Telangana

News December 3, 2024

వనపర్తి: యాక్సిడెంట్.. అక్కాతమ్ముడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన మనోజ్(25) అక్క పద్మ(31)ను ఆమె కుటుంబంతో కుంట్లూర్‌కు బయలుదేరారు. కోహెడ-పెద్దఅంబర్‌పేట ఔటర్‌రింగ్‌లో లారీ అకస్మాత్తుగా నిలపడంతో వేగంగా వస్తున్న వీరి కారు ఢీకొంది. ఈప్రమాదంతో మనోజ్, పద్మ మృతిచెందారు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News December 3, 2024

సంగారెడ్డి: భర్తను చంపిన భార్య

image

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మక్తక్యాసారంలో సోమవారం భర్తను భార్య హత్య చేసింది. సీఐ వివరాల ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన సంపత్(39) మక్తక్యాసారంకి చెందిన మంజుల దంపతులు. సంపత్ ప్రతిరోజు మద్యంతాగి గొడవపడే వాడు. సోమవారం మద్యం తాగి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి సంపత్ తలపై కట్టెతో కొట్టి వరండాలోకి పడేయంతో అతడి తలకి గచ్చుబండ తాకింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదైంది.

News December 3, 2024

నర్సింగ్ విద్యార్థిని సూసైడ్ అటెంప్ట్

image

సూర్యాపేట కలెక్టరేట్‌లో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం జరిగింది. కోదాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నానని.. కాలేజీ యజమాన్యం వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్టూడెంట్ చెప్పింది. కాగా ఆమె ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విద్యార్థినిని కలెక్టర్ తేజస్ నందలాల్ పరామర్శించారు.

News December 3, 2024

HYD: నేడు CAT 2024 ప్రొవిజనల్ కీ విడుదల

image

దేశవ్యాప్తంగా నవంబర్ 24న 170 నగరాల్లో నిర్వహించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)- 2024కు సంబంధించిన ప్రొవిజనల్ కీ డిసెంబర్ 3న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డిసెంబర్-5 రాత్రి వరకు iimcat.ac.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు. IIMలలో ప్రవేశానికి ఈ పరీక్షలో ప్రతిష్టాత్మక స్థానం ఉన్న విషయం తెలిసిందే.

News December 3, 2024

NZB: హాస్టల్‌లో విద్యార్థిని సూసైడ్

image

HYD బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నిజాంపేట్ ప్రగతినగర్‌లోని ఓ హాస్టల్‌లో ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ జిల్లా మోపాల్‌కు చెందిన ప్రగన్య(18) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కాగా సోమవారం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News December 3, 2024

NLG: ఉపసర్పంచ్‌ చెక్ పవర్ తొలగిస్తే పోటీ ఉంటుందా!

image

సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పంచాయతీరాజ్ యాక్ట్‌లో కొన్ని మార్పులు చేయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ తొలగింపు. సర్పంచ్ అవ్వాలనుకున్నవారు పోటీ చేసే అవకాశం రాకపోతే కనీసం ఉప సర్పంచ్ అవ్వాలనుకుంటున్నారు. ప్రభుత్వం చెక్ పవర్ తొలగింపు నిర్ణయం తీసుకుంటే ఉమ్మడి NLG జిల్లాలో సర్పంచ్ పదవి కోరుకునే వారికి ఇంట్రస్ట్ ఉంటుందా.. మీరేమంటారు..

News December 3, 2024

వరంగల్: జూ పార్కుకు రెండు పెద్ద పులులు

image

హనుమకొండ హంటర్ రోడ్‌లోని కాకతీయ జూ పార్కుకు జిల్లా అటవీ శాఖ అధికారులు రెండు పెద్ద పులులను తీసుకొచ్చారు. హైదరాబాదులోని నెహ్రూ జులాజికల్ పార్కు నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే జూపార్కులో చిరుత, ఎలుగు బంట్లు, జింకలు, నెమళ్లు ఇతర పక్షులు, జంతువులు ఉండగా.. ఇప్పుడు ఈ పెద్దపులులను తీసుకురావడంతో జూ పార్కుకు సందర్శకుల తాకిడి పెరగనుంది.

News December 3, 2024

HYDలో DEC2న దారుణాలు.. విషాదాలు

image

> చేవెళ్ల, VKB,కోహెడ, సికింద్రాబాద్, శంకర్‌పల్లి యాక్సిడెంట్ ఘటనల్లో 10మంది చనిపోగా 10మందికి గాయాలు.
> బాచుపల్లి, అన్నోజిగూడలో ఇద్దరు విద్యార్థులు, అల్వాల్‌లో మహిళ, హయత్‌నగర్‌లో వ్యక్తి సూసైడ్
> ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్, మునిపల్లిలో శంషాబాద్ వాసి, నేరేడ్‌మెట్‌లో వ్యక్తి హత్యలు
> జవహర్‌నగర్‌లో బాలికపై అత్యాచారం
> చేవెళ్ల, కాటేదాన్, పుప్పాలగూడ, దోమలో ప్రమాదవశాత్తు నలుగురు మృతి

News December 3, 2024

HYDలో DEC 2న దారుణాలు.. విషాదాలు

image

> చేవెళ్ల, VKB,కోహెడ, సికింద్రాబాద్, శంకర్‌పల్లి యాక్సిడెంట్ ఘటనల్లో 10మంది చనిపోగా 10మందికి గాయాలు.
> బాచుపల్లి, అన్నోజిగూడలో ఇద్దరు విద్యార్థులు, అల్వాల్‌లో మహిళ, హయత్‌నగర్‌లో వ్యక్తి సూసైడ్
> ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్, మునిపల్లిలో శంషాబాద్ వాసి, నేరేడ్‌మెట్‌లో వ్యక్తి హత్యలు
> జవహర్‌నగర్‌లో బాలికపై అత్యాచారం
> చేవెళ్ల, కాటేదాన్, పుప్పాలగూడ, దోమలో ప్రమాదవశాత్తు నలుగురు మృతి

News December 3, 2024

MNCL: పెళ్లైన 4 నెలలకే వివాహిత ఆత్మహత్య

image

పెళ్లైన 4నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఏసీసీలోని కృష్ణ కాలనీకి చెందిన అయిండ్ల రోషిణి కడుపు నొప్పి భరించలేక సోమవారం ఉదయం తల్లిగారింటి వద్ద మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి గత ఆగస్టులో బెల్లంపల్లికి చెందిన ప్రేమ్ కుమార్‌తో వివాహం జరిగింది. కాగా ఈ ఘటనపై ఎస్ఐ రాములు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.