 కోట్లుగా ఎన్నికల నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. వివిధసంస్థల్లో రూ.1.88 కోట్ల విలువైన షేర్లు, పాటిల్ దంపతులిద్దరూ రూ.4.51 కోట్ల అప్పులు, అడ్వాన్సులు ఇచ్చారు. 18 వాహనాలు, 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 129.4 తులాల బంగారం, 1.93కిలోల వెండి ఉంది. 61.10 ఎకరాల వ్యవసాయ, 65.8 ఎకరాల వ్యవసాయేతర భూమి, 2 వాణిజ్య భవనాలు, 3.52కోట్ల అప్పులున్నాయి.
బీర్కూర్ మండల కేంద్రానికి అరిగె చిన్నరాములు(64) అనే వ్యక్తి తన పొలంలోని వరికొయ్యలకు సోమవారం నిప్పుపెట్టాడు. దీంతో భారీగా పొగ అతన్ని తాకడంతో సృహతప్పి పొలంలోనే పడిపోయాడు. మంటలు చెలరేగి అతన్ని చుట్టు ముట్టడంతో చిన్నరాములు సజీవ దహనమయ్యాడు. ఉదయం పొలానికి వెళ్లిన రాములు ఇంకా రాలేదని అతని కుమారుడు పొలం వెళ్లి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఎడపల్లి సాటాపూర్ గేటు సమీపంలోని ఆడి చెరువులో సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ వంశీకృష్ణ తెలిపారు. మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు వెల్లడించారు. మృతుడి వయసు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. తెల్లటి చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించినట్లు పేర్కొన్నారు. అతడిని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి వద్ద పోలీస్ ఔట్ పోస్టు సమీపంలో సోమవారం సాయంత్రం కత్తిపోట్లు జరిగాయి. ఈ ఘటనలో అక్రం ఖాన్ అనే యువకుడు ఫిరోజ్ ఖాన్ అనే యువకుడిపై కత్తితో దాడికి దిగాడు. దీనితో ఫిరోజ్ ఖాన్ గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయ్యింది. గంజాయి మత్తులో పాత కక్షల కారణంగా ఈ ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
టెట్‌కు దరఖాస్తులు తగ్గాయి. ఈసారి ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు అనాసక్తి చూపుతున్నారు. గతేడాది నిర్వహించిన పరీక్షలో చాలా తక్కువ మంది ఉత్తీర్ణత సాధించడంతో టెట్ అప్లయ్ చేసుకునేందుకు విముఖత చూపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పేపర్-1 4327, పేపర్-2 9045 మంది అప్లయ్ చేసుకున్నారు. కామారెడ్డిలో పేపర్-1కు 3773, పేపర్-2కు 4440 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఆలయాలను ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే అర్చనలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో సోమవారం 12 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు మళ్లీ ఒకటి, రెండు సెట్‌ల చొప్పున నామినేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. కాగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 28 నామినేషన్లు దాఖలు అయినట్లు వెల్లడించారు.
ఈ నెల 23న నిర్వహించే హన్‌మాన్ శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు 1200 పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా దారి పొడువున CC కెమెరాలు, డ్రోన్‌లతో పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ నుంచి వాహనాల దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.
ప్రముఖ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రంలో నిజామాబాద్ బీఅర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం ముడుపు కట్టారు. తొలుత ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం ముడుపుకట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, మాజీ మంత్రి రాజేశం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో మద్యం, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్స్ మూసి ఉంచాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న హనుమాన్ జయంతి ఉన్నందున మద్యం, కల్లు దుకాణాలు, బార్లు, క్లబ్స్ సోమవారం సాయంత్రం 6 గం.ల నుంచి బుధవారం (24) ఉ. 6 గం.ల వరకు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.