Nizamabad

News March 24, 2024

కామారెడ్డి: బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు

image

జహీరాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సెన్సార్ బోర్డు సభ్యుడు కామారెడ్డి జిల్లాకు చెందిన అతిమాముల రామకృష్ణా గుప్త.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీలో చేరారు. కేంద్రంలో మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడినై బీజేపీలో చేరినట్లు తెలిపారు.

News March 24, 2024

NZB: ‘హజ్ యాత్రికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’

image

హజ్ యాత్రికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, మక్కాకు వెళ్ళిన వారికి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లో జిల్లా హజ్ సొసైటీ మౌలానా సయ్యద్ అబీద్ ఖాస్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండవ హజ్ ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా ముహమ్మద్ షబ్బీర్ అలీ హాజరయ్యారు.

News March 24, 2024

నిజామాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం

image

నిజామాబాద్ నగరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ మేరకు ఆదివారం ఇంద్రపూర్ సమీపంలోని ప్రైవేటు ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మరమ్మతు కేంద్రానికి చుట్టు పక్కల ఇళ్లు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

News March 24, 2024

నిజామాబాద్: ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

జగిత్యాల మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓ యువకుడు ఈతకు వెళ్లి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ధర్మోరకు చెందిన శివకుమార్ (19) తన మిత్రుడి బర్త్ డేకు చిట్టాపూర్ వెళ్లాడు. తన మిత్రులతో కలిసి శనివారం గ్రామశివారు చెరువు వద్ద గల బావిలోకి ఈతకు వెళ్లాడు. శివకుమార్‌కు ఈత రాకపోవడంతో బావిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News March 24, 2024

NZB: పట్టపగలే పోలీస్ ఇంట్లో చోరీ

image

నిజామాబాద్‌లో దొంగలు ఏకంగా ఓ పోలీసు ఇంటికే కన్నం వేశారు. ఎనిమిది తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. కమిషనరేట్‌లోని ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న సాయన్న గూపన్ పల్లిలో నివాసం ఉంటున్నారు. ఆయన ఉదయం విధులకు వెళ్లగా.. కుటుంబీకులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడి ఎనిమిది తులాల బంగారు గొలుసు లను అపహరించుకు వెళ్లారు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 24, 2024

నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు మృతి

image

జిల్లా వ్యాప్తంగా నిన్న వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. డొంకేశ్వర్‌కు చెందిన పెద్ద గంగారం (44) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. నందిపేటలోని తల్వేద వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి బండారి రవి(20) అనే వ్యక్తి నీట మునిగి మృత్యవాతపడ్డాడు. నవీపేటకి చెందిన మోసిన్ (13) అలీసాగర్ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. గాలింపు చర్యలు చేపట్టగా మోసిన్ మృతదేహం లభ్యమైంది.

News March 24, 2024

కామారెడ్డి: ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు

image

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుమారు వందమంది బీజేపీ మండలాధ్యక్షుడు తుకారం ఆధ్వర్యంలో బీజేపీ చేరారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మాధవరావు, పండిత్ రావ్ పటేల్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

News March 23, 2024

NZB: BREAKING.. నీట మునిగి ఆరో తరగతి విద్యార్థి మృతి

image

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది. పట్టణంలోని అలీసాగర్‌లో శనివారం ఈతకు వెళ్లిన ఆరో తరగతి విద్యార్థి మోసిన్(13) ప్రమాదవ శాత్తు నీట మునిగి మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 23, 2024

NZB: ప్రేమ పెళ్లి.. ఒకరోజు ముందు లవర్‌ దుర్మరణం

image

పెళ్లికి ఒకరోజు ముందు ప్రియుడు మృతి చెందాడు. HYDలో ఉంటున్న శంకర్‌, నిజామాబాద్‌కు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఈనెల 20న పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. ఊరెళ్లేందుకు 19న సిటీలో అమ్మాయిని బస్సెక్కించి.. తాను బైక్‌పై బయల్దేరాడు. కందుకూరులో కారు ఢీకొని శంకర్ గాయపడగా.. అదే రూట్‌లో వస్తున్న ప్రియురాలు గమనించి బస్‌ దిగేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శంకర్ చనిపోవడం బాధాకరం.

News March 23, 2024

సెన్సార్ బోర్డ్ మెంబర్ రామకృష్ణ గుప్తా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా

image

తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, సెన్సార్ బోర్డ్ మెంబర్ కామారెడ్డికి చెందిన రామకృష్ణ గుప్తా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన‌ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా గులాబీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించానని తెలిపారు. నాయకుల అంతర్గత రాజకీయాల వల్ల ఇబ్బందులకు గురై బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తునట్లు వెల్లడించారు.