India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేసవి ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నగర, పురపాలికలకు వివిధ పనులకు సంబంధించి రూ.2.72 ఓట్ల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తాగునీటి సరఫరాకు, పైప్ లైన్‌లో మరమ్మత్తులకు ఈ నిధులు వినియోగించుకోవాలి. నిజామాబాద్ రూ.96.30 లక్షలు, బాన్సువాడ 38.12, ఎల్లారెడ్డి 35.36, బోధన్ 52.44, కామారెడ్డి 28.31, ఆర్మూర్18.24, బాన్సువాడ 4.19 వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అభినందించారు. ఈ మేరకు ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందచేశారు. 19 సంవత్సరాల తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంగా తయారైందన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎన్నికల సన్నహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాటి చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన మక్కల శేఖర్(33) శనివారం గ్రామంలోని తాటి ముంజల కోసం చెట్టు ఎక్కి ప్రమాదవ శాత్తు కిందపడ్డాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి భార్య రాజ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వంశీకృష్ణ పేర్కొన్నారు.
ఇద్దరు బైక్ దొంగలను పట్టుకున్నట్లు బీర్కూర్ SI రాజశేఖర్ తెలిపారు. మండలంలోని ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా తమను చూసి భయపడి పారిపోతున్న ఇద్దరిని వెంబడించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారిని బోధన్‌కి చెందిన అబ్దుల్ ఐయాజ్ ఖాన్(36), సమీర్ ఉద్దీన్(18)లుగా గుర్తించారు. అనంతరం విచారణ చేయగా వారు బైక్ దొంగలని తేలింది. దీంతో వారి వద్ద ఉన్న 26 బైక్‌లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
కామారెడ్డి మెడికల్ కాలేజీలో 4 ప్రొఫెసర్, 13 అసిస్టెంట్ ప్రొఫెసర్, 5 సీనియర్ రెసిడెంట్ హానర్ ఓరియన్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు ఏప్రిల్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకి పక్షుల రాక మొదలైంది. ప్రతి ఏడాది వేసవిలో విదేశాల నుంచి అరుదైన పక్షులు నీటి కోసం బ్యాక్ వాటర్ ప్రాంతానికి వస్తుంటాయి. దాదాపు మూడు నెలల పాటు అవి ఇక్కడ ఉంటాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తుంటారు. ముఖ్యంగా ఛాయ చిత్రకారులు వాటిని కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపుతారు.
పదో తరగతి పరీక్షలు శనివారంతో ముగిశాయి. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఇన్నాళ్లు పుస్తకాలు పట్టుకొని చదివిన విద్యార్థులు హమ్మయ్యా.. పరీక్షలు ముగిశాయని సంబర పడ్డారు. కొంత మంది కేరింతలు కొడుతూ.. పేపర్లు చింపి గాల్లో ఎగరవేస్తూ సందడి చేశారు. పరీక్షలు ముగియడంతో మిత్రులకు వీడ్కోలు పలుకుతూ..వెళ్లారు.
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళలు, నిరుద్యోగ యువతులకు వివిధ రకాల ఉచిత శిక్షణల కోసం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సంస్థ డైరక్టర్ సుంకం శ్రీనివాస్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డు, 19 నుంచి 45 ఏళ్ల వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. శిక్షణ సమయంలో నెలపాటు వసతి, భోజనం, టూల్‌కిట్స్ ఉచితంగా అందిస్తామన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. మార్చి మెుదటి వారం నుంచి భానుడి భగభగలు మెుదలయ్యాయి. మార్చి ముగియకముందే కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరువైంది. దీంతో కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలకు గిరాకీ పెరిగింది. బిచ్కుంద మండలంలో 41.9, దోమకొండ 40.5, రామారెడ్డి 40.4, పుల్కల్‌లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.