Nizamabad

News April 21, 2024

NZB: తాళం వేసిన ఇంట్లో బంగారం, నగదు అపహరణ

image

నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లగుట్ట తండా శివారులోని ఒక ఇంట్లో గుర్తు తెలియని దొంగలు 4 తులాల బంగారం, 45 తులాల వెండి, రూ.50 వేల నగదు అపహరించారు. గొల్లగుట్ట తండా శివారులో నివాసం ఉండే శ్రీరాం వేరే గ్రామంలో పెళ్లికి వెళ్లారు. తిరిగి రాత్రి ఇంటికి వచ్చే చూసి చోరి జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ట్రైనీ IPS చైతన్య పరిశీలించారు.

News April 21, 2024

కామారెడ్డి జిల్లా నుంచి ఇద్దరు ఎంపీలు

image

కామారెడ్డి జిల్లా నుంచి ఇప్పటి వరకు ఇద్దరు మాత్రమే ఎంపీలుగా గెలుపొందారు. ఎల్లారెడ్డి నుంచి టీ. బాలాగౌడ్, జుక్కల్ నియోజకవర్గం నుంచి బీబీపాటిల్‌లు ఎంపీలుగా గెలుపొందారు. వీరిద్దరూ రెండు సార్లు గెలుపొందడం విశేషం. ఎల్లారెడ్డికి చెందిన బాలాగౌడ్ 1984, 1989లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. మద్నూర్ మండలానికి చెందిన బీబీపాటిల్ 2014, 2019లో BRS తరఫున గెలుపొందారు. ఈ సారి BJP తరఫున పోటీచేస్తున్నారు.

News April 21, 2024

జుక్కల్: బస్టాండ్ ప్రాంగణంలో వ్యక్తి మృతి

image

కామారెడ్డి జిల్లా జుక్కల్ బస్టాండ్ ఆవరణలో ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందారు. జుక్కల్‌కు చెందిన సదరు వ్యక్తి కొన్నేళ్ల నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. హోటళ్లలో పనులు చేస్తూ కాలం గడుపుతున్న అతడు అనారోగ్యానికి గురి కావడంతో బస్టాండ్ ఆవరణలోని మృతి చెందాడు. విషయం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

News April 21, 2024

బోధన్: బాలికపై అత్యాచారం

image

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని  ఓ గ్రామానికి చెందిన వ్యక్తి.. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వేరే మండలానికి చెందిన బాలిక (17) బంధువుల ఇంటికి ఇటీవల వచ్చింది. మాయమాటలు చెప్పి సదరు వ్యక్తి బాలకను లొంగదీసుకున్నాడు. బాలిక తరఫు బంధువులకు ఆలస్యంగా విషయం తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తగిన ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని గ్రామీణ   ఎస్సై నాగనాథ్ తెలిపారు.

News April 21, 2024

ఉమ్మడి NZB జిల్లాలో KCR రోడ్ షో.. షెడ్యూల్ ఇదే..!

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ CM కేసీఆర్ బుధవారం (24) నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, బస్సు యాత్రలతో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు BRS పార్టీ రోడ్‌షోలకు సంబంధించిన ప్రాథమిక రూట్ మ్యాప్‌ను విడుదల చేసింది. మే 6న సా. 6 గంటలకు నిజామాబాద్‌లో రోడ్ షో, అనంతరం ఇక్కడే బసచేసి, మరసటి రోజు కామారెడ్డిలో సా.5:30 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు.

News April 21, 2024

NZB: వడ గండ్ల వాన.. వందల ఎకరాల్లో పంట నష్టం

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. అకాల వర్షం కారణంగా వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. వారం రోజులుగా అకాల వర్షం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడో చోట కురుస్తూనే ఉంది. ధర్పల్లి, మాక్లూరు, నందిపేట, డొంకేశ్వర్, మోపాల్, ఆలూరు, రెంజల్, ఆర్మూర్, ఇందల్వాయి, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో పంట నష్టం జరిగింది. వడగండ్ల వర్షంతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది.

News April 21, 2024

ఈ నెల 22న నిజామాబాద్‌కు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 22న నిజామాబాద్ జిల్లాకి రానున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు పాత కలెక్టరేట్ మైదానంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి జిల్లాకు వస్తుండడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

News April 20, 2024

బిక్కనూర్‌: బస్ షెల్టర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

మండలంలోని జంగంపల్లి బస్ షెల్టర్‌లో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. గమనించిన పంచాయతీ సెక్రటరీ గుడిసె బాబు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2024

ఆర్మూర్: సైబర్ మోసగాళ్ల వేధింపులకు ఓ యువకుడి బలి

image

సైబర్ మోసగాళ్ల వేధింపులను తట్టుకోలేక ఆర్మూర్ మండలానికి చెందిన నాగరాజ్(18) అనే డిగ్రీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నాగరాజ్ ఓ ఆన్‌లైన్ గేమింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. సైబర్ మోసగాళ్లు అతడికి ఫోన్ చేసి తాము సీబీఐ అధికారులమని నిషేధిత యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటావని బెదిరించారు. రూ.5 లక్షలు ఇవ్వాలని లేకపోతే అరెస్టు చేస్తామన్నారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News April 20, 2024

నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా?

image

నిజామాబాద్‌ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు రూ.4.61 కోట్ల ఆస్తులున్నాయి. కుటుంబం పేరిట 100 తులాల బంగారు ఆభరణాలున్నాయి. మొత్తం 42.11 ఎకరాల వ్యవసాయ భూములు, 1000 గజాల నివాస స్థలాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.1.41 కోట్లు. స్థిరాస్తుల విలువ రూ.3.20 కోట్లు. కుటుంబానికి అప్పులేమీ లేవు.