Nizamabad

News April 12, 2024

NZB: పోలీసుల తనిఖీల్లో రూ. 7,21,587 నగదు పట్టివేత

image

నిజామాబాద్ నగరంలో పోలీసులు శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో పెద్దమొత్తంలో నగదు సీజ్ చేశారు. నగర సీఐ నరహరి ఆధ్వర్యంలో ఎల్లమ్మగుట్ట సమీపంలో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి సరైన పత్రాలు చూపకుండా తరలిస్తున్న రూ. 7,21,587 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్నికల గ్రీవెన్స్ కమిటీకి నగదును అందజేశారు. ఈ తనిఖీల్లో నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్, ఏఎస్సై రామకృష్ణ, సిబ్బంది రమేష్, అనిల్, మనోజ్ పాల్గొన్నారు.

News April 12, 2024

కామారెడ్డి: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో మంటలు

image

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని మాయాబజార్‌ ప్రాంతంలో ఎలక్ట్రిక్‌ స్కూటీపై ఓ వ్యక్తి వెళ్తుండగా అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన స్కూటీని నిలిపివేశారు. అనంతరం ఒక్కసారిగా స్కూటీలో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

News April 12, 2024

NZB: మరో 4 రోజులే గడువు

image

ఈ నెల 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఓటరుగా పేరు నమోదు చేసుకోలేదు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 6 రోజుల సమయం ఉంది. ఫారం-6 నింపి, ధ్రువీకరణ పత్రాల నకలు, పాస్ ఫొటోలు జతపర్చి స్థానిక BLOకు అందజేయండి. లేదంటే స్థానిక మీసేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు మార్పులు చేసుకోవచ్చు.

News April 12, 2024

BSWD: ‘ఇవి చేసినప్పుడే మా గ్రామానికి ఓట్లకు రావాలని ఫ్లెక్సీ’

image

బాన్సువాడ నియోజకవర్గంలో నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. ‘దేశ భద్రత కోసం సీఏఏ, ఎన్ఆర్సీ అమలు చేయాలి. హిందూ ఆలయాల రక్షణ కోసం హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి. బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం కావాలి. అన్నదాతల ఆత్మహత్యలు లేని వ్యవసాయ విధానాలు రావాలి. గోవధ నిషేధ చట్టం అమలు జరపాలి’ అని అప్పుడే మా గ్రామానికి ఓట్లకు రావాలని ఫ్లెక్సీ పెట్టారు.

News April 12, 2024

మంజీరా తీరంలో నెగ్గేదెవరో..?

image

2008లో ఏర్పడిన మంజీరా తీరంలో జహీరాబాద్‌ లోక్‌సభకు ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గం KA, MH ఆనుకొని ఉండటంతో కన్నడ శైలి.. మరాఠీల ప్రత్యేకత చాటుతుంది. ఇక్కడ లింగాయత్‌, మరాఠా సామాజిక వర్గాలదే ఆధిపత్యం. 2009 ఎన్నికల్లో సురేశ్ షెట్కార్, 2014, 19లో బీబీ పాటిల్ గెలవగా.. ఇద్దరిది లింగాయత్ సామాజిక వర్గమే. ఈసారి వీరితోపాటు BRS అభ్యర్థిగా గాలి అనిల్ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోటీల్లో నెగ్గేదెవరో వేచి చూడాల్సిందే.

News April 12, 2024

కామారెడ్డి: 53 గ్రామాల్లో తాగునీటి సమస్య

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 53 గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడనున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో నిజామాబాద్ లో 37, కామారెడ్డిలో 16 ఉన్నాయి. ఇక్కడ చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మిషన్ భగీరథ పథకం అమల్లోకి వచ్చాక బోరుబావులు, చేతి పంపులను పట్టించుకోలేదు. ఇప్పుడు వాటి అవసరాన్ని గుర్తించి పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు.

News April 12, 2024

నిజామాబాద్‌లో త్రిముఖ పోరు..!

image

నిజామాబాద్‌‌ లోక్‌సభ స్థానంలో ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారవడంతో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. మరో 6 రోజుల్లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో అభ్యర్థులు జనం మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల జిల్లాలో మూడు పార్టీల అభ్యర్థులు అర్వింద్, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు.

News April 12, 2024

కామారెడ్డి: ‘సార్ నేను పెళ్లి చేసుకోను’

image

కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన ఓ బాలిక స్థానిక వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుకుంటోంది. 2 నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన ఓ అబ్బాయి (30)తో ఆ బాలికకు కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించారు. దీంతో బాలిక పెళ్లి వద్దని తాను చదువుకుంటానని ఎంత చెప్పినా తల్లి వినలేదు. దీంతో బాలిక గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించి కన్నీరు పెట్టుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి వివరాలు సేకరించారు.

News April 12, 2024

బీర్కూర్ : సీడ్ సక్రమంగా లేకనే పంట రాలేదు :అవినాష్ రెడ్డి

image

బీర్కూర్ మండల కేంద్రంలో పంట నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించామని  సీడ్ సక్రమంగా లేకనే రైతులకు పంట నష్టం జరిగిందని కిసాన్ కేత్ రాష్ర్ట అధ్యక్షుడు అవినాష్ రెడ్డి ఆరోపించారు. గురువారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్లో ఆయన మాట్లాడారు. బీర్కూర్‌లోని గ్రోమోర్‌కు చెందిన ఓ షాప్లో ఆర్కె సోనా విత్తనం రైతులకు అమ్మారని,  ఈ సీడ్ సక్రమంగా లేక పంట రాలేదన్నారు.

News April 12, 2024

బీజేపీ జెండా ఎగురవేయాలి: KVR

image

ఆందోల్ నియోజకవర్గం టెక్మాల్‌లో జహీరాబాద్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ప్రభారీ అభయ్ పాటిల్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమెందర్ రెడ్డి హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయాలని వారు సూచించారు.