India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వ్యక్తి హత్యకు గురైన ఘటన NZBలో జరిగింది. మద్నూర్‌కి చెందిన లక్ష్మణ్(30) లారీ క్లీనర్‌గా పని చేసేవాడు. శుక్రవారం కాలూరు కూడలి వద్ద తీవ్ర గాయాలతో పడిఉన్న లక్ష్మణ్‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతడిని ఎవరో తీవ్రంగా కొట్టినట్లు గుర్తించారు. GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాతకక్షలు నేపథ్యంలో హత్యచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
ఏ ఒక్క ఇల్లు కూడా వదిలిపెట్టకుండా హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో మండల ప్రత్యేక అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని అన్నారు. ప్రతీ ఇంటికి స్టిక్కరింగ్ చేశారా, లేదా అనేవి మండల ప్రత్యేక అధికారులు పరిశీలించాలన్నారు.
రూ.20 వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన వర్ని SI బి.కృష్ణ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు ACB అధికారులు తెలిపారు. అనంతరం కృష్ణకుమార్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. కాగా వర్ని మండలం కోటయ్య క్యాంపు గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వటానికి రూ.20 వేలు లంచం అడగగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన స్వామిగౌడ్ బైక్‌పై వస్తుండగా ఒక్కసారిగా టైరు పేలింది. దీంతో పక్కనే ఉన్న రోడ్డు సీలింగ్‌కు వేగంగా ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
నిబంధనలకు అనుగుణంగా 48 గంటల్లోపు రైతులకు బిల్లుల చెల్లింపులు జరిగేలా ఓపీఎంఎస్‌లో డాటా ఎంట్రీ చేయిస్తున్నామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శుక్రవారం అయన మాట్లాడుతూ.. రైతులకు సన్న ధాన్యానికి సంబంధించి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.2320 ముందుగా చెల్లిస్తామని తెలిపారు. అనంతరం రూ.500 బోనస్‌ను కూడా ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు.
లంచం తీసుకుంటూ నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్ఐ కృష్ణకుమార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఓ రైతు నుంచి రూ.20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆయనను ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. రైతు నుంచి లంచం తీసుకుంటూ ఎస్ఐ పట్టుబడడం పోలీసు శాఖలో కలకలం రేపింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భీమ్‌గల్ పట్టణంలో గురువారం విషాదం నెలకొంది. మోయిజ ఆనం అనే రెండేళ్ల చిన్నారి ఇంటి దాబాపై నుంచి పడి మరణించింది. నందిగల్లిలో చిన్నారి తన ఇంటి దాబాపై ఆడుకుంటుండగా.. దానికి పిట్ట గోడ లేనందున ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడింది. దీంతో తలకు తీవ్ర గాయాలు అయి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు .
భర్త వరకట్న వేధింపులు భరించలేక భార్య మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. NZB జిల్లా కమ్మర్‌పల్లికి చెందిన వికాసినికి మామడ మండలం న్యూలింగంపల్లికి చెందిన నవీన్‌కు 2019లో వివాహం జరిగింది. కొన్నిరోజులుగా భర్త నవీన్ అదనపు కట్నం కోసం ఆమెను వేధించేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త నవీన్ ఆందోళకు గురై పురుగు మందు తాగాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కామారెడ్డి పట్టణంలోని PMH కాలనీ సమీపంలో రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని మృతదేహం లభించింది. మృతుని వయస్సు 35-40 సంవత్సరాల మధ్య ఉంటుందని కామారెడ్డి SHO చంద్రశేఖర్ తెలిపారు. ఎక్కడో హత్య చేసి ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఇక్కడ పారేసినట్లుగా ఉందని ఆయన పేర్కొన్నారు. మృతుని ఒంటిపై తెలుపు రంగు షర్ట్, నీలం రంగు ప్యాంట్ ఉందని మృతునికి సంబంధించి వారు ఉంటే కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
ఆర్టీసీ స్పెషల్ బస్సులపై 20 శాతం ధరలు తగ్గించినట్లు నిజామాబాద్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జాన్ రెడ్డి తెలిపారు. శుభకార్యాలు విహారయాత్రలకు వెళ్లేవారు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వీటికి సైతం రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రీజనల్ పరిధిలో ఐదు ఆర్టీసీ డిపోలలో బస్సుల అవసరం ఉన్నవారు సంప్రదించాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.