India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వం నవ వధువుకు అందించే తులం బంగారం ఏదంటూ ఏకంగా ఓ పెళ్లి పందిరి లోనే నవ దంపతులు నిరసన వ్యక్తం చేసిన వినూత్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం ముఖరా(కే)లో గురువారం జరిగిన పెళ్లిలో నవ దంపతులు కాంబ్లె ఆమోల్ – గీతాంజలి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ‘రేవంత్ రెడ్డి గారు.. తులం బంగారం ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు.
నూతన DEO ఏ.శ్రీనివాస్‌రెడ్డిని పండోక్న మహాభారత్ కథా రచయిత తొడసం కైలాస్ కలిసి తాను రచించిన పుస్తకాన్ని బహూకరించారు. DEO మాట్లాడుతూ.. కైలాస్ గోండి భాషలో రచించడం అభినందనీయమని అన్నారు. మారుమూల గిరిజన పల్లెల్లో డ్రాపౌట్ పిల్లలను గత పదేళ్లుగా వారి చదువు కొనసాగేటట్లు ఓపెన్ స్కూల్‌లో జాయిన్ చేసినందుకు కైలాస్‌ను అభినందించారు. MEO సోమయ్య, AMO శ్రీకాంత్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గిరిజన తండాలు, వెనుకబడిన గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కార్యాచరణ ప్రణాళికతో పాటు, అంచనాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. దర్తి ఆబా యోజన పథకం కింద కల్పించే మౌలిక వసతుల విషయమై గురువారం ఆమె నందికొండ మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 11,15,16 తేదీలలో జరుగబోయే పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా పరీక్షలు యధావిధిగా టైం టేబుల్ ప్రకారం జరుగుతాయన్నారు.
ఇటీవల వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్, మయన్మార్ దేశాల్లో భూకంపం దాటికి భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయితే, రామగుండంలో ఏప్రిల్ 10-17 మధ్య భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నట్లు Epic (Earthquake Research & Analysis) తెలిపింది. తమ పరిశోధన, విశ్లేషణ ప్రకారం రామగుండంలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ట్విట్టర్‌లో పేర్కొంది.
నిజాంబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను ఆయన తల్లి అంత్యక్రియల అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయన విషయంలో గతంలోనే పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అందుకే గురువారం ఆయన దుబాయ్ నుంచి రాగానే అతని వద్ద ఉన్న పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ పోలీసులు ఆయన మీద పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
విధి నిర్వహణలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన గురువారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో చోటుచేసుకుంది. ఏరియాలో ఎస్ఆర్పీ 3 గని మేనేజర్ వద్ద కాంట్రాక్టు వెహికల్ డ్రైవర్‌గా పనిచేస్తున్న కోటేశ్ విధి నిర్వహణలో వాహనం నడుపుతుండగా గుండెపోటుతో మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హిమాయత్‌నగర్ సెక్టార్ బీమా మైదాన్ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. ‘గర్భిణులకు సరైన పోషకాహారం అత్యవసరం. అంగన్వా డీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. శిశు ఆరోగ్యం దేశ భవిష్యత్తు ఆధారం’ అని కలెక్టర్ పేర్కొన్నారు. DWO అక్కేశ్వరరావు, CDPO కృష్ణ చైతన్య, సూపర్‌వైజర్ బాలా, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
మానకొండూర్ మండలం అన్నారం చెరువు కట్ట పక్కన గల హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గత రాత్రి గుర్తుతెలియని దుండగులు తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించి హుండీలోని నగదుతో పాటు పది తులాల వెండిని దొంగిలించారని పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం(TJSS) ఉత్తమ జర్నలిస్ట్‌లకు ఉగాది పురస్కారానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వెలుగు ప్రతినిధి శ్రీధర్‌కు అవకాశం దక్కింది. ఈ నెల 12న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్. వి. రమణ, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు ప్రధానం చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.