India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NZB బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌కు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయనపై 22 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అర్వింద్ ఒక్కరే సొంతంగా రూ.45.25 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారు. ఆయన సతీమణి వద్ద 85 తులాల బంగారు ఆభరణాలున్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.60.08 కోట్లు. ఎలాంటి భూముల్లేవు. జూబ్లీహిల్స్‌లోని వాణిజ్య, నివాస భవనాల విలువ రూ.49.81 కోట్లు. మొత్తం అప్పులు రూ.30.66 కోట్లుగా ఉన్నాయి.
నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. నడుస్తున్న రైలును ఎక్కబోయి ఓ మహిళా ప్రయాణికురాలు మృతి చెందింది. రైల్వే ఎస్సై సాయా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన పసుల రేవతి శుక్రవారం నిజామాబాద్ నగరానికి వచ్చింది. తిరిగి శనివారం ఉదయం 6 గంటల డెమో రైలులో కామారెడ్డికి వెళ్లేందుకు టికెట్ తీసుకుంది. రైలు మెళ్లగా నడుస్తున్న క్రమంలో రైలు ఎక్కబోగా కిందపడి మృతి చెందింది.
బోధన్ మాజీ MLA షకీల్ కొడుకు రాహిల్ యాక్సిడెంట్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45లో జరిగిన యాక్సిడెంట్ నివేదికపై ఉన్నతాధికారులు స్పందించారు. రూ.లక్షలు వసూలు చేసి షకీల్ కొడుకు బదులుగా మరొకరు డ్రైవింగ్ చేస్తున్నట్లు FIR నమోదు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో పాత బంజారాహిల్స్ ACP సుదర్శన్, CI రాజ్ శేఖర్ రెడ్డి, SI చంద్ర శేఖర్‌ను సస్పెండ్ చేస్తూ DGP ఉత్తర్వులు జారీ చేశారు.
నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వ్యభిచార గృహంపై దాడి జరిపారు. నగర శివారులోని పాంగ్రాలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్సై సంజీవ్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం తనిఖీలు జరిపారు. ఓ విటుడితో పాటు విటురాలిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకురాలు పర్వీన్ బేగంపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్‌పహాడ్‌లో విషాదం చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన పోలేపల్లి ఇంద్రజ (40) ఉపాధిహామీ పనికి వెళ్లి అక్కడే చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త పోలేపల్లి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందులు, ఆడపిల్లల వివాహం ఎలా చేస్తామో అని బాధపడేదని ఫిర్యాదులో భర్త పేర్కొన్నాడు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో ధర్మోర గ్రామంలో నిన్న సాయంత్రం పిడుగు పడింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన శివ, బన్నీ, నారాయణ, శంకర్ వడ్లు ఆరబెడుతుండగా వారిపై పిడుగు పడింది. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శివ, బన్నీ హనుమాన్ మాల ధరించారు. వారిద్దరికి బలమైన దెబ్బలు తగిలినట్లు స్థానికులు తెలిపారు.
హోం ఓటింగ్ నిర్వహణపై పోలింగ్ అధికారులకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో హోమ్ ఓటింగ్ పోలింగ్ బృందాలకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోస్టల్‌బ్యాలెట్ సౌకర్యాన్ని 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు వినియోగించుకోవాలని కోరారు.
మామిడి, చెరుకు, వరి పంటలు సాగుచేసే రైతుల అభివృద్ధికి పాటుపడతానని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎంపీ అర్వింద్ ధర్మపురి హామీ ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల మార్కెటింగ్ సదుపాయాలు, మద్దతు ధర కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు.
అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్న యాత్రికులు తమకు కావాల్సిన మెడికల్ సర్టిఫికెట్ కొరకు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్(GGH)లో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపునకు హాజరుకావాలని GGH సూపరింటెండెంట్ డా.ప్రతిమా రాజ్ తెలిపారు. యాత్రికులు ట్రావెల్ ఏజెన్సీస్, ఇతర ఏజెన్సీస్ వాళ్ల మాటలు నమ్మొద్దన్నారు. సర్టిఫికెట్ కోసం హాస్పిటల్ రూమ్ నెంబర్ 44లో, ఫోన్ నెంబర్: 8247853678 ను సంప్రదించాలని ఆమె సూచించారు.
డిచ్పల్లి సీఐ, జక్రాన్ పల్లి ఎస్ఐకి మానవ హక్కుల ట్రిబ్యునల్ నోటిసులు జారీ చేసింది. జక్రాన్ పల్లికి చెందిన జగడం మోహన్, భూషణ్, భాస్కర్ తమ సొంత భూమి విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ వేధింపులపై జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే గ్రామాభివృద్ధి కమిటీ తరఫున డిచ్పల్లి సీఐ, జక్రాన్ పల్లి ఎస్సైలు బాధితులను వేధింపులకు గురి చేశారు. దీంతో బాధితులు మానవ హక్కుల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.
Sorry, no posts matched your criteria.