India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అభివృద్ధి, సంక్షేమం, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన TPCC విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచనలు, సలహాలను పాటిస్తూ పార్టీ కోసం శ్రమిద్దామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటపై ప్రజలకు నమ్మకముందన్నారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DIEO తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. మార్చ్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణ కోసం శుక్రవారం నగరంలోని ఖిల్లా జూనియర్ కళాశాలలో చీఫ్ సూపర్రింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశం నిర్వహించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
DJ సౌండ్ ఓ వృద్ధురాలి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర బైపాస్ రోడ్లో జరిగింది. కలెక్టరేట్ వెళ్లే రహదారిలో నివాసముండే కె.భారతమ్మ (70) గురువారం రాత్రి తన ఇంటి సమీపంలో ఓ వేడుక జరుగుతుంటే చూడడానికి వెళ్లింది. అయితే అక్కడ DJ సౌండ్కు ఆమె అక్కడే కుప్పకూలగా హుటాహుటినా ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎడపల్లి పులి చెరువులో గురువారం సాలూర మండల కేంద్రానికి చెందిన మంగలి రమేశ్(35) గేదెలను కడగడానికి చెరువు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు.
నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చ్1న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.విజయ్ కాంత్ రావు తెలిపారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్ వద్ద ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. అండర్ 14, 16, 18 బాలికలతో పాటు మహిళ, పురుషులకు వేరువేరుగా ఎంపికలు ప్రక్రియ ఉంటుందన్నారు. ఎంపికైన వారిని హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు.
NZB జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 81 కేంద్రాలు ఉండగా, పట్టభద్రులకు సంబంధించి 48, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు ఉపాధ్యాయ నియోజకవర్గానికి 92.46% పోలింగ్ నమోదు కాగా, పట్టభద్రులకు సంబంధించి సంబంధించి 77.24% పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. బ్యాలెట్ బాక్స్లను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించారు.
2024-25 విద్యా సంవత్సరం ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం చీఫ్ సూపరింటెండెంట్ (CS)లు, డిపార్ట్మెంటల్ అధికారుల(DO) సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి (DIEO) రవికుమార్ తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు నిజామాబాద్ ప్రభుత్వ బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాలలో సమావేశం ఉంటుందని అందరూ హాజరుకావాలని ఆయన కోరారు.
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. కాగా పోలింగ్ ముగిసే సమయానికి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 76.78 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 92.46 శాతం పోలింగ్ నమోదయ్యింది.
టీచర్, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 49.93 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 66.22 శాతం పోలింగ్ నమోదయ్యిందని అధికారులు తెలిపారు. కాగా పోలింగ్ జరుగుతున్న సరళిని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ పలు సూచనలు చేశారు.
ధర్పల్లి మండలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. SI రామకృష్ణ వివరాలిలా.. ధర్పల్లిలోని చెరువులో గురువారం ఉదయం స్థానికులు ఓ మృతదేహాన్ని గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు 35- 40 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిగా గుర్తించామని, ఎవరైనా శవాన్ని గుర్తుపడితే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని SI వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.