Telangana

News June 23, 2024

HYD: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

జూన్ 24 నుంచి 29 తేదీల మధ్య జరిగే వసతి గృహ సంక్షేమాధికారి, జూన్ 30 నుంచి జులై 4 వరకు నిర్వహించే డివిజనల్ అకౌంట్స్ అధికారి నియామక పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. అందరూ ఈ విషయాన్ని గమనించాలని, నిబంధనలు పాలించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పోచారం?

image

పోచారం శ్రీనివాస్‌రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించాలని రేవంత్‌ సర్కార్ చూస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చనడుస్తోంది. కాంగ్రెస్‌‌లో చేరగానే ఆయనకు మంత్రి పదవి ఖాయమని, వ్యవసాయ శాఖ కూడా ఇస్తామని ప్రచారం జరిగింది. అయితే పదవి కోసమే తాను పార్టీలోకి వచ్చినట్లు అవుతుందని భావించి ఆయన పదవీ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో అతడిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించేందుకు అవకాశాలు ఉన్నాయి.

News June 23, 2024

HYD: బొగ్గు బ్లాకుల వేలం సింగరేణి దివాలాకే: తమ్మినేని

image

రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాలా తీయించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వేలం పాట ప్రారంభించిందని CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. HYDలో ఆయన మాట్లాడారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసి తర్వాత సింగరేణి మూతపడేలా కేంద్రం చేస్తుందని, దానిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించాలని కోరారు. అన్ని జిల్లాల్లో ఈనెల 28, 29న ధర్నాలు నిర్వహిస్తామన్నారు.

HYD: 138కు చేరనున్న ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య

image

HYD కూకట్‌పల్లి JNTU పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య 138కు చేరనుంది. ప్రస్తుతం వీటి సంఖ్య 139 ఉండగా గుర్తింపు పునరుద్ధరణలో భాగంగా ఈ విద్యా సంవత్సరం ఒక కళాశాల తొలగింపునకు యాజమాన్యం నుంచి వినతి అందింది. మల్లారెడ్డి కళాశాలల్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీని.. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో విలీనం చేస్తున్నట్లు JNTUకు దరఖాస్తు చేసిందని అధికారులు తెలిపారు.

BHPL: అనుమానాస్పదంగా ఉరేసుకొని వ్యక్తి మృతి

image

జయశంకర్ ​భూపాలపల్లి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉరేసుకొని మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని సుభాశ్ కాలనీలో జరిగింది. మృతదేహం కుళ్లిపోయి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు కొండపర్తి శివగా పోలీసులు గుర్తించారు.

News June 23, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాతం వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా కోస్గిలో 45.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా నవాబ్ పేటలో 35.0 మి.మీ, వనపర్తి జిల్లా పెబ్బేరులో 0.5 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ మరియు గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News June 23, 2024

సిరిసిల్ల: గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

image

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శనిగరం మహేశ్ కుమార్(45) ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఆయన ZPHS(B) గంభీరావుపేట గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. మహేశ్ ఆకస్మిక మృతి పట్ల పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు, మండల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.