Nizamabad

News April 24, 2024

‘నాన్న తరఫున నేనొచ్చా ..BJP కే మీ ఓటు’

image

జహీరాబాద్ BJP ఎంపీ అభ్యర్థి బిబి పాటిల్ తనయుడు అభిషేక్ పాటిల్ ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గల్లీ గల్లీకి వెళుతూ..BJP కే ఓటేయాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. సోమవారం నారాయణఖేడ్ మండలం సిర్గాపూర్ లో ఇంటింటికీ వెళ్లారు. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. తన తండ్రి బిబి పాటిల్ ను ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

News April 22, 2024

నిజామాబాద్: భారీగా నామినేషన్లు..!

image

నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. నోటిఫికేషన్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు కాగా మిగిలిన 10 మంది స్వతంత్రులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ తో పాటు మిగిలిన జాతీయ పార్టీల నుంచి ఇంకా నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

News April 22, 2024

నేడు ఎంపీలుగా ఇద్దరి నామినేషన్..హాజరుకానున్న రేవంత్ రెడ్డి, ఫడణవీస్

image

NZB కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. అనంతరం నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారు. జహీరాబాద్ BJP ఎంపీ అభ్యర్థిగా బీబీపాటిల్ నేడు సంగారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్ హాజరుకానున్నారు. అంతకుముందు సంగారెడ్డిలోని గడ్డ గణేశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

News April 22, 2024

కామారెడ్డి: జాతీయ రహదారిపై లారీ బోల్తా

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలోని సిద్ది రామేశ్వర్ నగర్ గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు లప్పం లోడుతో వెళుతున్న లారీ.. ప్రమాదవశాత్తు డివైడర్ పైకి ఎక్కి బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ జాతీయ రహదారిపై బోల్తా పడడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

News April 22, 2024

బాన్సువాడ: 25న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక

image

బాన్సువాడ పట్టణానికి ఈనెల 25న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తున్నట్లు అధ్యక్షురాలు అరుణతార తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు. వీక్లీ మార్కెట్లో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిబి పాటిల్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నుంచి ఉన్నట్లు చెప్పారు.

News April 22, 2024

జీవన్ రెడ్డి నామినేషన్.. నిజామాబాద్ రానున్న CM

image

NZB పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CM రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం పాత కలెక్టరేట్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. CM అయిన తర్వత మొదటి సారి జిల్లాకు వస్తున్న రేవంత్‌కి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు సిద్ధమయ్యారు.

News April 21, 2024

పిట్లంలో యాక్సిడెంట్.. వ్యక్తి పరిస్థితి విషమం

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన పిట్లం మండలం చిల్లర్గిలో జరిగింది. గ్రామానికి చెందిన రాకేశ్ బైక్ పై పిట్లం నుంచి వస్తుండగా గ్రామ గేట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. దీంతో రాకేశ్ తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం NZB తీసుకెళ్లారు.

News April 21, 2024

సిరికొండలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం దుప్య తండాలో జరిగింది. గ్రామానికి చెందిన మాలవత్ నవీన్ (28) జగదాంబ దేవి ఆలయం వద్ద కూలిన ప్రహారి గోడను తొలగించే క్రమంలో విద్యుత్ షాక్‌కి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

News April 21, 2024

NZB: సీఎం సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాయకులు

image

సీఎం రేవంత్ రెడ్డి రేపు నిజామాబాద్‌కు రానున్న సందర్భంగా కలెక్టర్ గ్రౌండ్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నగర అధ్యక్షుడు కేశ వేణు తదితరులు పరిశీలించారు.

News April 21, 2024

NZB: ఎన్నికల తనిఖీల్లో నగదు, మద్యం స్వాధీనం

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.18.67 లక్షల నగదు, రూ. 25,510 విలువ చేసే 49.95 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సీపీ కల్మేశ్వర్ తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నవీపేట్, మోర్తాడ్‌లో నిర్వహించిన తనిఖీల్లో మూడు కేసుల్లో నగదు, నవీపేట్, మాక్లూర్‌లో 2 కేసుల్లో మద్యం పట్టుకున్నట్లు సీపీ వివరించారు.